ఈ రోజు వ్యాఖ్యలు అక్టోబరు 2009

అక్టోబరు 2009 మాసములో మొదటి పేజీలో ప్రదర్సించబడిన ఈ రోజు వ్యాఖ్యలు:

  • అక్టోబరు 1, 2009: నీవెక్కాల్సిన రైలు జీవితకాలం లేటు. -- ఆరుద్ర
  • అక్టోబరు 2, 2009: స్వేచ్ఛగా జన్మించిన మానవుడు సర్వత్రా సంకెళ్ళతో బంధించబడి ఉన్నాడు. -- రూసో
  • అక్టోబరు 4, 2009: ఒకవేళ ప్రపంచంలోని మూర్ఖులందరూ చనిపోతే నేను ఒంటరిగా ఎలా జీవించాలో! -- మార్క్ ట్వెయిన్
  • అక్టోబరు 5, 2009: కొందరు పుట్టుకతో గొప్పవారు, కొందరు పుట్టిన పిదప గొప్పవారవుతారు, మరికొందరి మరణించిన తరువాత గొప్పవారవుతారు. -- విలియం షేక్స్‌పియర్
  • అక్టోబరు 7, 2009: తాంబూలలిచ్చేసాను, తన్నుకు చావండి. -- కన్యాశుల్కం నాటకంలో అగ్నిహోత్రావధాన్లు పాత్ర..
  • అక్టోబరు 10, 2009: నేను ఒక నియమం పెట్టుకున్నాను. నిద్రపోయేటప్పుడు పొగతాగకూడదని. -- మార్క్ ట్వెయిన్
  • అక్టోబరు 11, 2009: అనువుగానిచోట అధికులమనరాదు. -- వేమన
  • అక్టోబరు 13, 2009: ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. -- స్వామీ వివేకానంద
  • అక్టోబరు 15, 2009: సముద్రం ప్రశాంతంగా ఉన్నప్పుడు నౌకకు ఎవరైనా నాయకత్వం వహించగలరు, కెప్టెన్సీ కూడా అంతే. --నవజ్యోత్ సింగ్ సిద్ధూ
  • అక్టోబరు 17, 2009: ఆలోచనల పరిణామమే మనిషి. అతను ఎలా ఆలోచిస్తే అలా తయారౌతాడు. -- మహాత్మా గాంధీ
  • అక్టోబరు 18, 2009: పట్టువిడుటకన్నా పడిచచ్చుటేమేలు. -- వేమన
  • అక్టోబరు 21, 2009: నా కార్యక్రమం పనిచేయుటే కాని మాటలాడుట కాదు. -- ముస్సోలినీ
  • అక్టోబరు 22, 2009: నిజమైన ప్రేమకు అవరోధం లేదు. అది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. -- మదర్ థెరీసా
  • అక్టోబరు 23, 2009: ప్రభువెక్కిన పల్లకి కాదోయ్‌, అది మోసిన బోయీ లెవ్వరు?-- శ్రీశ్రీ
  • అక్టోబరు 25, 2009: మనవాళ్ళ బ్యాటింగ్ ఎలా ఉందంటే... సైకిల్ స్టాండులో ఒక్ సైకిల్ నెట్టేస్టే మిగితావన్నీ పడిపోయేట్టు.--నవజ్యోత్ సింగ్ సిద్ధూ
  • అక్టోబరు 26, 2009: మీ భార్య పుట్టిన రోజును జీవితాంతం గుర్తించుకోవాలంటే ఒక్కసారి మర్చిపోయి చూడండి చాలు. --జో బ్రాండ్.
  • అక్టోబరు 28, 2009: స్త్రీకి మాతృత్వం ఎంత అవసరమో, పురుషుడికి యుద్ధం అంతే అవసరం. -- ముస్సోలినీ
  • అక్టోబరు 30, 2009: అప్పులేనివాడె యధిక సంపన్నుడు. -- వేమన
  • అక్టోబరు 31, 2009: విలువైన ఆలోచనలు ఉన్న వారు జీవితంలో ఎన్నటికీ ఒంటరి వారు కారు--రూసో


ఇవి కూడా చూడండి

మార్చు