కార్ల్ మార్క్స్

కార్ల్ మార్క్స్ Karl marx జర్మనీకి చెందిన తత్వవేత్త, రాజకీత ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు మరియు చరిత్రకారుడు. ఇతడు 1818 మే 5 న జన్మించాడు. 1848లో కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనే ప్రముఖ గ్రంథాన్ని రచించాడు. 1883 మార్చి 14న మరణించాడు.

కార్ల్ మార్క్స్
కార్ల్ మార్క్స్ యొక్క ముఖ్య కొటేషన్లు
శాస్త్ర విజ్ణానం స్వార్ధపూరిత భొగం కారాదు.
  • మానవ చరిత్ర గతిని నిర్ణయించేవి ఆర్థిక పరిస్థితులే కాని రాజకీయ, మత, సాంస్కృతిక పరిస్థితులు కావు.
  • ఏ సిద్ధాంతమైనా ప్రజాస్వామ్యంపై పట్టు సంపాదించితే అది శక్తివంతంగా మారుతుంది.
  • ఇప్పటివరకూ తత్త్వవేత్తలు చేసింది ప్రపంచాన్ని వివరించడం, ఇప్పుడు చేయవలసింది దానిని మార్చటం.
  • తాత్త్విక పరిశీలనకు ప్రాథమికావసరం నిర్భయమైన స్వతంత్రబుద్ధి.
  • శాస్త్రజ్ఞానం స్వార్థపూరితభోగం కారాదు.
  • గతి తర్కం అంటే బాహ్య ప్రపంచం, మానవుని ఆలోచన వీటి చలనానికి సంబంధించిన సాధారణ సూత్రాల విజ్ఞానమే.
  • గతి తర్కం దేనినీ పూజాపీఠంపై నిల్పదు. అది స్వభావరీత్యానే విమర్శనా దృష్టిగలది.
  • పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప.
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.