జార్జి బెర్నార్డ్ షా: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 42 interwiki links, now provided by Wikidata on d:Q19185
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
;జార్జి బెర్నార్డ్ షా యొక్క ముఖ్య వ్యాఖ్యలు:
*భూమి మీద కుటుంబమే ప్రియమైన స్థలం, ఆత్మీయులకు కేంద్రస్థానం.
*జీవితం అంటే నిన్ను నువ్వు వెతుక్కోవటం కాదు. నిన్ను నువ్వు సృష్టించుకోవటం.
*అధికారం మనిషిని అవినీతిపరుణ్ని చెయ్యదు. మూర్ఖులు అధికారంలోకి వచ్చినప్పుడు అధికారాన్ని అవినీతిమయం చేస్తారు.
*అభ్యసించేవాడు జడం. చదువుతోనే కాలయాపన చేస్తాడు.
*కారణం తెలిసిన మనిషి ప్రపంచంతో సర్దుకుపోతాడు. కారణం తెలియనివాడు ప్రపంచమే తనతో సర్దుకుపోవాలంటాడు. కాబట్టి అభివృద్ధి కారణం తెలియనివాడి మీదే ఆధారపడి వుంటుంది.
సమాజంతో పోరాటమే ప్రగతి.
*అవకాశాన్ని వదులుకోకు.అది ప్రతిరోజు రాదు.
*సిగ్గుపడే పరిసరాల్లో మనం జీవిస్తున్నాం.
*ఎక్కువ విషయాలకు సిగ్గుపడేవాడు ఎక్కువ గౌరవనీయుడు.
*ఆదరణలేని ఆంగ్లేయుడు తను నీతిమంతుడవడమే కారణమని భావిస్తాడు.
*కంటినిండా ఆకలి గల మానవునితో మతాన్ని గురించి మాట్లాడలేను.
*ఆస్తి వ్యవస్థీకృత దోపిడీ.
*తోటి మానవులతో వైరం కంటే నిర్లిప్తంగా వ్యవహరించడం మరింత పాపం.
*నేను నన్నే ఉదాహరించుకుంటాను. అది నా సంభాషణకు మసాలా.
*దేవుడిని వెతకటానికి ఉద్యానవానమే సరైన స్థలం. కాకుంటే మనం తవ్వి చూడాలి.
*నరకం కుడా మంచి ఉద్దేశ్యంతోనే ఏర్పరచబడింది.
*ఎక్కువ గంటలపని తక్కువ జీతం ఉపాధ్యాయులకు మంచిది కాదు.
*పుట్టిన ప్రతివాడికి ఓటమి జీవితంలో ఒక భాగం.
*కళల్లో మనకు అందని మాయ వుంది మర్మము వుంది.
*దేవుడు ప్రపంచాన్ని కళాత్మకంగా మలిచాడు. అందుకే మానవుడు కళాకారుడి నుండి పాఠాలు నేర్చ్కోవాలి.
*నిజమైన కళాకారుడు తన భార్యను ఆకలితో మాడుస్తాడు.పిల్లల్ని గాలి కొదిలేస్తాడు.
*ప్రయత్నిస్తే క్రీస్తు మతం అభిందించతగినది.
*కులం ఓ ముఖ్యవృత్తి,అయితే పిల్లల్ని కనడంలో మాత్రం ఏ అర్హత పాటించబడటం లేదు.
*జీవితంలో రెండు విచారాలున్నాయి. ఒకటి నా మనసులో వున్న కోర్కె,రెండవది దాన్ని సాధించడం.
*భూమి మీద కుటుంబమే ప్రియమైన స్థలం. ఆత్మీయతలకు కేంద్రస్థానం.
*ఇల్లు బాలకులకు కర్మాగారం, స్త్రీలకు పనిచేసే కర్మాగారం.
*నిజమైన గొప్పవాళ్ళను తోటివారు అరుదుగా మాత్రమే గుర్తిస్తారు.
*చరిత్ర పునరావృతం అయితే, అనుకోనివి సంభవిస్తాయి. మన అనుభావాన్నుంది నేర్చుకుందేమిటి.
*తప్పుడు జ్ఞానానికి దూరకండి. అది అవివేకం కంటే ప్రమాదకరం.
*జీవితం ఓ మంట. దాన్ని అదే కాల్చుంటుంది.కాని మరల ఓ బిడ్డ జననంతో మంట తిరిగి ప్రారంభం అవుతుంది.
*జైళ్ళంటూ వున్న తర్వాత అందులో ఎవరున్తున్నరనేది అంత ముఖ్యం కాదు.
*సమయం అసంఖ్యాకమైన తప్పులను దాచివేస్తుంది.
*తాత్వికుడు ప్రకృతికి దారి చూపుతాడు. అక్కడే మనకున్న తేడ నరకంలో కొట్టుకుపోవడమో,స్వర్గంలో నడిపించడమో.
*ఇతరులు తప్పులు చేస్తుంటే నేను ఒప్పులు చేస్తాను.అది నా ప్రత్యేకత.
*దేశభక్తిని మానవ జాతి నుండి విచ్చిన్నం చేస్తే తప్ప ప్రపంచశాంతి ఏర్పడదు.
*అవమానం పాలైన పిరికివాడు తీర్చుకునే ప్రతీకారమే ద్వేషం.
*డబ్బు లేకపోవడం ఎన్నో పాపాలకు కారణం.
*ద్వీపకల్పం లేని నదులు జుట్టులేని స్త్రీ వంటివి.
*చదువు దాన క్విక్సోట్ ని గౌరవనీయుణ్ణి చేసింది. చదివిన్దంతా నమ్మడం అతణ్ణి పిచ్చివాణ్ణి చేసింది.
*మనల్ని చూసి మనుషులు నవ్వడం కంటే మనిషి చనిపోయినప్పుడు పడే బాధ ఎక్కువేమి కాదు.
*ఎలా ఆలోచించాలో తెలిసిన తర్వాత నా ఆలోచనలపై ఇతరుల ప్రభావం లేదు.
*ఆర్ధికవేత్తల నందరిని సమావేశపరచితే కూలకషంగా చర్చించి కూడా ఒక నిర్ధారణకు రాలేరు.
*నిరాకరణకు ఖచ్చితమైన అభినయం నిశ్శబ్దం.
*నిషేధం హత్యకు ఉపయోగించే అతిక్రూరమైన విధానం.
*నిష్కపటంగా ఉండటం ప్రమాదకరం.ఒకవేళ నువ్వు కూడా పిచ్చివాడివైతే తప్ప.
*నువ్వు నేను చేసేపని ఆపితే పీడిస్తున్నావనుకుంటాను. నువ్వు చేసే పనిని అపదాన్ని మాత్రం న్యాయం,నీతి అనుకుంటాను.
*ఏ కార్యాలయానికి వెళ్ళే పనిలేని వాడు aNTE అతనికి పని చెయ్యాలనే లేనివాడు.
*అన్నిటికంటే చెడు, మోసాలన్నింటిలో అతి చెడ్డది పేదరికమే.
*చాలా తక్కువ మంది మాత్రామే పేదరికాన్ని భరించగలరు.
*పాత దుస్తులు ధరించినా ఫరవాలేదుగాని, కొత్తపుస్తకాలు కొనాలి.
*నా జీవితంలో నేను పొగాకు, అసహజమైన ప్రమాదకరమైన ఈ అభ్యాసం ఎలా జరిగిందో ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూస్తారని నేను చూస్తున్నాను.
*అసలేమి చేయని జీవితం కంటే తప్పులు చేస్తూ, ఏదో ఒక పనిచేస్తూ ఉండటమే గౌరవప్రదం, ఉపయోగం కూడా.
*ఈ ప్రపంచంలో విశాదమేమంటే ప్రజ్ఞావంతులకు గౌరవం లేకపోవడమే.
*పనికిరాని జనాలు అవినీతికర నాయకుల్ని ఎన్నుకొనే విధానమే ప్రజాస్వామ్యం.
*నాయకులు చేసే గోప్పపనులను బట్టిగాక సామాన్య పనులను అతిలాఘవంగా చేసే సామాన్యప్రజలను బట్టి ప్రజాస్వామ్యాన్ని సరితూచగలం.
*ప్రపంచం ఎలా ఉంటే అలా స్వీకరించు.
*క్రూరత్వాన్ని నీతి భోధనతోను,సహనాన్ని నటించి మార్చవచ్చు.
*శక్తి లేకున్నా ప్రాణత్యాగి ప్రసిద్ధుడవుతాడు.
*ప్రేరేపణను ఎప్పుడు అణచుకోకు.అన్ని విషయాలను నిర్ధారించుకో. ఏది మంచి అయితే దాన్ని త్వరగా అందుకో.
*ఏ మనిషికి తన భాష మీదే పట్టు ఉండదు. అంతేకాదు ఇతర భాషలపై సాధికారత వుండదు.
*వందరకాల రీతులు ఉండవచ్చు, దేవుడు మాత్రం ఒక్కడే.
*తెలివైన వాడికంటే తాగినవాడే సంతోషంగా వున్నట్లు. నేడు సంశయించే వాడికంటే నమ్మేవాడే సంతోషంగా జీవిస్తున్నాడు.
*మార్పులేనిదే అభివృద్ధిలేదు. మనసు మారందే మనం దేన్నీ మార్చలేం.
*స్నేహితుడులేని జీవితం సాక్ష్యంలేని కేసు వంటిది.
*మంచితనం సరైన సిద్ధాంతమని మన పిల్లలకు చెప్పాలంటే మొదట మన ప్రపంచాన్ని మంచిగా తీర్చిదిద్దాలి.
*అతనికే తెలియదు,కాని అన్ని తెలుసనీ తలుస్తాడు. అది రాజకీయ వృత్తి అవసరం.
*మనిషి రాజ్యాంగాన్ని శక్తివంతంగా తయారు చెయ్యలేదు. ఏ సాక్ష్యం చూసినా అది నిజమేననిపిస్తుంది.
*దేనికైనా పేరు పెట్టాలంటే దాన్ని వర్గీకరించాలి.
*స్వర్గంలో దేవతలకు వ్యక్తిత్వం లేదు.
*గత స్మ్రతులు మనిషిని వృద్ధునిగా,బాధితునిగా మారుస్తాయి.
*ఒక మనిషిని ఎదుర్కోలేనంతటి సంస్యవైపుకి నెడితే అప్పుడు వాస్తవాలు,విలువలు,తార్కికత అనూహ్యంగా ఏది గుర్తురాదు.
*ప్రభుత్వ వైద్య విభాగాల్లో ఎన్నో అపవాదులు,అది నిజం.
*చెయ్యగలిగినవాడు చేస్తాడు, చెయ్యలేనివాడు చెబుతాడు.
*విప్లవం అణచివేతను తెలికపరచలేదు. అధికబరువు ఓ భుజం నుండి మరో భుజానికి మారింది.
*విప్లవకారులంతా, ప్రభుత్వ బాధ్యత తీసుకొని తర్వాతా పరిపాలకులుగా మారిపోతారు.
*విప్లవ సంఘటనలు సమాజంలోని మంచివాళ్లను , చెడ్డవాళ్లను కూడా ఆకర్షిస్తాయి.
*దైవాన్ని పూజించడం,వ్యవహారిక జీవనాన్ని గడపడం విరుద్ధ భావనలు కావు.
*శాస్త్రం సామాన్యమైనది లోతైనది. అర్ధసత్యలే ప్రమాదం.
*ప్రపంచంలో సోకిన్చాదగినవి రెండే. ఒకటి కావలసింది దొరకకపోవడం,రెండు తీరడం.
*నరకం సంగీతం నేర్చుకొనేవాళ్ళతో నిండి వుంటుంది.
*అవసరం ఉన్నంతవరకు జీవించడానికి కారణం ఉంది. సంతృప్తి చెందడమంటే మరణమే.
*ఓ జీవితకాలపు సంతోషాన్ని ఎవరు భరించలేరు. అది భూమ్మీద నరకం వంటిది.
*మాట్లాడటం వచ్చినంతమాత్రాన సంభాషించడం వచ్చినట్లు కాదు.
*ఏదైనా నీకు హాస్యాస్పదంగా కనిపిస్తే దాని వెనుక దాగివున్న సత్యాన్ని అన్వేషించు.
*అన్ని సత్యాలు దైవ నిందతోనే ప్రారంభమవుతాయి.
*నా హాస్యం చెప్పే పద్ధతి సత్యాన్ని చెప్పడానికే.అది ప్రపంచంలోనే అందమైన హాస్యం.
*నరకానికి నిర్వచనమే సెలవుదినం.
*సరిపోని ఆకర్షణే సుగుణం అంటాం.
*భావం, సిద్ధాంతము కాదు సుగుణం అంటే. అదో అలవాటు.
*సుగుణమంటే పాపాన్ని వదులుకోవడం కాదు. సుగుణాన్ని కోరుకోవడం.
*సైనికుడు ఆలోచిస్తాడని నేను అనుకోను.
*స్వేచ్ఛ అంటే బాధ్యత.అందుకే ఎక్కువ మంది భయపడతారు.
*నీకు ఇతరులు ఏమి చెయ్యాలని కోరుకుంటావో నువ్వు వారికి అదే చెయ్యాలని కోరుకోకు. వారికి భిన్న అభిప్రాయాలు ఉండవచ్చు.
 
{{wikipedia}}