జీవితం

పకృతి నుండి శక్తిని స్వీకరించి పునరుత్పత్తి చేసే పదార్థం


మనిషి పుట్టుక నుండి మరణం దాకా సాగే ప్రయాణమే జీవితం. చూడగలిగితే ప్రతి జీవితం ఓ అద్భుతమే. చదవగలిగితే ప్రతి జీవితమూ ఓ చరిత్రే.

 
జీవితం మసిపూసిన వదనం
జీవితం అఖండ భయసదనం
జీవితం గాలి వీచని సాయంత్రం

---కె.వి.రమణారెడ్డి

వ్యాఖ్యలు

మార్చు
  • తోటి సోదరుల మంచి కోసం కష్టించని జీవితం మానవుడికి జీవితమే కాదు. - ఆయన్ రాండ్
  • జివితంలో ఒంటరిగా నడవడం నేర్పేదే విద్య .....హార్న్
  • లాంగ్ షాట్ లో ఆనందంగానూ, క్లోజప్ లో విషాదంగానూ కన్పించేదే జివితం..... చార్లి చాంప్లిన్
  • జీవితం రేడియో సెట్టుకు భర్త ఏరియల్,భార్య ఎర్త్.--ఆరుద్ర[1].
  • జీవితం చివర తెలియని చీకటి వంతెన--మాదిరాజు రంగారావు[2].
  • జీవితం కరిగిపోయే మంచు-ఉన్నదానిని నలుగురికి పంచు--గోపాల చక్రవర్తి[3].
  • జీవితంలో అందరి ప్రయత్నమూ గెలవడానికే, ఎవడూ ఓడదలచడు--దాశరథి రంగాచార్య్
  • కొద్దిగా లోకజ్ఞానం, సహనం, హస్యరసజ్ఞత ఉంటే మనిషి హాయిగా జీవించవచ్చు---సోమర్‌సెట్ మామ్
  • జీవితమంటే రెండు సుదీర్ఘ అంధకారాల మధ్యనుండే వెలుతురు రేఖ --?
  • తథ్యమైన మరణం కంటే తాత్కాలికమైన జీవితమే ప్రాణుల్ని అధికంగా ప్రలోభపెడుతుంది...--?
  • జీవితం సహారా ఎడారి కాదు- చిగురించే స్వభావం కలది.----బిజినేపల్లి లక్ష్మీకాంత గుప్త[4]
  • తథ్యమైన మరణం కంటే తాత్కాలికమైన జీవితమే ప్రాణులని అధికంగా ప్రలోభపెడుతుంది.
  • మనిషి బతకటం గొప్ప కాదు, సాటి మనిషిని బతికించటం గొప్ప.
  • తాను బతకటం కోసం ఇంకో మనిషిని చంపటం కాదు, ఇంకో మనిషి బతకటం కోసం అవసరమైతే తాను చావాలి.
  • అవినీతి పద్ధతులలో ధనవంతులైపోవడం కన్నా, నీతిగా బతుకుతూ దరిద్రులుగా మిగిలిపోవడమే ఉత్తమం---అజ్ఞాత రచయిత
  • ప్రతి జీవిమీద జాలి వున్నావాడే గొప్ప వ్యక్తి. బుద్ధుడు........ సూక్తి సింధు గ్రంథం.
  • జీవితము పేకాట ఏ పని చేసినా పట్టుదల కావాలి. ఎలా ఆడతావనేది స్వంత కోరిక జవహర్ లాల్ నెహ్రూ........ సూక్తి సింధు గ్రంథం.
  • జీవితము విలువ అది చేసే పనుల మీద సాంద్రత మీద ఆధారపడుతుంది. ఆస్కార్ వైల్డ్........ సూక్తి సింధు గ్రంథం.
  • జీవితమంటే చావుకు ముందు పడే అవస్థ హెన్రీ జేమ్స్........ సూక్తి సింధు గ్రంథం.
  • జీవితాన్నుండి ఎవరు పారిపోలేరు .........స్వామి చిన్మయానంద
  • జీవితం ఓ కదలిక ...................స్వామి వివేకానంద ........ సూక్తి సింధు గ్రంథం.
  • జీవితకాలం మనమీద నృత్యం చేస్తుంది. మంచు ఆకు మొనలమీద నిలబడినట్లు. ....రవీధ్రనాథ్ టాగూర్.....సూక్తి సింధు గ్రంథం
  • జీవితం లేని మతం నిరుపయోగం. ............. హేగ్స్సూక్తి సింధు గ్రంథం
  • ప్రజానీకంలో ఎక్కువమంది జనాలు నిరాశతో జీవితం కొనసాగిస్తారు. .... హెన్రి ధోరో.....సూక్తి సింధు గ్రంథం నుండి
  • ఎంతకాలం బ్రతికామన్నది కాదు...... ఎలా జీవించామన్నదే.......... జేమ్స్ బైలీ ....సూక్తి సింధు గ్రంథం నుండి
  • ఈరోజుల్లో మనిషి జీవితం ఆహారం మీద కేంద్రీకరించ బడినది. రామకృష్ణ...సూక్తి సింధు గ్రంథం నుండి
  • కష్టసుఖాల కలగలుపే జీవితం ఇందిరాగాంధీ ..సూక్తి సింధు గ్రంథం నుండి
  • బతుకు ఒక పోరాటం. దానికోసం ఆరాటం పనికి రాదు. కాళోజి ..సూక్తి సింధు గ్రంథం నుండి
  • అతి దగ్గరగా వున్నప్పుడు జీవితం విషాదంగా ..... దూరంగా వున్నప్పుడు సుఖంగా కనుపిస్తుంది. చార్లీ చాప్లిన్ ..సూక్తి సింధు గ్రంథం నుండి

సినిమా పాటల్లో జీవితం

మార్చు
  • ఒక్కడైనా కానరాడే, జీవితాన్ని పోరాడకుండా గెలిచినోడు[5].
  • జీవితమే సఫలమూ ..... రాగ సుధా భరితమూ ప్రేమ కథా మధురము........


మరో ప్రవాహం(నవల)లో జీవితం

మార్చు

తెలుగు నవలా రచయిత వి.రాజా రామ్మోహనరావు రచించిన ప్రముఖ నవల ఇది. ఇందులో జీవితానికి సంబంధించిన కొన్ని వ్యాఖ్యలు...

  • బతుకులో ఉన్నది పొగొట్టుకోవడం ఓ బాధ-పొగొట్టుకున్నది గుర్తు రావడం మరో బాధ.
  • ఎంత నికృష్టపు బతుక్కైనా ప్రతి బతుక్కూ అపురూపమైనవై కొన్ని ఉంటాయి.
  • ప్రతి మనిషి జీవితంలో నిలబడటానికి ఆలోచన, శ్రమ అవసరం.
  • ఇతరుల మీద ఆధారపడి జీవించడం పెద్ద దరిద్రం.
  • ఎంతటి పనికిరాని బతుక్కేనా ఎగసిపడే గుండె ఉంటుంది. అన్యాయానికి ఆవేశపడే మనసు ఉంటుందని చాలా మందికి తెలియదు.
  • ఎవరి బతుక్కైనా సలహా ఇవ్వటానికి గొప్ప విజ్ఞానం కన్నా అనుభవం, సరైన దృష్టి ముఖ్యం.
  • ఎంతగానో దిగజారిన బతుకు భయంకరమైన మొండితనాన్నే కాదు, దానికన్న అసహ్యకరమైన మొరటుతనాన్ని ఇస్తుంది.
  • తమ బతుకుల బాధల వెనుకాల ఉన్న ఆర్థిక, రాజకీయ, సాంఘిక వలయాల శక్తి చాలా మందికి తెలియకపోయినా, ఏదో శక్తి తాలూకు ఒత్తిడి తమ బతుకుల మీద ఉందని ఇంచుమించు ప్రతి బడుగు బతుక్కూ తెలుసు.


ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. తెలుగు సాహిత్య దర్శనం-ఎస్.నాగేంద్రనాథ్‌రావు,పల్లవి పబ్లికేషన్స్, విజయవాడ,1994,పుట-11
  2. తెలుగు సాహిత్య దర్శనం-ఎస్.నాగేంద్రనాథ్‌రావు,పల్లవి పబ్లికేషన్స్, విజయవాడ,1994,పుట-10
  3. తెలుగు సాహిత్య దర్శనం-ఎస్.నాగేంద్రనాథ్‌రావు,పల్లవి పబ్లికేషన్స్, విజయవాడ,1994,పుట-11
  4. నవ్య జగత్తు,(ఆశాలత కవిత), రచన:బిజినేపల్లి లక్ష్మీకాంత గుప్త, వాసవీ సాహిత్య పరిషత్ ప్రచురణలు, హైదరాబాద్. పుట-103
  5. w:s/o సత్యమూర్తి చిత్రంలోని చల్..చలో..పాటలో
"https://te.wikiquote.org/w/index.php?title=జీవితం&oldid=16342" నుండి వెలికితీశారు