పురాణం సుబ్రహ్మణ్యశర్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
* ఆడదానికొచ్చే బాధలన్నీ వ్యక్తిగతమైనవికావు. సమాజం అమె నెత్తిమీద రుద్దినవి
**'''గోవూవత్సం''' వ్యాసంలో
* ఏయ్! రిక్షావాలా! కాలవంటే తెలుసు కదా! నహర్ అంటే కాలవట. కాలవ పక్కనుండే వాళ్ళు కనుక నెహ్రూలన్నారట: కాలవ పక్కనుండే మీవాళ్ళంతా నెహ్రూ లౌతారట్రా ఇడియట్!(దాదాపు 1990ల వరకు విజయవాడలో ఏలూరు కాలవ, బందరు కాలవ, రైవస్ కాలవల ఒడ్లమీద బీదవాళ్ళు-రిక్షావాళ్ళు తదితరులు- గుడిసెలు వేసుకుని జీవితాలు ఈడుస్తూ ఊండేవారు. వ్యాసంలోని ఈ వ్యాఖ్య, రచయిత వ్యంగ విమర్శనా పటిమకు పరాకాష్ట)
**'''మూడే రంగులు''' వ్యాసంలో
* స్వర్గం, మోక్షం ఎంత మంచివైనా, ఎవరో దిక్కుమాలిన వాళ్ళకూ అభాగ్యులకూ తప్ప, ఎవరికీ స్వర్గస్థులం కావాలని వుండదు, అదేమి చిత్రమో!
**'''ధర్మ దర్శనం''' వ్యాసంలో
*జెరూస్లెంలో ఆక్రోశ కుడ్యమని ఏడవటానికి ఓ గోడ కట్టేరుట. ఆ గోడదగ్గరకు వెళ్ళి ఏడిస్తే మనశ్శాంతి లభిస్తుందట. అలాటి ఎన్నో గోడలు మనకి కావాలే....మన బ్రతుకులు తల్చుకుంటే ఏ గోడకేసి తిరిగినా ఇంట్లో ఏడుపొచ్చేస్తుందే. మరి మనం వేరే ఎక్కడికి వెళ్ళనక్కర్లేదే.
**'''దడిగాడువానసిరా''' వ్యాసంలో
* గొప్పగా, డాబుగా దర్జాగా వుండటానికి ఎంత ప్రయత్నిస్తే మనుష్యులు అంత అసహ్యంగా వుంటారు.
**'''తారుమారు బలే పెళ్ళి''' వ్యాసంలో
*'''చిత్తశుద్ధిలేని శివపూజలు'''(అప్పట్లో వ్యాసం నుండి-'''ప్రభుత్వం చేస్తున్నచేపట్టిన కుటుంబ నియంత్రణ ప్రచారం గురించి'''...") ఉన్నమాట చెబుతున్నాను. పిల్లల్ని నిందిస్తే పిల్లల తల్లికి కష్టంగా వుంటుంది. పిల్లల తల్లికి కష్టం కలిగితే ఈ ఉద్యమ అంతా దెబ్బతింటుంది. ఎంతో సున్నితమైన ఈ సమస్యను (ప్రభుత్వం) పరమ మోటుగా డీల్ చేస్తొంది..."
**'''చిత్తశుద్ధిలేని శివపూజలు''' వ్యాసంలో
*'''మనమాట మన పలుకు అందులోని కులుకు''' వ్యాసం నుండి-'...మన నిజమైన తెలుగు మన అట్టడుగు వర్గ ప్రజల దగ్గర ఇంకా మిగిలివుంది. మన అమ్మమ్మలు, అత్తలు, వదినలు, బామ్మలు వీరంతా ప్రాంణంలేచిప్రాణం వచ్చేలేచివచ్చే హాయైన తెలుగు మాట్లాడుతారు. చాలా విచారకరమైన సంగతి ఏవంటే పుస్తకాలు రాసేవాళ్ళు చాలామంది దగ్గర ఆడ మగా అన్న తేడా లేకుండా ఒరిజనల్ ఒకటోరకం తెలుగు లేదు.....అనగా తెలుగు బిడ్డ కావటానికి బదులు తెలుగు పీడగా తయారవుతున్నాం...."
**'''మనమాట మన పలుకు అందులోని కులుకు''' వ్యాసంలో
*'''కర్రలూ-పాములూ''' వ్యాసం నుండి-"...మరి మనదేశంలో ఇన్ని పార్టీలేవిటి? చక్కగా రెండో మూడో పార్టీలుంటే అందంగా వుటుందిగాని సంతలో దుకాణాల్లగ ఇన్ని పార్టీలేవిటీ? ఇందరు నాయకులేవిటి? వీళ్ళంతా ఏవిటి చేస్తారు?...."
*'''ఆంధ్రా తుగ్లక్ లేక మా పిచ్చి మావయ్య''' వ్యాసం నుండి-"...శరీరాలు ఎదిగి మనసులు ఎదగక మూసుకుపోయిన బాపతు జనం ఆడవారిలోనేకాదు మగవారిలో కూడా హెచ్చుమందేవుండి వుంటారు..."