నెపోలియన్ బోనపార్టీ (Napoleon Bonaparte) (15 ఆగస్టు 1769 – 5 మే 1821) ఫ్రాన్సుకు చెందిన సైనిక అధికారి మరియు రాజకీయ అధిపతి. ఫ్రెంచి విప్లవకాలంలో ఇతను ప్రముఖపాత్ర వహించాడు.

ఒక వ్యక్తి నిజమైన వ్యక్తిత్వం గొప్ప సంఘటనలు జరిగినప్పుడే కనబడుతుంది..

నెపోలియన్ యొక్క ముఖ్య వ్యాఖ్యలు మార్చు

 
మనిషిని అనేక రెట్లు పెంచగలిగేది అతను చేసిన పనులే.
  • ఈ పిరమిడ్ల ఎత్తుమీంచి, నలభై శతాబ్దాలు మనల్ని కిందికి చూస్తుంటాయి.
    • ఆయన దళాలకు 21 జూలై 1798న చేసిన ప్రసంగంలోని భాగం. నెపోలియన్ ఫ్రెంచి ఆత్మకథలో ప్రచురితం.
  • అసంభవం అనే పదం ఫ్రెంచి భాషలో లేదు.
    • జనరల్ జీన్ లె మారొఇస్‌కు వ్రాసిన ఉత్తరం(9 జూలై 1813)లో, ఎడ్వర్డ్ లాథం తయారుచేసిన ఫేమస్ సేయింగ్స్ అండ్ దెయిర్ ఆథర్స్ (1906)లో ప్రచురితం - పేజీ.138.
  • నేను దేవుడు సృష్టించిన రాజుని, భూమ్మీది పాములూ, మొసళ్ళూ(సరీసృపాలు) అయిన మీరు నన్ను ఎదరించేందుకు ధైర్యం చేయకండి. దేవుడికీ, ఏసుక్రీస్తుకీ తప్ప మీలాంటివారికెవరికీ నా ప్రభుత్వపు లెక్కాజమా అప్పజెప్పబోను.
    • ‘కేథలిక్, ప్రొటెస్టెంట్ మతాధికారులతో బోనపార్టే సమావేశం’లో సమావేశమైన కేథలిక్ మతాధికారుల ఉద్దేశించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు.
    • మరో అనువాదాన్ని అనుసరించి:నన్ను దేవుడు సింహాసనంపై నిలబెట్టాడు, భూమిపైన సరీసృపాల్లారా మీరు నన్ను ఎదరించే ధైర్యం చేయకండి. నా పరిపాలన తాలూకూ లెక్కాజమా పోప్‌కి చెప్పాల్సిన బాధ్యత నాకు లేదు-కేవలం దేవుడికీ, ఏసుక్రీస్తుకీ చెప్పుకుంటాను.
  • అల్ప విషయాలే మానవునికి మార్గదర్శకాలు.
  • మనం ఏదైనా కోల్పోవడానికి ఒక్క క్షణమే పట్టవచ్చు.
  • నువ్వు నాకు తల్లినిస్తే ....నేను నీకు మంచి దేశాన్నిస్తాను.
  • యుద్ధం అనేది అనాగరికులు చేసే వ్యాపారం.
  • ప్రతి నిముషాన్ని వ్యర్ధం చేయక వినియోగించుకో, లేకుంటే నీవు వృధా పుచ్చిన కాలం భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది.
  • నాయకుడంటే ఒక ఆశాసౌధం లాంటివాడు.
  • ప్రపంచంలో మేధావులందరి కన్నా ఒక మంచి హృదయం గల వ్యక్తి ఎంతో గొప్పవాడు.
  • నన్ను కాలం తప్ప మరేదైనా అడుగు, అదొక్కటే నా చేతిలో లేదు.
  • మనము నిరుపేదగా ఉండడానికి భగవంతుడు కారణం కాదు, మనమే కారణం. మొదట నిజమైన కారణాన్ని తెలుసుకుందాము. తరువాత దీపం వెలిగించి పెట్టి భాద్యత కొరకు అగ్గిపుల్లను వెతుకుదాము.
  • ఒక్క కాలం తప్ప మరేదైనా మన చేతిలోనే ఉంటుంది.
  • వెయ్యి తుపాకుల కంటే వ్యతిరేకించే నాలుగు వార్తాపత్రికలకు భయపడాలి.
  • అవకాశం రానప్పుడు, అవకాశాన్ని సృష్టించుకోలేనప్పుడు ఎంత సమర్ధత ఉన్నా నిష్ప్రయోజనమే.

I am a monarch of God's creation, and you reptiles of the earth dare not oppose me. I render an account of my government to none save God and Jesus Christ. Addressing members of the Catholic clergy assembled during ‘Bonaparte's Conference with the Catholic and Protestant clergy at

 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=నెపోలియన్&oldid=12868" నుండి వెలికితీశారు