ఆల్బర్ట్ ఐన్‌స్టీన్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 53 interwiki links, now provided by Wikidata on d:Q937
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
* ఉన్న జ్ఞానానికన్నా ఊహ గొప్పది.
* వ్యక్తిగా ప్రతీవారినీ గౌరవించు. కానీ విగ్రహంగా మార్చకు. (పూజించకు)
* నేను కొత్తగా కనుగొన్నది ఏమి లేదు. సృష్టించింది ఏమి లేదు.నేను నా పూర్వీకుల భుజాలపై నుండి మరింత దూరంగా స్పష్టంగా చూడగలిగాను అంతే.
* ఒక సిద్ధాంతంలో,మనం గమనించిన సత్యాలు ఇమడకపోతే,వదలాల్సింది సిద్ధాంతాన్ని కాదు,సత్యాలనే.
* రెండే రెండు విషయాలు అనంతమైనవి.ఒకటి ఈ విశ్వం,రెండోది మానవుడి మూర్ఖత్వం.అయితే విశ్వం అనంతమో కాదో అన్న విషయంలో నాకు సందేహం ఉంది కానీ,మానవుని మూర్ఖత్వం విషయంలో లేదు.
* సూత్రాల వల్ల మనిషికి వాక్ స్వాతంత్ర్యం రాదు.ప్రతి వ్యక్తికీ తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వ్యక్తపరిచే స్వేచ్చ ఉండాలంటే ప్రజలందరిలో విమర్శను భరించే సహనం ఉండాలి.
* విజ్ఞాన శాస్త్రాభివృద్ధి అనే హారంలో ఒక పూవుతో మరో పూవును కలిపే దారపు ముక్కవంటి వాడిని నేను.నేను వదిలిన స్థలం నుండి ఈ మాలను నా విద్యార్ధులు పెంచుతూ పోతారు.
* మనిషి తన శరీరానికి పరిమితమై అహంకారాన్ని ప్రదర్శించ కూడదు.తాను అనంత విశ్వంలో భాగాన్నని అర్ధం చేసుకొని ఆత్మగౌరవంతో ప్రవర్తిస్తే ప్రపంచంలో శాంతి నెలకొంటుంది.
* నా జీవితాన్ని వ్యర్ధం చేసుకున్నానని తరచూ నాకు అనిపిస్తుంది.నేను ఇంత కాలం సుదూరంగా ఉన్న నక్షత్ర మండలాన్ని అన్వేషించాను. కాని నా అంతరాలలోని 'నేను' అన్న అతి చిన్న సమీప నక్షత్రాన్ని గురించిన అన్వేషణ చేయనేలేదు.
* జీవితం సైకిల్ ప్రయాణం. అదుపు తప్పకుండా ఉండాలంటే తొక్కుతునే ఉండాలి.
* బడిలో నేర్చుకున్న పాఠాలన్ని మర్చిపోయినా విద్య ఎప్పుడూ మిగిలే ఉంటుంది.
* చిన్న పనులను నిర్లక్ష్యంగా చేసేవారు జీవితంలో పెద్ద విజయాలను సాధించలేరు.
* తోటి వారితో అవగాహన చాలా ముఖ్యం. ఈ అవగాహన ఫలవంతం కావాలంటే మాత్రం సంతోషంలో,భాధలో ఒకరికొకరు నిలబెట్టుకోవాలి.
* ఖాళీ కడుపులతో వుంచడం సరైన రాజనీతి కాదు.
* జ్ఞానికన్నా ఊహ గొప్పది.
* నాకు గణితం మీద నమ్మకం లేదు.
* జాతీయత పుట్టుకతో వచ్చే వ్యాధి. అది మానవ జాతికి మశూచి.
* తెలివి,శక్తి కొద్ది సార్లే కలిపి విజయాన్ని సాధిస్తాయి. అది కూడా కొద్ది సేపు మాత్రమే.
* స్వార్ధం నుండి విముక్తి పొందినప్పుడే ఆ మనిషి విలువ అంచనా వేయబడుతుంది.
* నా విజ్ఞాన శాస్త్ర పరిశోధనలకు , నూతన సిద్ధాంతాలను రూపొందించడానికి నేను భగవద్గీతను ప్రధానమైన ఉత్సాహ కేంద్రంగా మార్గదర్శకంగా స్వీకరించాను.
* భవిష్యత్తు గురించి ఆలోచించాను, త్వరలోనే వస్తుంది కాబట్టి.
* ప్లుటోని(గ్రహం) వంచైనా మార్చవచ్చు నేమొగాని మనిషి ఆత్మలోని పాపాన్ని మాత్రం మార్చలేము.
* ఎంతటి తుచ్చమైన దుష్టమైనది యుద్ధం. అంతటి లోతైన యుద్ధంలో పాల్గొనడం కంటే నేను ముక్కలు ముక్కలుగా చిన్నాభిన్నంగా అవడానికే అంగీకరిస్తాను.
* నా సాపేక్ష సిద్ధాంతం నిజమని తేలితే జర్మని వాళ్ళు నన్ను జర్మన్ అంటారు. కాకుంటే యూదు జాతియున్ని అంటారు.
* అమలు చేయని శాసనాలు ప్రభుత్వానికి ఎక్కువ హానికరం,అగౌరవం.
* శాస్త్ర విజ్ఞానమంతా ప్రతిరోజూ వచ్చేఆలోచనలకు నిర్మలత్వం.
* దేవుడు జగత్తుతో పాచిక లాడుతాడు.
* గొప్ప వ్యక్తులకు సాధారణ వ్యక్తుల నుండి తీవ్ర వ్యతిరేకత సహజం.
* ప్రకృతికి దగ్గరగా ఉంటే ...జీవిత సత్యాలు వాటంతటవే తెలుస్తాయి. సంతోషమయమైన జీవితం గడపాలంటే, లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలే కాని మనుషులను, వస్తువులను లక్ష్యంగా పెట్టుకోకూడదు.
 
==మూలాలు==
<ref>http://teluguquotations.blogspot.in/</ref>
<references/>
 
{{wikipedia}}