అరిస్టాటిల్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 49 interwiki links, now provided by Wikidata on d:Q868
పంక్తి 14:
*వ్యాధిని వైద్యుడు తగ్గిస్తాడు, ప్రకృతి మామూలుగానే నయం చేస్తుంది.
*సన్మానం పొందడంలో గొప్పదనం లేదు. దానిని పొందడానికి నీకున్న అర్హతలోనే గొప్పదనం వుంది.
*అర్థం చేసుకున్నది వివరించాలి. తెలుసుకున్నది చేయాలి.
*మితిమీరిన ఆశలకు పోయేవారే ఎక్కువగా మోసాలకు గురి అవుతూ ఉంటారు.
*విప్లవాలు,నేరాలనేవి పేదరికం నుంచే పుట్టుకొచ్చాయి. మానవుడు సంఘజీవి.
*ఆశ అనేది నడుస్తున్న కల వంటిది.
*స్నేహమనేది రెండు దేహాలలో ఉండే ఒక ఆత్మ.
*అన్ని రకాల అల్లర్లకు, అపరాధాలకు మూలకారణం దారిద్ర్యమే.
*కోపం రావడం మానవ సహజం, ఐతే దాన్ని ఎప్పుడు,ఎక్కడ,ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞత.
*ఒక దేశంలో అనేక స్వభావాలు గల ప్రజలు నివసిస్తున్నారు. వీరినందరిని ఒకటిగా చేర్చేందుకు విద్యావిధానం అనేదే అవసరమైన సాధనం. దీనిని వదిలి చట్టం మూలంగానో, సంస్క్రతి,సంప్రదాయాల మూలంగానో ఒక్కటిగా చేర్చడం తెలివి తక్కువతనం.
*నేర్చుకన్నవాడికి, నేర్చుకోలేని వాడికి మధ్య ప్రాణమున్న వాటికి, ప్రాణం లేనివాటికి మధ్య గల తేడా గలదు.
*సమాజంలో మంచివాడిగా మారిన మానవుడు అన్ని ప్రాణుల కంటే గొప్పవాడు, అతడే చట్టాన్ని, నీతిని వదిలి పెట్టి జీవిస్తే అతని కంటే భయంకరమైంది ఏది లేదు.
*ఒక నగరం మంచి చట్టాలతో పరిపాలించబడే కంటే , ఒక మంచి వ్యక్తిచే పరిపాలింపబడుట గొప్పదగును.
*అందం దేవుడిచ్చిన వరం.
*ఆశ ఓ పగటి కల.
*ఆశ మేలుకొంటున్న స్వప్నం.
*సన్మానం పొందడంలో గొప్పదనం లేదు. దానిని పొందడానికి నీకున్న అర్హతలోనే గొప్పతనం ఉంది.
*మానవుడు ఆలోచించే జంతువు.
*ప్రజల భాషలో మాట్లాడాలి. మేధావులలా ఆలోచించాలి.
*కళ అంటే వస్తువు రూపం కాదు. ఆ రూపం అంతర్గత స్వభావం.
*సరైన సమయంలో సరైన కారణంతో సరైన విధానంలో కోప్పడటం సులభం కాదు.
*నీ గొప్పతనం నువ్వు పొందిన బిరుదుల్లో లేదు. దానికి నీకున్న అర్హతలో వుంది.
*మనిషి ప్రకృతి సిద్ధంగా రాజకీయ మృగం.
*పని ముగించడమంటే తీరిక మొదలు కావడమే.
*ప్రజలు నగరాలకు ప్రేమగా వస్తారు. వాళ్ళు మంచి జీవనం కోసం కలిసే వుంటారు.
*నేను ప్రజలను అనుసరిస్తాను, నేను వారికి నాయకుణ్ణి కాను.
*జీవిత సగాభాగంలో బద్ధకస్తులకు,బలమైన వారికి పెద్దగా తేడా లేదు. ఎందుకంటే నిద్రావస్థలో తేడాలేదు కనుక.
*సాధువు మెదడులోనైనా ఏదో ఒక మూల మూర్ఖ లక్షణాలుంటాయి.
*ఎంతో కొంత పిచ్చిలేని పరిశుద్ధాత్మ లేదు.
*విప్లవానికి,మోసానికి పేదరికమే మాతృక.
*ఎంతో కొంత పిచ్చిలేని ప్రజ్ఞావంతుడు వుండడు.
*అన్నింటిలోను మనం సమానులమే అనే భావనలను కల్గించడమే ప్రజాస్వామ్యం.
*పాపాన్ని పాపంతోనే ఎదుర్కోవడం మనిషి తన హక్కు అనుకుంటాడు. అలా చేయకుంటే స్వేచ్ఛ పోగొట్టుకున్నానా అని భావిస్తాడు.
*ప్రజలు ఎవరిని చూసి భయపడతారో వారిని ప్రేమించలేరు.
*గొప్ప రాజకీయ సామాజికవర్గం మధ్య తరగతి నుండే ఉద్భవిస్తుంది.
*జీతం తీసుకొని పని చేసే వారి మెదళ్లు హీనమై నశిస్తాయి.
*యువకులు స్తిరంగా మత్తెక్కించే ఓ స్థితిలో వుంటారు. ఎందుకంటే యవ్వనం మధురమైనది.
*వైద్యుడు తగ్గిస్తాడు,ప్రకృతి మాములుగా నయం చేస్తుంది.
*ఓ వర్గానికి భోగముగా భావించిన విద్య నేడు సమాజానికంతతికి అవసరమైనదిగా పరిణమించింది.
*మానవాళిని పరిపాలించాలనే కళను పెంపొందించుకోవాలంటే ఆ రాజ్యపు యువకులు విద్యపై ఆధారపడి వుందని నమ్ముతున్నారు.
*విప్లవాలు వ్యర్ధంకాదు,కాని వ్యర్ధం నుండి జనించాయి.
*విప్లవాలు ముఖ్యమైన సిద్ధాంత భావనలతో ముందుగా ఐక్యం అవుతాయి.
*చిన్న విషయాలతో కలవరం పుట్టి గొప్ప సమస్యలను పరిష్కరిస్తాయి.
*శాసనమంటే మంచి క్రమశిక్షణే .
*శాసనానికి అభిమానంతో ముడిపడని కారణం కావాలి.
*అసమాతల్లో భయంకరమైనది అసమాన వస్తువుల్ని సమాన వస్తువ్ల్ని చేయడం.
*కొన్ని వృత్తులు వుంటాయి.అందులో సుగుణంగా ఉండటం సాధ్యం కాదు.
 
==బయటి లింకులు==
"https://te.wikiquote.org/wiki/అరిస్టాటిల్" నుండి వెలికితీశారు