పాలమూరు కూలీ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Palamuru Symbol in DIst Map.png|thumb|పాలమూరు]]<poem>మేం మనుషులం
మీరంతా మరిచిపోయిన మనుషులం
మేం పాలమూరు కూలీలం
మేం మీలా
ఏ.సీ.గదులు కోరడం లేదు
నిలువ నీడ కోరుతున్నాం
 
మేం మీలా
నోట్ల కట్టలు కోరడం లేదు
నోటి ముద్ద కోరుతున్నాం
 
మేం మీలా
జిలుగు వెలుగుల చమ్కీలు కోరడం లేదు
కంతలు లేని
బొంతనే కోరుతున్నాం
 
మేం మీలా
పౌంటెన్లను కోరడం లేదు
గొంతు తడిపే నీటి చుక్క కోరుతున్నాం
 
మేం మీలా
సరదా కేకలు పెట్టటం లేదు
మలమల మాడే కడుపులతో
ఆకలి కేకలు పెడుతున్నాం
 
మేం మనుషులం
మీరంతా మరిచిపోయిన మనుషులం
మేం పాలమూరు కూలీలం
</poem>---పి.భారతి<ref>పాలమూరు గోస,(మేం మనుషులం-పి.భారతి), సంపాదకులు& ప్రచురణ కర్తలు:కరువు వ్యతిరేక పోరాట కమిటి,మహబూబ్ నగర్ జిల్లా, జులై,2004,పుట-89</ref>]]
కరువు జిల్లాగా పేరుపడిన [[మహబూబ్ నగర్]]జిల్లాకు చెందిన వలస కూలీలకు'''పాలమూరు కూలీ''' లని పేరు. వీరు ఉండని ప్రాంతం లేదు. వలస వెల్లని కాలం లేదు. చేయని పని ఉండదు. వీరి గురించి రాయని పాలమూరు కవిలేడు. ఎంత మంది కవులు, ఎంత రాసినా వొడవని దుఃఖం వారిది. తీరని వెతలు వారివి. తీరం లేని పయనం వారిది.
== పాలమూరి కూలీపై వ్యాఖ్యలు ==
"https://te.wikiquote.org/wiki/పాలమూరు_కూలీ" నుండి వెలికితీశారు