జాన్ రస్కిన్
జాన్ రస్కిన్ (ఫిబ్రవరి 8 1819 – జనవరి 20 1900) ఒక ప్రముఖ ఆంగ్ల రాకయిత, కవి మరియు చిత్రకళాకారుడు.
వ్యాఖలు
మార్చు- మన ఉద్దేశ్యాలను తక్కువగా వెల్లడిస్తే, వాటిని నెరవేర్చుకునే అవకాశాలు ఎక్కువ వుంటాయి.
- ప్రపంచంలో అతి అందమైన నెమళ్లు,లిల్లీ పువ్వులు అత్యంత ఉపయోగం లేనివని మీరు గుర్తుంచుకోండి.
- మన ఉద్దేశ్యాలను తక్కువగా వెల్లడిస్తే, వాటిని నెరవేర్చుకునే అవకాశాలు ఎక్కువగా వుంటాయి.
- ఊహల్ని,గొప్ప అనుభూతుల్ని సంగీతమైన మాటల్లో వర్ణించడమే కవిత్వం.
- కారణమనే పేరుతో మొహం దురాశ ప్రపంచాన్ని పాలిస్తున్నాయి.
- తప్పుల అడుగున ఎప్పుడు అహం వుంటుంది.
- మనం నిర్మాణం చేసేటప్పుడు అది భావి తరాల కోసమని గుర్తుంచుకోవాలి.
- నూతన తలంపులున్న మనుషులు కష్టపడి నేర్చుకుంటారు. వాళ్లు నూతన జ్ఞానం కోసం అలమటిస్తారు.
- నీ నిజాయితీ ఓ మతం మీదగాని, విధానం మీద గాని ఆధారపడి ఉండకూడదు. అది సూర్యుని వలె పగలు,రాత్రి ప్రకాశించే కాన్తివలె దేవునిపైన ఆధారపడి వుండాలి.
- చిన్న చిన్న నేరాలను ఉపేక్షిస్తే అవి పెద్ద ఘోరాలకు దారి తీస్తాయి.
- మనం అమాయకులమని మన బాధ్యతలను విస్మరించలేము.
- చెప్పదలచినది తక్కువ మాటల్లో చెప్పు,లేకుంటే పాఠకుడు కొన్నింటిని వదిలివేస్తాడు.
- రచయితను కలుసుకుంటే అతని అభిప్రాయాలు తెలుసుకో. నీ అభిప్రాయాలు చెప్పకు.
- కనిపించే దాన్ని వాస్తవికరించడం గుర్తింపు కోసం ప్రత్యక్షంగా చూపడం యొక్క పని.
- ఎక్కువ స్వాధీనం చేసుకున్న కొద్ది ఆ బరువుతోనే క్రుంగుతాము.
- అందానికి రమ్యతకు తేడా ఉంది. నేను గుర్తిస్తే అందమైనది. ఆమె నన్ను గుర్తిస్తే రమ్యమైనది.