లాల్ కృష్ణ అద్వానీ

భారత మాజీ ఉప ప్రధాని, హోం మంత్రి, భాజపా మాజీ అధ్యక్షుడు
(ఎల్.కె.అద్వానీ నుండి మళ్ళించబడింది)

భారతీయ జనపా పార్టీ అగ్రనేతలలో ప్రముఖుడైన లాల్ కృష్ణ అద్వానీ 1927 నవంబర్ 8న కరాచిలో జన్మించాడు. 15 సం.ల వయస్సులోనే ఆర్.ఎస్.ఎస్.లో ప్రవేశించాడు. ఆ తరువాత దేశ రాజకీయాలకే అంకితమయ్యాడు. భారతీయ జనసంఘ్ పార్టీలో చేరి అనతి కాలంలొనే ముఖ్య పదవులు పొందినాడు. 1967లో ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ అధ్యక్షుడైనాడు. 1977లో మురార్జీ దేశాయ్ ప్రభుత్వంలో మంత్రిపదవికి పొందినాడు. 1980లో భాజపా ఏర్పడిన తరువాత దేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహిస్తునాడు.

లాల్ కృష్ణ అద్వానీ (2009)

అద్వానీ యొక్క ముఖ్యమైన వ్యాఖ్యలు

మార్చు
  • హవాలా కేసులో అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికంటే జిన్నా అద్యాయమే నాకు ఎక్కువగా బాధించింది.[1]
  • మన్‌మోహన్ సింగ్ అంతటి అసమర్థ ప్రధాని మరొకరు లేడు.[2]
  • మనకు ఎంపిక చేసే ప్రధాని కాదు, ఎన్నికయ్యే ప్రధాని కావాలి.[3]

మూలాలు

మార్చు
  1. జిన్నా సమాధి వద్ద అద్వానీ రాసిన వ్యాఖ్యలపై వచ్చిన వివాదం అనంతరం వెలుబుచ్చిన అభిప్రాయం.
  2. (2009 ఎన్నికల సంధర్భంగా మన్‌మోహన్ సింగ్ పై విమర్శలు), ఈనాడు దినపత్రిక, తేది 27-03-2009
  3. (మన్‌మోహన్ సింగ్ ను దృష్తిలో ఉంచుకొని అద్వానీ చేసిన విమర్శ.) ఈనాడు దినపత్రిక తేది 29-03-2009.
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.