పురాణం సుబ్రహ్మణ్యశర్మ: కూర్పుల మధ్య తేడాలు

'== వ్యాఖ్యలు == === ఇల్లాలి ముచ్చట్లు నుంచి ===' తో కొత్త పేజీని సృష్టించారు
 
పంక్తి 1:
== వ్యాఖ్యలు ==
=== ఇల్లాలి ముచ్చట్లు నుంచి ===
==కొన్ని ముచ్చట్లు==
ఈ శీర్షికలోని వ్యాసాలనుండి కొన్ని ముచ్చట్లను ఇక్కడ ఉదహరించటం జరిగింది.
*'''ఎన్నికలలా''' వ్యాసం నుండి-"...వాళ్ళకు జాతీయ పతాకానికి, కాంగ్రెసు జండాకి వున్న తేడా తెలీదు. ఇలాంటి ప్రజలుంటారనే మన నెహ్రూగారు కాంగ్రెసు జండాలో రాట్నం పీకిపారేసి చక్రం పెట్టారు. ఆ జండా ఈ జండా ఒకటే అనే భావం కలిగేలా జాతీయ పతాకాన్ని రూపొందించకుండా వుండవలసింది.
*'''గోవూవత్సం''' వ్యాసం నుండి-..."ఆడదానికొచ్చే బాధలన్నీ వ్యక్తిగతమైనవికావు. సమాజం అమె నెత్తిమీద రుద్దినవి....."
*'''మూడే రంగులు''' వ్యాసం నుండి..."ఏయ్! రిక్షావాలా! కాలవంటే తెలుసు కదా! నహర్ అంటే కాలవట. కాలవ పక్కనుండే వాళ్ళు కనుక నెహ్రూలన్నారట: కాలవ పక్కనుండే మీవాళ్ళంతా నెహ్రూ లౌతారట్రా ఇడియట్!(దాదాపు 1990ల వరకు విజయవాడలో ఏలూరు కాలవ, బందరు కాలవ, రైవస్ కాలవల ఒడ్లమీద బీదవాళ్ళు-రిక్షావాళ్ళు తదితరులు- గుడిసెలు వేసుకుని జీవితాలు ఈడుస్తూ ఊండేవారు. వ్యాసంలోని ఈ వ్యాఖ్య, రచయిత వ్యంగ విమర్శనా పటిమకు పరాకాష్ట)
*'''ధర్మ దర్శనం''' వ్యాసంనుండి ...."స్వర్గం, మోక్షం ఎంత మంచివైనా, ఎవరో దిక్కుమాలిన వాళ్ళకూ అభాగ్యులకూ తప్ప, ఎవరికీ స్వర్గస్థులం కావాలని వుండదు, అదేమి చిత్రమో..."
*'''దడిగాడువానసిరా''' వ్యాసం నుండి..."జెరూస్లెంలో ఆక్రోశకుడ్యమని ఏడవటానికి ఓ గోడ కట్టేరుట. ఆ గోడదగ్గరకు వెళ్ళి ఏడిస్తే మనశ్శాంతి లభిస్తుందట. అలాటి ఎన్నో గోడలు మనకి కావాలే....మన బ్రతుకులు తల్చుకుంటే ఏ గోడకేసి తిరిగినా ఇంట్లో ఏడుపొచ్చేస్తుందే. మరి మనం వేరే ఎక్కడికి వెళ్ళనక్కర్లేదే....."
*'''తారుమారు బలే పెళ్ళి''' వ్యాసం నుండి..."గొప్పగా, డాబుగా దర్జాగా వుండటానికి ఎంత ప్రయత్నిస్తే మనుష్యులు అంత అసహ్యంగా వుంటారు....."
*'''చిత్తశుద్ధిలేని శివపూజలు''' వ్యాసం నుండి-'''ప్రభుత్వం చేస్తున్న కుటుంబ నియంత్రణ ప్రచారం గురించి'''..."ఉన్నమాట చెబుతున్నాను. పిల్లల్ని నిందిస్తే పిల్లల తల్లికి కష్టంగా వుంటుంది. పిల్లల తల్లికి కష్టం కలిగితే ఈ ఉద్యమ అంతా దెబ్బతింటుంది. ఎంతో సున్నితమైన ఈ సమస్యను పరమ మోటుగా డీల్ చేస్తొంది..."
*'''మనమాట మన పలుకు అందులోని కులుకు''' వ్యాసం నుండి-'...మన నిజమైన తెలుగు మన అట్టడుగు వర్గ ప్రజల దగ్గర ఇంకా మిగిలివుంది. మన అమ్మమ్మలు, అత్తలు, వదినలు, బామ్మలు వీరంతా ప్రాంణంలేచి వచ్చే హాయైన తెలుగు మాట్లాడుతారు. చాలా విచారకరమైన సంగతి ఏవంటే పుస్తకాలు రాసేవాళ్ళు చాలామంది దగ్గర ఆడ మగా అన్న తేడా లేకుండా ఒరిజనల్ ఒకటోరకం తెలుగు లేదు.....అనగా తెలుగు బిడ్డ కావటానికి బదులు తెలుగు పీడగా తయారవుతున్నాం...."
*'''కర్రలూ-పాములూ''' వ్యాసం నుండి-"...మరి మనదేశంలో ఇన్ని పార్టీలేవిటి? చక్కగా రెండో మూడో పార్టీలుంటే అందంగా వుటుందిగాని సంతలో దుకాణాల్లగ ఇన్ని పార్టీలేవిటీ? ఇందరు నాయకులేవిటి? వీళ్ళంతా ఏవిటి చేస్తారు?...."
*'''ఆంధ్రా తుగ్లక్ లేక మా పిచ్చి మావయ్య''' వ్యాసం నుండి-"...శరీరాలు ఎదిగి మనసులు ఎదగక మూసుకుపోయిన బాపతు జనం ఆడవారిలోనేకాదు మగవారిలో కూడా హెచ్చుమందేవుండి వుంటారు..."