గౌతమ బుద్ధుడు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 35 interwiki links, now provided by Wikidata on d:Q9441
పంక్తి 5:
*ముందు తను వెళ్ళాల్సిన దారిని తనకుతాను నిర్దేశించుకున్నవాడే ఇతరులకు దారి చూపించగలడు.
*సూర్యుడు, చంద్రుడు, సత్యం ఈ మూడింటిని దాచలేము.
*ఒక వ్యక్తి పవిత్రమైన ఆలోచనలతో మాట్లాడినా లేక పనిచేసినా, ఎప్పటికి అతన్ని వీడని నీడలాగా ఆనందం అతని వెన్నంటే ఉంటుంది.
*ఆశ దుఃఖానికి హేతువు అవుతుంది, ఆశ నుండి విముక్తి పొందితే దుఖం అంతమవుతుంది.
*నా మతం అందరి మంచి కోసము, ఎందుకంటే అందరి మంచితోను అందరి ఆనందము ఉంది. ఇది ఆదిలో మంచిది, ఇది మధ్యలో మంచిది, ఇది అంతములో మంచిది.
*నీ భాధకు కారణం ఏదైనా కావచ్చు. కానీ ఆ కారణంతో ఇతరులకు మాత్రం హాని చేయకు.
*వేలాది వ్యర్ధమైన మాటలకన్న విన్నంతనే శాంతిని ,కాంతిని ప్రసాదించే మంచి మాట ఒక్కటి చాలు.
*అహంకారం, మమకారం అంతరించినపుడే పరిపూర్ణ శాంతి లభిస్తుంది.
*త్యాగం,దానం ...ఈ రెండు ప్రతి మనసును ఆకర్షిస్తాయి.
*ఒక దీపం నుంచి వేల దీపాలను వెలిగించవచ్చు. సంతోషం కూడా అలాంటిదే.
*అన్ని జీవుల యెడల దయ చూపించినవాడే ఎక్కువ గౌరవనీయుడు.
*ఇతరుల తప్పుల్ని గమనించడం తేలిక,తన తప్పుల్ని గమనించడం కష్టం.
*ఎన్నడు ఈ ప్రపంచంలో ద్వేషాన్ని ద్వేషంతో ఆపలేము. ద్వేషించకుంటే మాత్రమే ద్వేషాన్ని నివారించగలం. ఇది ఎప్పటికి వర్తించే సూత్రం.
*వెయ్యి కోరికలను తీర్చుకోవడం కంటే ఓ కోరికను జయించడంలోనే ఆనందం.
*మనం చేసే మంచి పనులైనా, చెడు పనులైనా నీడలా మనల్ని వెంటాడుతూనే వుంటాయి.
*వయోవ్రుద్ధులను ఆరాధించువారు ఆయురారోగ్యములతో వర్ధిల్లును.
*పాపకృత్యములు చేయకుండుట, సుభకర్మలు ఆచరించుట, చిత్తమును పరిసుద్ధము చేసుకొనుట నిజమైన వ్రతం.
*ఓర్పుకు మించిన గొప్ప ప్రార్ధన మరొకటి లేదు.
*మనసు అదుపులో ఉంటే ఆనందమే.
*ఇతరుల గురించి, నీ గురించి నీకు మంచి అభిప్రాయం ఉంటేనీవు మంచిని,నిజమైన దాన్ని గూర్చి మాత్రమే మాట్లాడు. ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చెయ్యి అప్పుడు నీకు మోక్షమార్గం సులభంగా అలవడుతుంది.
*మనుష్యుడు తన నిశ్చల మనస్సు తోటి పూర్తి నమ్మకం తోటి ప్రయత్నం చేయకుంటే అనుకున్న లక్ష్యం సాధించలేడు.
*ఒక మనిషికి మోక్షం లభిస్తే ఈ జనన మరణ సంకెళ్ళ నుండి విముక్తి పొందినట్లే కనుక నిర్వాణం సాధించడానికి ప్రయత్నించాలి.
*ముందు తను వెళ్ళాల్సిన దారిని తనకుతాను నిర్దేశించుకున్నవాడే ఇతరులకు దారి చూపించగలడు.
*సూర్యుడు, చంద్రుడు, సత్యం ఈ మూడింటిని దాచలేము..
*[[http://teluguquotations.blogspot.in/search/label/G]]
 
{{wikipedia}}
"https://te.wikiquote.org/wiki/గౌతమ_బుద్ధుడు" నుండి వెలికితీశారు