జార్జి బెర్నార్డ్ షా

ఐరిష్ నాటక రచయితా

జార్జి బెర్నార్డ్ షాఆంగ్లం George bernard shaw జూలై 26, 1856న ఐర్లాండులోని డబ్లిన్‌లో జన్మించాడు. ఇతను ప్రముఖ రచయిత. ఇరవై సంవత్సరాల వయసులో లండన్కు వెళ్ళి తన జీవితమంతా అక్కడే గడిపాడు. అతని రచనా వ్యాసాంగములో 60కి పైగా నాటకాలు రాశాడు. నోబెల్ బహుమతి (1925) తో పాటు ఆస్కార్ బహుమతి (1938) కూడా పొందిన ఏకైక వ్యక్తి. నవంబర్ 2, 1950న మరణించాడు.

జార్జి బెర్నార్డ్ షా
కారణం తెలిసిన మనిషి ప్రపంచంతో సర్దుకుపోతాడు. కారణం తెలియనివాడు ప్రపంచమే తనతో సర్దుకుపోవాలంటాడు. కాబట్టి అభివృద్ధి కారణం తెలియనివాడి మీదే ఆధారపడి వుంటుంది.
తప్పుడు జ్ఞానానికి దూరకండి. అది అవివేకం కంటే ప్రమాదకరం

సమాజంతో పోరాటమే ప్రగతి.

జార్జి బెర్నార్డ్ షా యొక్క ముఖ్య వ్యాఖ్యలు
  • భూమి మీద కుటుంబమే ప్రియమైన స్థలం, ఆత్మీయులకు కేంద్రస్థానం.
  • జీవితం అంటే నిన్ను నువ్వు వెతుక్కోవటం కాదు. నిన్ను నువ్వు సృష్టించుకోవటం.
  • అధికారం మనిషిని అవినీతిపరుణ్ని చెయ్యదు. మూర్ఖులు అధికారంలోకి వచ్చినప్పుడు అధికారాన్ని అవినీతిమయం చేస్తారు.
  • అభ్యసించేవాడు జడం. చదువుతోనే కాలయాపన చేస్తాడు.
  • కారణం తెలిసిన మనిషి ప్రపంచంతో సర్దుకుపోతాడు. కారణం తెలియనివాడు ప్రపంచమే తనతో సర్దుకుపోవాలంటాడు. కాబట్టి అభివృద్ధి కారణం తెలియనివాడి మీదే ఆధారపడి వుంటుంది.

సమాజంతో పోరాటమే ప్రగతి.

  • అవకాశాన్ని వదులుకోకు.అది ప్రతిరోజు రాదు.
  • సిగ్గుపడే పరిసరాల్లో మనం జీవిస్తున్నాం.
  • ఎక్కువ విషయాలకు సిగ్గుపడేవాడు ఎక్కువ గౌరవనీయుడు.
  • ఆదరణలేని ఆంగ్లేయుడు తను నీతిమంతుడవడమే కారణమని భావిస్తాడు.
  • కంటినిండా ఆకలి గల మానవునితో మతాన్ని గురించి మాట్లాడలేను.
  • ఆస్తి వ్యవస్థీకృత దోపిడీ.
  • తోటి మానవులతో వైరం కంటే నిర్లిప్తంగా వ్యవహరించడం మరింత పాపం.
  • నేను నన్నే ఉదాహరించుకుంటాను. అది నా సంభాషణకు మసాలా.
  • దేవుడిని వెతకటానికి ఉద్యానవానమే సరైన స్థలం. కాకుంటే మనం తవ్వి చూడాలి.
  • నరకం కుడా మంచి ఉద్దేశ్యంతోనే ఏర్పరచబడింది.
  • ఎక్కువ గంటలపని తక్కువ జీతం ఉపాధ్యాయులకు మంచిది కాదు.
  • పుట్టిన ప్రతివాడికి ఓటమి జీవితంలో ఒక భాగం.
  • కళల్లో మనకు అందని మాయ వుంది మర్మము వుంది.
  • దేవుడు ప్రపంచాన్ని కళాత్మకంగా మలిచాడు. అందుకే మానవుడు కళాకారుడి నుండి పాఠాలు నేర్చ్కోవాలి.
  • నిజమైన కళాకారుడు తన భార్యను ఆకలితో మాడుస్తాడు.పిల్లల్ని గాలి కొదిలేస్తాడు.
  • ప్రయత్నిస్తే క్రీస్తు మతం అభిందించతగినది.
  • కులం ఓ ముఖ్యవృత్తి,అయితే పిల్లల్ని కనడంలో మాత్రం ఏ అర్హత పాటించబడటం లేదు.
  • జీవితంలో రెండు విచారాలున్నాయి. ఒకటి నా మనసులో వున్న కోర్కె,రెండవది దాన్ని సాధించడం.
  • భూమి మీద కుటుంబమే ప్రియమైన స్థలం. ఆత్మీయతలకు కేంద్రస్థానం.
  • ఇల్లు బాలకులకు కర్మాగారం, స్త్రీలకు పనిచేసే కర్మాగారం.
  • నిజమైన గొప్పవాళ్ళను తోటివారు అరుదుగా మాత్రమే గుర్తిస్తారు.
  • చరిత్ర పునరావృతం అయితే, అనుకోనివి సంభవిస్తాయి. మన అనుభావాన్నుంది నేర్చుకుందేమిటి.
  • తప్పుడు జ్ఞానానికి దూరకండి. అది అవివేకం కంటే ప్రమాదకరం.
  • జీవితం ఓ మంట. దాన్ని అదే కాల్చుంటుంది.కాని మరల ఓ బిడ్డ జననంతో మంట తిరిగి ప్రారంభం అవుతుంది.
  • జైళ్ళంటూ వున్న తర్వాత అందులో ఎవరున్తున్నరనేది అంత ముఖ్యం కాదు.
  • సమయం అసంఖ్యాకమైన తప్పులను దాచివేస్తుంది.
  • తాత్వికుడు ప్రకృతికి దారి చూపుతాడు. అక్కడే మనకున్న తేడ నరకంలో కొట్టుకుపోవడమో,స్వర్గంలో నడిపించడమో.
  • ఇతరులు తప్పులు చేస్తుంటే నేను ఒప్పులు చేస్తాను.అది నా ప్రత్యేకత.
  • దేశభక్తిని మానవ జాతి నుండి విచ్చిన్నం చేస్తే తప్ప ప్రపంచశాంతి ఏర్పడదు.
  • అవమానం పాలైన పిరికివాడు తీర్చుకునే ప్రతీకారమే ద్వేషం.
  • డబ్బు లేకపోవడం ఎన్నో పాపాలకు కారణం.
  • ద్వీపకల్పం లేని నదులు జుట్టులేని స్త్రీ వంటివి.
  • చదువు దాన క్విక్సోట్ ని గౌరవనీయుణ్ణి చేసింది. చదివిన్దంతా నమ్మడం అతణ్ణి పిచ్చివాణ్ణి చేసింది.
  • మనల్ని చూసి మనుషులు నవ్వడం కంటే మనిషి చనిపోయినప్పుడు పడే బాధ ఎక్కువేమి కాదు.
  • ఎలా ఆలోచించాలో తెలిసిన తర్వాత నా ఆలోచనలపై ఇతరుల ప్రభావం లేదు.
  • ఆర్ధికవేత్తల నందరిని సమావేశపరచితే కూలకషంగా చర్చించి కూడా ఒక నిర్ధారణకు రాలేరు.
  • నిరాకరణకు ఖచ్చితమైన అభినయం నిశ్శబ్దం.
  • నిషేధం హత్యకు ఉపయోగించే అతిక్రూరమైన విధానం.
  • నిష్కపటంగా ఉండటం ప్రమాదకరం.ఒకవేళ నువ్వు కూడా పిచ్చివాడివైతే తప్ప.
  • నువ్వు నేను చేసేపని ఆపితే పీడిస్తున్నావనుకుంటాను. నువ్వు చేసే పనిని అపదాన్ని మాత్రం న్యాయం,నీతి అనుకుంటాను.
  • ఏ కార్యాలయానికి వెళ్ళే పనిలేని వాడు aNTE అతనికి పని చెయ్యాలనే లేనివాడు.
  • అన్నిటికంటే చెడు, మోసాలన్నింటిలో అతి చెడ్డది పేదరికమే.
  • చాలా తక్కువ మంది మాత్రామే పేదరికాన్ని భరించగలరు.
  • పాత దుస్తులు ధరించినా ఫరవాలేదుగాని, కొత్తపుస్తకాలు కొనాలి.
  • నా జీవితంలో నేను పొగాకు, అసహజమైన ప్రమాదకరమైన ఈ అభ్యాసం ఎలా జరిగిందో ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూస్తారని నేను చూస్తున్నాను.
  • అసలేమి చేయని జీవితం కంటే తప్పులు చేస్తూ, ఏదో ఒక పనిచేస్తూ ఉండటమే గౌరవప్రదం, ఉపయోగం కూడా.
  • ఈ ప్రపంచంలో విశాదమేమంటే ప్రజ్ఞావంతులకు గౌరవం లేకపోవడమే.
  • పనికిరాని జనాలు అవినీతికర నాయకుల్ని ఎన్నుకొనే విధానమే ప్రజాస్వామ్యం.
  • నాయకులు చేసే గోప్పపనులను బట్టిగాక సామాన్య పనులను అతిలాఘవంగా చేసే సామాన్యప్రజలను బట్టి ప్రజాస్వామ్యాన్ని సరితూచగలం.
  • ప్రపంచం ఎలా ఉంటే అలా స్వీకరించు.
  • క్రూరత్వాన్ని నీతి భోధనతోను,సహనాన్ని నటించి మార్చవచ్చు.
  • శక్తి లేకున్నా ప్రాణత్యాగి ప్రసిద్ధుడవుతాడు.
  • ప్రేరేపణను ఎప్పుడు అణచుకోకు.అన్ని విషయాలను నిర్ధారించుకో. ఏది మంచి అయితే దాన్ని త్వరగా అందుకో.
  • ఏ మనిషికి తన భాష మీదే పట్టు ఉండదు. అంతేకాదు ఇతర భాషలపై సాధికారత వుండదు.
  • వందరకాల రీతులు ఉండవచ్చు, దేవుడు మాత్రం ఒక్కడే.
  • తెలివైన వాడికంటే తాగినవాడే సంతోషంగా వున్నట్లు. నేడు సంశయించే వాడికంటే నమ్మేవాడే సంతోషంగా జీవిస్తున్నాడు.
  • మార్పులేనిదే అభివృద్ధిలేదు. మనసు మారందే మనం దేన్నీ మార్చలేం.
  • స్నేహితుడులేని జీవితం సాక్ష్యంలేని కేసు వంటిది.
  • మంచితనం సరైన సిద్ధాంతమని మన పిల్లలకు చెప్పాలంటే మొదట మన ప్రపంచాన్ని మంచిగా తీర్చిదిద్దాలి.
  • అతనికే తెలియదు,కాని అన్ని తెలుసనీ తలుస్తాడు. అది రాజకీయ వృత్తి అవసరం.
  • మనిషి రాజ్యాంగాన్ని శక్తివంతంగా తయారు చెయ్యలేదు. ఏ సాక్ష్యం చూసినా అది నిజమేననిపిస్తుంది.
  • దేనికైనా పేరు పెట్టాలంటే దాన్ని వర్గీకరించాలి.
  • స్వర్గంలో దేవతలకు వ్యక్తిత్వం లేదు.
  • గత స్మ్రతులు మనిషిని వృద్ధునిగా,బాధితునిగా మారుస్తాయి.
  • ఒక మనిషిని ఎదుర్కోలేనంతటి సంస్యవైపుకి నెడితే అప్పుడు వాస్తవాలు,విలువలు,తార్కికత అనూహ్యంగా ఏది గుర్తురాదు.
  • ప్రభుత్వ వైద్య విభాగాల్లో ఎన్నో అపవాదులు,అది నిజం.
  • చెయ్యగలిగినవాడు చేస్తాడు, చెయ్యలేనివాడు చెబుతాడు.
  • విప్లవం అణచివేతను తెలికపరచలేదు. అధికబరువు ఓ భుజం నుండి మరో భుజానికి మారింది.
  • విప్లవకారులంతా, ప్రభుత్వ బాధ్యత తీసుకొని తర్వాతా పరిపాలకులుగా మారిపోతారు.
  • విప్లవ సంఘటనలు సమాజంలోని మంచివాళ్లను , చెడ్డవాళ్లను కూడా ఆకర్షిస్తాయి.
  • దైవాన్ని పూజించడం,వ్యవహారిక జీవనాన్ని గడపడం విరుద్ధ భావనలు కావు.
  • శాస్త్రం సామాన్యమైనది లోతైనది. అర్ధసత్యలే ప్రమాదం.
  • ప్రపంచంలో సోకిన్చాదగినవి రెండే. ఒకటి కావలసింది దొరకకపోవడం,రెండు తీరడం.
  • నరకం సంగీతం నేర్చుకొనేవాళ్ళతో నిండి వుంటుంది.
  • అవసరం ఉన్నంతవరకు జీవించడానికి కారణం ఉంది. సంతృప్తి చెందడమంటే మరణమే.
  • ఓ జీవితకాలపు సంతోషాన్ని ఎవరు భరించలేరు. అది భూమ్మీద నరకం వంటిది.
  • మాట్లాడటం వచ్చినంతమాత్రాన సంభాషించడం వచ్చినట్లు కాదు.
  • ఏదైనా నీకు హాస్యాస్పదంగా కనిపిస్తే దాని వెనుక దాగివున్న సత్యాన్ని అన్వేషించు.
  • అన్ని సత్యాలు దైవ నిందతోనే ప్రారంభమవుతాయి.
  • నా హాస్యం చెప్పే పద్ధతి సత్యాన్ని చెప్పడానికే.అది ప్రపంచంలోనే అందమైన హాస్యం.
  • నరకానికి నిర్వచనమే సెలవుదినం.
  • సరిపోని ఆకర్షణే సుగుణం అంటాం.
  • భావం, సిద్ధాంతము కాదు సుగుణం అంటే. అదో అలవాటు.
  • సుగుణమంటే పాపాన్ని వదులుకోవడం కాదు. సుగుణాన్ని కోరుకోవడం.
  • సైనికుడు ఆలోచిస్తాడని నేను అనుకోను.
  • స్వేచ్ఛ అంటే బాధ్యత.అందుకే ఎక్కువ మంది భయపడతారు.
  • నీకు ఇతరులు ఏమి చెయ్యాలని కోరుకుంటావో నువ్వు వారికి అదే చెయ్యాలని కోరుకోకు. వారికి భిన్న అభిప్రాయాలు ఉండవచ్చు.

మూలాలు

మార్చు

[1]


 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.