పురాణం సుబ్రహ్మణ్యశర్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
* మన నిజమైన తెలుగు మన అట్టడుగు వర్గ ప్రజల దగ్గర ఇంకా మిగిలివుంది. మన అమ్మమ్మలు, అత్తలు, వదినలు, బామ్మలు వీరంతా ప్రాణం లేచివచ్చే హాయైన తెలుగు మాట్లాడుతారు. చాలా విచారకరమైన సంగతి ఏవంటే పుస్తకాలు రాసేవాళ్ళు చాలామంది దగ్గర ఆడ మగా అన్న తేడా లేకుండా ఒరిజనల్ ఒకటోరకం తెలుగు లేదు.....అనగా తెలుగు బిడ్డ కావటానికి బదులు తెలుగు పీడగా తయారవుతున్నాం..
**'''మనమాట మన పలుకు అందులోని కులుకు''' వ్యాసంలో
*'''కర్రలూ-పాములూ''' వ్యాసం నుండి-"...మరి మనదేశంలో ఇన్ని పార్టీలేవిటి? చక్కగా రెండో మూడో పార్టీలుంటే అందంగా వుటుందిగాని సంతలో దుకాణాల్లగ ఇన్ని పార్టీలేవిటీ? ఇందరు నాయకులేవిటి? వీళ్ళంతా ఏవిటి చేస్తారు?...."
**'''కర్రలూ-పాములూ''' వ్యాసంలో
*'''ఆంధ్రా తుగ్లక్ లేక మా పిచ్చి మావయ్య''' వ్యాసం నుండి-"...శరీరాలు ఎదిగి మనసులు ఎదగక మూసుకుపోయిన బాపతు జనం ఆడవారిలోనేకాదు మగవారిలో కూడా హెచ్చుమందేవుండి వుంటారు..."
**'''ఆంధ్రా తుగ్లక్ లేక మా పిచ్చి మావయ్య''' వ్యాసంలో