చిలకమర్తి లక్ష్మినరసింహం
తెలుగు రచయిత
చిలకమర్తి లక్ష్మీనరసింహం (సెప్టెంబరు 26, 1867 - జూన్ 17, 1946) కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త.
వ్యాఖ్యలు
మార్చుగ్రంథాలయ వేదం:
వాయువెల్లవారికి ఎట్లు స్వాధీనమై యున్నదో
జ్ఞానమును నట్లు స్వాధీనమై యుండవలెను
ఉదక మెల్ల వారికి నెట్లు సేవ్యమై యున్నదో
జ్ఞానమును నట్లు సేవ్యమై యుండవలెను
సూర్యచంద్ర మండలముల తేజస్సు ఎల్లవారికి నెట్లు సౌఖ్యప్రదముగ నున్నదో
జ్ఞానమును నట్లు సౌఖ్యప్రదముగ నుండవలెను.
మూలాలు
మార్చుఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం [1]
- ↑ Andhra Pradesh Library Association. http://www.apla.co.in/about-us/10 March 2024