కుక్క
దేశీయ జంతువు
కుక్క (Dog) మానవుడు మచ్చిక చేసుకున్న మొట్టమొదటి జంతువు. ఇది ఒక క్షీరదం. సుమారు 14,000 సంవత్సరాల కిందటే ఇది మనిషి తో కలిసి జీవించడం నేర్చుకుంది.
కుక్కపై ఉన్న వ్యాఖ్యలు
మార్చు- కుక్క పిల్ల, అగ్గి పుల్ల కాదేదీ కవితకనర్హం.
- ఎండ కాస్తూ వర్షం కురిస్తే ..... కుక్కలకు, నక్కలకు పెళ్ళి అంటారు.
కుక్క పై ఉన్న సామెతలు:
మార్చు- అరిచే కుక్క కరవదు
- కుక్క కాటుకి చెప్పుదెబ్బ.
- కుక్క తోక వంకర
- కుక్కలు చింపిన విస్తరి లాగా
- కుక్కలుండే ఊరికి నక్కే పోతురాజు.
- తడక లేని ఇంట్లో కుక్క దూరినట్లు.
- పనిగల మేస్త్రి పందిరి వేస్తె కుక్క తోక తగిలి కూలిపొయింది.
- మొరిగే కుక్క కరవదు కరిచే కుక్క మొరగదు.
- శాస్త్రం ప్రకారం చేస్తే కుక్క పిల్లలు పుట్టాయంట.
- కక్కిన కుక్క వద్దకూ కన్న కుక్క వద్దకూ కానివాణ్ణయినా పంపరాదు
- కుక్క తోక పట్టి గోదారి ఈదినట్టు
- కుక్క తోత వంకర అన్నట్టు...
- కనకపు సింహాసనమున శునకమును కూర్చోండపెట్టినట్లు
- చంద్రుని చూసి కుక్కలు మొరిగినట్లు
- చెప్పు తినెడి కుక్క చెరకు తీపెరుగునా....
- నల్లటి కుక్కకు నాలుగు చెవులు
- దొంగలు పడిన ఆరునెల్లకు కుక్కలు మొరిగినట్లు
- గడ్డి వామి దగ్గర కుక్కను కాపలా పెట్టి నట్లు. అది తినదు.... ఆవును తిననీయదు.
- ఊర్లో పెళ్ళికి కుక్కల హడా విడి ఎక్కువ.
- కుక్క పని గాడిద చేసి చావు దెబ్బలు తిన్నట్టు
- కుక్కకు విశ్వాస మైనా వుంది.... నీకు అదీ లేదు.
- చెట్టు చెడుకాలానికి కుక్క మూతి పిందెలు కాసినట్లు.
- కుక్క వస్తే రాయి దొరకదు.... రాయి దొరికితే కుక్క రాదు.
- ఏనుగును చూచి కుక్కలు మొరిగినట్లు.
- మాటలు నేర్చిన కుక్క ఉస్కో అంటే ఉస్కో అన్నదట.
- కుందేలును లేవదోలి కుక్క ఏరగను పోయిందట.