మదర్ థెరీసా: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 32 interwiki links, now provided by Wikidata on d:Q30547
పంక్తి 6:
*వందమందికి నువ్వు సహాయం చేయలేకపోవచ్చు, కనీసం ఒక్కరికైనా సహాయపడు.
*నిజమైన ప్రేమకు అవరోధం లేదు. అది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది.
*మీరు ప్రేమ లేకుండా అద్భుతాలు చేసే కంటే ,ప్రేమతో తప్పులు చేయుటయే కోరుకుంటున్నాను.
*"మౌనం యొక్క ఫలితం ప్రార్ధన
ప్రార్ధన యొక్క ఫలితం నమ్మకం
నమ్మకం యొక్క ఫలితం ప్రేమ
ప్రేమ యొక్క ఫలితం సేవ
సేవ యొక్క ఫలితం సంతృప్తి."
*దేనినైనా ప్రేమతో చేసి చుడండి,అది మీ జీవితాన్ని సంతోషపరస్తుంది.
*మనుష్యులలో తప్పొప్పులు చూస్తూవుంటే ఒకరోజు నీకు ప్రేమ చూపేందుకు అవకాశమే దొరకదు.
*మీరు చేసే తప్పు కూడా పునీతమవుతుంది, ఆ తప్పను మీరు ఒప్పుకుంటే.
*ప్రేమ అనేది మాటలలో వచ్చేది కాదు.
*ఓ కుష్ఠు వ్యాధిగ్రస్తుని దేహాన్ని తాకేటప్పుడు దేవుణ్ణి తాకుతున్నట్లే భావిస్తున్నాను.
*కరుణ గల మాటలు తేలికైనవి. మాట్లాడేందుకు అనువైనవి.
*చిన్న విషయాలు కదా అని అలక్ష్యం చూపకు. ధృడనిశ్చయం అనేది అక్కడే నిద్రావస్థలో వున్నది.
*పేదల యొక్క పేదరికపు రూపంలో దర్శనం ఇచ్చే యేసు ప్రభువుకు సేవను చేయండి.
*నూనె వేస్తూ ఉంటేనే దీపం వెలుగుతుంది. మనం ప్రేమ చూపిస్తుంటేనే మనపైన ప్రేమ అనే ప్రకాశం పడేది.
*మంచిని చెయ్యుట మీ ఇంట్లోనో,పాఠశాలలోనో,పనిలోనో చెయ్యనారంభించండి.
*రొట్టెల కోసం పరితపించే వాడి కంటే, ప్రేమకోసం పరితపించే వాడి పరిస్థితే పరితపించదగినది.
*మనకు ఒకరు సేవ చేసేకంటే, మనం ఇతరులకు సేవ చేయుటయే ఉన్నతమైనది.
*ప్రేమను నిరంతరం అలసత్వం లేకుండా పంచడంలోనే దానిలో పరిపూర్ణత్వం,విజయము నిండియున్నది.
*సంతోషమనేది చెంతన వుండే ఆత్మలను తనతోపాటు అల్లుకునేటటువంటి అద్భుతమైన వల.
*దివ్యత్వపు కరుణ లేకుండా నా వల్ల బ్రతుక వీలుకాదు.
*ఇతరులను నేసించుట వలన ఏర్పడే సంతోషం అమూల్యమైనది. ప్రేమను చూపించేందుకు,ప్రేమను పొందే ఒకే ఒక ఉద్దేశ్యంతోనే దేవుడు మనల్నందరిని సృష్టించియున్నాడు.
*ప్రేమ శాంతిని ఏర్పరస్తుంది. ఎందుకంటే అది జాతికి,మతానికి అతీతమైనది. పరిపూర్ణమైన ప్రేమ మాత్రమే ఈ ప్రపంచంలో ఐక్యమత్యానికి దారి చూపగలదు.
*పేదల కంటే పేద ఒకడు వస్త్రాలు లేకుండా వివస్త్రుడై ఉన్నాడంటే, అక్కడ మనుష్యకులం యొక్క గణ్యత నిర్వాణంగా యున్నది.
*పిల్లలు తల్లిదండ్రులు తెలియని వారుగా ఉండిఉండొచ్చు. నేనో,మీరో ఉన్ననంతవరకు వారు అనాధలుగా మిగిలియుండరు.
*ధనం,వస్తువులు లేనివారు పేదలు.మన ప్రేమకు పాత్రులైనవారైతే ధనం,వస్తువులు చేతిలో వుండి కుడా ప్రేమ కొరకు,స్వచ్ఛమైన ప్రేమ కొరకు పరితపించేవారు పరితపించదగునటువంటి పేదలు.
*నేను మిమ్మలిని మార్చేందుకు వచ్చాను,మతాన్ని కాదు మీ మనసులను. హిందువులను మంచి హిందువులుగాను, క్రైస్తవులను మంచి క్రైస్తవులుగాను,మహమ్మదీయులను మంచి మహామ్మదీయులుగాను ఉండగా వారివారి మనసులను మార్చేందుకు వచ్చాను.v
*మన్నించే స్వభావాన్ని కలిగియుండండి. మంచిని చేయండి,మంచిని చేసేందుకు ప్రేరేపించండి.
*"గర్భాన పెరిగే శిశువును దయచేసి ఎవరు చంపవద్దు.అది పుట్టిన పిదప మీకు అవసరం లేకపోతే,పెంచలేకపోతే వారిని నాకు అప్పగించండి,వారిని నేను పెంచుతాను."
*పేదరికం,వ్యాధులు చంద్రుడిలో కూడా ఉంటే గనుక అక్కడకు వెళ్లికూడా సేవ చేసేందుకు సిద్ధంగా వున్నాను.
*నిన్న అన్నది నా చేతిల్ని వీడిపోయినది.రేపు అనేది నా చేతిలోకి వస్తుందని చెప్పేందుకు అవకాశం లేదు. ఈ రోజే నా చేతిలో వున్నది. ఈ రోజు,ఈ దినం నా వల్ల పేదలకు, వ్యాధిగ్రస్తులకు ఏమి సహాయం చెయ్యగలనో దానిని చేసివేయాలి, ఆలస్యం చేయకూడదు.
*తగ్గించుకొనుట అనే ఆశీర్వాదము నాకు ఉన్నది.
*"నేను చేసే సేవ అనేది ఒక నీటి బిందువు అంతటిది మాత్రమే.కాని దాని ఆవశ్యకత ఒక సాగరమంత. ఆ ఒక బిందువును నేను చేర్చకపోతే సముద్రంలో ఒక నీటి బిందువు తగ్గిపోతుంది."
నేను ప్రతీ వ్యక్తిలోను దైవాన్ని దర్శిస్తాను.
 
[[వర్గం:1910 జననాలు]]
"https://te.wikiquote.org/wiki/మదర్_థెరీసా" నుండి వెలికితీశారు