నువ్వు చెప్పనవసరం లేని విషయాలు నీ సంపదలు. అనవసరమైన విషయాలు మాట్లాడితే సంభాషణ బలహీనమౌతుంది. అనవసరమైన విషయాలు వింటే నీ వినికిడి మందగిస్తుంది. నువ్వు వింటానికి ముందే నీకు తెలిసిన విషయాలు నీ వ్యక్తిత్వం అవుతాయి. నీ మనుగడకు అవి ప్రాణాలు.
నీ హృదయాన్ని తరచి చూడు. సలహాలు, ఉపాయాలు చెప్పేవారు నీకు నిజమైన సన్నిహితులు కారు. కష్టసుఖాలలో మౌనంగా నీకు తోడుండి నీ అనుభూతులను పంచుకొనేవారు, దిక్కుతోచనప్పుడు తానుకూడా నీతో విషాదాన్ని అనుభవించేవాడు నిజమైన స్నేహితుడు.