అయాన్ రాన్డ్
అయాన్ రాన్డ్ ఆంగ్లం: Ayn rand, (2 ఫిబ్రవరి 1905 – 6 మార్చి 1982) రష్యాలొ పుట్టి అమెరికాలొ స్థిరపడిన నవలా రచయిత్రి. చిత్ర కథారచయిత, తత్వవేత్త, రాన్డ్ రచించిన (ద ఫౌంటేన్ హెడ్) (అట్లాన్ ష్రగ్డ్) నవలల ద్వార ఆబ్జెక్టివిజం ను పరిచియం చేస్తూ తనకంటూ నూతన అద్యాయాన్ని సృష్టించుకుంది.
అయాన్ రాన్డ్ వ్యాఖ్యలు
మార్చు- తమని తాము గౌరవించుకోనివారిని ఇతరులు కూడా గౌరవించరు.
- హేతుతత్వం మానవుని అదృష్టం. మానవుని అన్ని అదృష్టాలకు మూలం అదే.
- అపరాధము,భయము మానవుల మనస్సులను క్షోభకు గురి చేస్తాయి. సామాజిక సంసృతికి కూడా నష్టం కలిగిస్తాయి.
- మనిషికి ఆనందం భోగం కాదు. మానసిక అవసరం.
- చనిపొమ్మని మనుషులను ఆదేశించవచ్చుగాని ఆలోచించమని ఆదేశించలేము.
- ఆలోచనల్ని మరింత గొప్ప ఆలోచనలతో మాత్రమే ఎదుర్కోగలం.
- వృక్షం దాని ఆహారాన్ని భూమి నుండి పొందుతుంది.జంతువు వేటాడుతుంది, మానవుడు ఉత్పత్తి చేస్తాడు.
- సమాజ సంస్కృతి ఉత్పత్తి సాధనాలు ఉపయోగించడం మీద ఆధారపడి ఉంటుంది.
- తోటి సోదరుల మంచి కోసం కష్టించని జీవితం మానవుడికి జీవితమే కాదు.
- వైవిధ్యమైన విలువలతో కూడిన మనిషి వ్యక్తిగత గుర్తింపును కోల్పోలేడు.
- గొప్ప మానవుల్ని పరిపాలించలేం.
- మనసు ఉన్నతమైతే జ్ఞానము ఉన్నతమే. అతని ప్రణాళిక కూడా విస్తృతంగానే ఉంటుంది.
- నీతి సూత్రాలన్నీ నిజజీవిత సూత్రాలే, భౌతికశాస్త్ర సూత్రాలాంటివే.
- మనిషి జీవితపు నీతి తన స్వంత సంతోషం కోసమే.
- నైతిక సూత్రాలు మానవుని కార్యాచరణకు శక్తినిస్తాయి.
- మూర్ఖత్వం విషం , మృత్యువుదే జయం. అలాగే మంచి చెడుల మధ్య సమన్వయంలో చెడే లాభం పొందుతుంది.
- బాధ,సహనాన్ని భరించడం స్వర్గం చేరడానికి అర్హతలు.
- ఉన్నత వర్గాలది నిన్న. రేపటి ప్రపంచం మధ్యతరగతిది.
- మానవుని మనసే అతని మనుగడకు మౌలిక కారణం. అంతే కాదు అది అతనికి స్వయంరక్షణ.
- వంశం పేదవాడికి పనికిరాని జంతువు.
- శాస్త్రం ఉపయోగకరం ఎందుకంటే అది విస్తృతి చెందుతోంది. బలపడుతోంది. మానవ జీవితాన్ని కాపాడుతోంది.
- ఏ సమాజ విధానాలు నీతి మీద ఆధారపడకపోతే ఎక్కువ కాలం మనజాలవు.
- నేరగాళ్ల నుండి సాధారణ ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వాలు ఏర్పాటవుతాయి. ప్రభుత్వాల నుండి సాధారణ పౌరులను రాజ్యాంగం రక్షిస్తుంది. [1]
బయటి లంకెలు
మార్చుమూలాలు
మార్చు- ↑ ఈనాడు. 2024.11.26.