జె.కె.రౌలింగ్
అద్భుత కల్పనతో కూడిన (ఫాంటసీ) సిరీస్ - హ్యారీ పోటర్ రచయిత్రి
జోవాన్ రౌలింగ్ 31 జూలై 1965 న జన్మించింది. ఆమె కలం పేరు జె.కె. రౌలింగ్ తో 1997 నుండి 2007 వరకు ప్రచురించబడిన ఏడు-సంచికల అద్భుత కల్పనతో కూడిన (ఫాంటసీ) సిరీస్ - హ్యారీ పోటర్ ను రాసింది. ఒక బ్రిటీష్ నవలా రచయిత, ఆమె తన అమ్మమ్మ పేరు "కాథ్ లీన్"ని మధ్య పేరుగా ఉపయోగించి కలం పేరు రూపొందించింది. ఆమె రాబర్ట్ గాల్‌బ్రైత్ అనే మారుపేరుతో కూడా రాసింది. ఆమె ఈ ధారావాహిక 600 మిలియన్ కాపీలకు పైగా అమ్ముడైంది, 84 భాషల్లోకి అనువదించబడింది, చలనచిత్రాలు, వీడియో గేమ్‌లతో సహా ప్రపంచ మీడియా ఫ్రాంచైజీని సృష్టించింది. ది క్యాజువల్ వేకెన్సీ (2012) పెద్దల కోసం ఆమె వ్రాసిన మొదటి నవల. ఆమె రాబర్ట్ గాల్‌బ్రైత్ అనే మారుపేరుతో కొనసాగుతున్న క్రైమ్ ఫిక్షన్ సిరీస్ కార్మోరన్ స్ట్రైక్‌ను వ్రాసింది.
వ్యాఖ్యలు
మార్చు- నేను ఏ చిన్నపిల్లలను మంత్రవిద్యలో ప్రోత్సహించడానికి ఈ పుస్తకాలు రాయడం ప్రారంభించలేదు. నేను నవ్వుతున్నాను ఎందుకంటే, నాకు ఈ ఆలోచన అసంబద్ధంగా ఉంది. నేను ఇప్పుడు వేలాది మంది పిల్లలను కలిశాను, ఒక్కసారి కూడా ఒకరు నా దగ్గరకు వచ్చి, "రౌలింగ్, నేను ఈ పుస్తకాలను చదివినందుకు చాలా సంతోషిస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు నేను మంత్రగత్తెగా ఉండాలనుకుంటున్నాను." అని చెప్పలేదు. వాళ్లు దాన్ని చూడవలసినట్లుగా చూస్తారు. ఇది అభూత కల్పనా ప్రపంచం. ఇది అందరికి తెలుసు. నేను మాయాజాలాన్ని కూడా నమ్మను.
- As quoted in "Success of Harry Potter bowls author over" at CNN.com (21 October 1999); also quoted in "Urban Legends Reference Pages : Harry Potter" at Snopes.com
- కుంగుబాటు అనేది నేను అనుభవించిన అత్యంత అప్రియమైన విషయం. మీరు ఎప్పుడైనా మళ్లీ ఉల్లాసంగా ఉంటారని ఊహించలేకపోవడం. ఆశ లేకపోవడం. ఆ చచ్చిపోయిన అనుభూతి, విచారంగా అనిపించడం కంటే చాలా భిన్నంగా ఉంటుంది. బాధగా ఉంటుంది కానీ అది ఆరోగ్యకరమైన అనుభూతి. అనుభూతి చెందడం తప్పనిసరి విషయం. కుంగుబాటు చాలా భిన్నంగా ఉంటుంది.
- As quoted in "J. K. Rowling : The Interview," by Ann Treneman in The Times (30 June 2000)
- కీర్తి అనే విషయం ఆసక్తికరంగా ఉంది, ఎందుకంటే నేను ఎప్పుడూ ప్రసిద్ధి చెందాలని కోరుకోలేదు. నేను ప్రసిద్ధి చెందుతానని కలలో కూడా అనుకోలేదు. ఒక ప్రసిద్ధ రచయిత్రిగా ఉండటం అంటే జేన్ ఆస్టెన్ లాగా ఉంటుందని నేను ఊహించాను. ఇంట్లో కూర్చోవడం, పుస్తకాలు చాలా ప్రసిద్ధి చెందుతాయి, అప్పుడప్పుడు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ సెక్రటరీతో సంప్రదింపులు జరుపడం వంటివి. మీకు తెలుసా,వారు నా విషయాల్లోకి దూసుకెళ్తారని నేను అనుకోలేదని, సముద్రతీరంలో పొడవైన లెన్స్‌ల ద్వారా ఛాయాచిత్రాలను తీస్తారని, ఇది నా కుమార్తె జీవితాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు.
- As quoted in an interview with Jeremy Paxman, on Newsnight, as quoted in 'Harry is a lot, lot, lot angrier in this book' in The Telegraph (20 June 2003))
- ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి వైఫల్యం సరదా అని చెప్పను. నా జీవితంలో అది చీకటి కాలం, అప్పటి నుండి ప్రెస్ ఒక రకమైన అద్భుత కథల తీర్మానంగా ప్రాతినిధ్యం వహిస్తుందని నాకు తెలియదు. ఈ చీకటి సొరంగం ఎంత దూరం విస్తరించిందో నాకు అప్పుడు తెలియదు, చాలా కాలం వరకు, దాని చివర ఉన్న ఏదైనా కాంతి వాస్తవికత కంటే ఆశగా ఉంది. కాబట్టి నేను వైఫల్యం యొక్క ప్రయోజనాల గురించి ఎందుకు మాట్లాడాలి? వైఫల్యం అంటే అనవసరమైన వాటిని తీసివేయడం. నేనంటే నేనే తప్ప మరొకటి అన్నట్లు నటించడం మానేసి, నాకు సంబంధించిన పనిని పూర్తి చేయడానికి నా శక్తినంతా మళ్లించడం మొదలుపెట్టాను.
- ఏదైనా విషయంలో విఫలం కాకుండా జీవించడం అసాధ్యం, మీరు చాలా జాగ్రత్తగా జీవిస్తే తప్ప, అది జీవించడం కాదు. ఆ రకంగా విఫలమవుతారు.
- ఊహ అంటే లేనిది ఊహించే ఏకైక మానవ సామర్థ్యం మాత్రమే కాదు, అందువల్ల అన్ని ఆవిష్కరణలు, కొత్త ఆలోచనలకు మూలం.
- ఈ గ్రహం మీద ఉన్న ఇతర జీవులలా కాకుండా, మానవులు అనుభవం లేకుండానే నేర్చుకోగలరు, అర్థం చేసుకోగలరు. వారు ఇతరుల స్థానంలో ఉండి తమను తాము ఆలోచించగలరు.
- చాలామంది తమ ఊహలను అస్సలు ఉపయోగించడము ఇష్టపడరు. వారు తమ స్వంత అనుభవం పరిమితుల్లో హాయిగా ఉండటాన్ని ఎంచుకుంటారు, వారు కాకుండా మరొకరు జన్మించినట్లయితే అది ఎలా ఉంటుందో ఆలోచించడానికి ఎప్పుడూ కష్టపడరు. వారు అరుపులు వినడానికి లేదా బోనుల లోపల చూడడానికి ఇష్టపడరు; వారు తమ మనసులను, హృదయాలను వ్యక్తిగతంగా తాకని ఏబాధకైనా మూసివేయగలరు, తెలుసుకోవడానికి ఇష్టపడరు.
- నేను 18 సంవత్సరాల వయస్సులో ఆ క్లాసిక్ కారిడార్ చివరలో నేర్చుకున్న అనేక విషయాలలో ఒకటి, నేను అప్పటికి నిర్వచించలేకపోయాను. ఇది గ్రీకు రచయిత ప్లూటార్చ్ వ్రాసినది: మనం అంతర్గతంగా సాధించేదే బాహ్య వాస్తవికత మారుతుంది. ఇది ఆశ్చర్యకరమైన ప్రకటన మన జీవితంలో ప్రతి రోజు వెయ్యి సార్లు నిరూపించబడింది. ఇది కొంతవరకు, బయటి ప్రపంచంతో మనకున్న అనివార్యమైన సంబంధాన్ని వ్యక్తపరుస్తుంది,
- మనం ఇతరుల జీవితాలను కేవలం మన ఉనికిలోనే తాకుతాము.
- మన ప్రపంచాన్ని మార్చడానికి మాయాజాలం అవసరం లేదు. మనకు కావాల్సిన శక్తి అంతా మనలో ఇప్పటికే తీసుకు వెళ్తూనే ఉన్నాము. మనకు ఇంకా బాగా ఊహించే శక్తి ఉంది.
- ఒక వ్యక్తి ఎలా ఉంటాడో మీరు తెలుసుకోవాలనుకుంటే, అతను తన సమానమైన వారితో కాకుండా తన తక్కువ వారితో ఎలా ప్రవర్తిస్తాడో బాగా పరిశీలించండి.