ఐశ్వర్య రజనీకాంత్

ఒక భారతీయ చలనచిత్ర దర్శకురాలు, తమిళ సినిమాల్లో పని చేసే నేపథ్య గాయని.

ఐశ్వర్య రజనీకాంత్ (జననం:1 జనవరి 1982]) ఒక భారతీయ చలనచిత్ర దర్శకురాలు, తమిళ సినిమాల్లో పని చేసే నేపథ్య గాయని. ఆమె నటుడు రజనీకాంత్, లతా రజనీకాంత్ ల పెద్ద కుమార్తె, నటుడు ధనుష్ మాజీ భార్య కూడా.[1]

ఐశ్వర్య రజనీకాంత్

వ్యాఖ్యలు

మార్చు

బ్రెయినీకోట్[2]

  • ఎప్పుడూ అందంగా కనిపించాలనే ఒత్తిళ్లను తప్పించుకోవడానికి నటిని కావాలని ఎప్పుడూ అనుకోలేదు.
  • నటిగా ఉండటం చాలా కష్టమైన విషయం. అన్ని వేళలా అందంగా కనిపించాలనే ఒత్తిడి ఉంటుంది.
  • ఛాయాచిత్రగ్రాహకయంత్రము (కెమెరా) ముందు నేను సౌకర్యంగా ఉండేదానిని కాదు.
  • నేను ఓడకు నౌకాధిపతి(కెప్టెన్‌)గా ఉండటానికి ఇష్టపడతాను, షాట్‌లకు పిలిచి మరింత సృజనాత్మకంగా ఉండాలనుకుంటున్నాను.
  • పోరాట విన్యాసాలు చేసేవారు ఎదుర్కొంటున్న కష్టాలను, అనిశ్చితిని ముందుకు తీసుకురావాలని నేను భావిస్తున్నాను. వాటిని రక్షించడానికి భారతదేశంలో తగిన మౌలిక సదుపాయాలు లేదా భద్రతా మార్గదర్శకాలు లేవు, ఇంకా వారి పని గుర్తించబడదు.
  • ప్రసిద్ధ వ్యక్తుల పిల్లల గురించి అనేక అపోహలు ఉన్నాయి.
  • చాలా మంది ప్రతిభావంతులైన చిత్రనిర్మాతలు ఉన్నారు, కానీ వారు తమ విషయాన్ని(కంటెంట్‌)వీక్షకుడికి అందించడం కష్టం.
  • మీకు చాలా మంది వ్యక్తులు విభిన్న పాత్రలను పోషిస్తున్నప్పుడు, మీరు ప్రతి పాత్రకు న్యాయం చేయాలి, వ్రాతప్రతి(స్క్రిప్ట్‌)లో వారి ఉనికికి అర్థం తీసుకురావాలి.
  • నేను ఎప్పుడూ రాయడం ఇష్టపడతాను నాఆలోచనలు, చిన్న కథలు, కవితలు పెరిగేవి.
  • నేను నాపనితో ఒప్పుకోవాలనుకుంటున్నాను, అది జరిగితే తప్ప నేను సినిమా చేయలేను.
  • పాత్రికేత్రియ వృత్తికి (జర్నలిజానికి) నీతి ఉంటుంది, ప్రతి ఒక్కరూ వాటిని అనుసరించాలి.
  • రచన మన ఆలోచనలు, వ్యక్తీకరణలను వెలికి బాగా తెస్తుందని నేను గట్టిగా నమ్ముతాను.
  • ఏదైనా రాయడం ద్వారా చక్కగా తెలియజేయవచ్చు.
  • నిర్మాతలు ప్రతిభను చూసి, దర్శకుడికి సత్తా ఉందని నమ్మితే, ఆడ,మగ బేధం లేకుండా డబ్బు ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారు.
  • చలనచిత్ర ఉత్సవాలలో సమాంతర చలనచిత్రాలతో పాటు వాణిజ్య చిత్రాలను కూడా ప్రదర్శించాలి. ఇది మరింత మందికి చేరువయ్యే ఏకైక మార్గం.
  • మీరు 100 కోట్లు రాబట్టే సినిమాని నిర్మించక్కరలేదు; మీరు మంచి సినిమా తీయాలనుకుంటున్నారు.
  • నేను రాస్తాను, నా ఆలోచనలను చాలా తక్కువ మందితో పంచుకుంటాను.
  • వ్యక్తిగతంగా, కొత్తదనం చుట్టూ తిరిగే కథలను చెప్పడం నాకు ఇష్టం. నేను లేకపోతే చాలా విసుగుగా భావిస్తాను.
  • దర్శకురాలిగా యోగ్యతలలో ఒక మహిళ పేరును చూడటం ఆశ్చర్యం ఏమాత్రం కలిగించదు.
  • నా రకమైన శైలిని నిర్ణయించే ముందు నేను అన్వేషించాలనుకుంటున్నాను.
  • స్త్రీ తప్పనిసరిగా ఒక నిర్దిష్ట రకమైన స్క్రిప్ట్‌ను వ్రాయాలనే నియమం లేదు.
  • స్త్రీలకు స్త్రీలా, ఇంకా పురుషుడిలా ఆలోచించగలిగే అవకాశము, ప్రయోజనం ఉంటుంది.

సూచనలు

మార్చు
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.