అమృతా షేర్-గిల్

భారతీయ చిత్రకారిణి

అమృతా షేర్-గిల్ (జనవరి 30, 1913 - డిసెంబర్ 5, 1941), ఒక ప్రముఖ భారతీయ చిత్రకారిణి, సర్దార్ ఉమ్రావ్ సింగ్ షెర్గిల్, హంగేరియన్ మహిళ ఆంటోనెట్‌ల కుమార్తె. గుర్తింపు పొందిన ఆమె మొదటి చిత్రం, "యంగ్ గర్ల్స్". భారతీయ కళ సంప్రదాయాలను తిరిగి కనుగొనాలనే ఆమె తపన చిన్న వయస్సులోనే ప్రారంభమైంది, కానీ ఆమె 28 సంవత్సరాల వయస్సులో మరణించింది. మొఘల్ స్కూల్ ఆఫ్ పెయింటింగ్, పహారీ స్కూల్ ఆఫ్ పెయింటింగ్, అజంతాలోని గుహ పెయింటింగ్‌లు ఆమె చిత్రాలను బాగా ప్రభావితం చేశాయి. ఆమె 20వ శతాబ్దపు భారతదేశపు ప్రముఖ మహిళా చిత్రకారిణిగా పరిగణించబడింది. భారత ప్రభుత్వం ఆమె రచనలను జాతీయ కళాసంపదగా ప్రకటించింది.

అమృతా షేర్-గిల్

వ్యాఖ్యలు

మార్చు
  • నేను భారత గడ్డపై నా అడుగు పెట్టిన వెంటనే, నా చిత్రకళ విషయ అవగాహనలో, ఆత్మలో నే కాకుండా సాంకేతికంగా కూడా మార్పు చెందింది.
  • ఆధునిక కళ నన్ను భారతీయ చిత్రలేఖనం, శిల్పకళపై అవగాహన, ప్రశంసలకు దారితీసింది. కానీ మేము ఐరోపాకు దూరంగా ఉండకపోతే, అజంతా నుండి ఒక గోడ మీది చిత్రం (ఫ్రెస్కో)... వంటివి పునరుజ్జీవనోద్యమం కంటే విలువైనదని నేను ఎప్పుడూ గ్రహించి ఉండేదానిని కాదు!
    • In "Toward a Development of a Cosmopolitan Aesthetic"
  • నేను ఒక వ్యక్తివాదిని, ఒక కొత్త ప్రక్రియని అభివృద్ధి చేస్తున్నాను, ఇది సాంప్రదాయిక అర్థంలో భారతీయమే కానవసరం లేదు, కానీ ఇది భారతీయ ఆత్మగా ఉంటుంది. నేను భారతదేశాన్ని ప్రధానంగా రూపం రంగు శాశ్వతమైన ప్రాముఖ్యతతోను, భారతీయ పేదల జీవితాన్ని కేవలం మనోభావాలను క్షేత్రం అధిగమించే ఆసక్తిగా వివరిస్తాను."
    • Amrita Sher-Gill: Art and Life: A Reader (page xvii)

సూచనలు

మార్చు
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.