శత్రువు: కూర్పుల మధ్య తేడాలు

 
పంక్తి 3:
* హియరో అనే [[రాజు]] ఒకసారి తన శత్రువుతో మాట్లాడవలసి వచ్చినప్పుడు, ఆ శత్రువు రాజు నోరు దుర్వాసన వేస్తోందని చెప్పాడు. అప్పుడా రాజు ఆశ్చర్యపోయాడు. భవనానికి తిరిగి వెళ్ళగానే తన భార్యని ''నాకీ సమస్య ఉన్నట్టు నువ్వెప్పుడూ చెప్పనే లేదేం?'' అన్నాడు [[కోపం]]గా. అతని [[భార్య]] చాలా అమాయకురాలు. [[పతివ్రత]], ఎవరినీ పల్లెత్తుమాట అని ఎరగని మనిషి. ''అందరు పురుషుల నోటికి అలాటి వాసనే ఉంటుందనుకున్నాను స్వామీ!'' అంది. అందుచేత మనలో ఇంద్రియాలు గ్రహించగల, మోటైన శారీరిక లోటుపాట్లు ఈ ప్రపంచమంతటికీ స్పష్టంగా కనిపించినా, వాటిని మన స్నేహితుల ద్వారానో, సుపరిచితుల వల్లనో కాక శత్రువుల ద్వారానే మనం తెలుసుకుంటూంటాం.
** ప్లూటార్క్ (క్రీ.శ.46 - క్రీ.శ.120)
* మీ స్వంతలాభానికి [[శత్రువు|శత్రువులను]] ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి. ఒక కత్తిని పట్టుకున్నప్పుడు పదునైన అంచుని కాకుండా, పిడిని పట్టుకోవాలి, అంచు చేతికి గాయం చేస్తుంది, పిడి మీరు [[ఆత్మరక్షణ]] చేసుకునేందుకు పనికివస్తుంది. ఒక [[మూర్ఖుడు]] తన [[స్నేహితుడు|స్నేహితుల]] వల్ల పొందే [[లాభం]] కన్నా, ఒక [[వివేకి]] [[శత్రువు|శత్రువుల]] వల్ల పొందే లాభం ఎక్కువ.
** [[బాల్తసర్ గ్రేషియస్]] (1601-1658)
"https://te.wikiquote.org/wiki/శత్రువు" నుండి వెలికితీశారు