ట్రిగ్వే హాల్వడన్ లీ (1896 జూలై 16 – 1968 డిసెంబరు 30) ఒక నార్వేజియన్ రాజకీయవేత్త, కార్మిక నాయకుడు, ప్రభుత్వాధికారి, రచయిత. ఐక్యరాజ్య సమితి మొట్టమొదటి ప్రధాన కార్యదర్శిగా 1946 నుంచి 1952 వరకు పనిచేశాడు. 1940 నుంచి 1945 వరకు కీలకమైన సమయంలో లండన్ నగరంలో ప్రవాసంలో ఏర్పరిచిన నార్వే ప్రభుత్వంలో విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేశాడు. కార్యసాధకునిగా, నిర్ణయాత్మకుడైన రాజకీయ నాయకునిగా లీ పేరుపొందాడు.[1]

ట్రిగ్వేలీ



వ్యాఖ్యలు

మార్చు
  • మానవజాతిలో అత్యధిక భాగం ఒక సాధారణ బాధ్యత, సార్వత్రిక సాధనం ఐక్యరాజ్యసమితి. సహనం, నిర్మాణాత్మక దీర్ఘకాలిక ఉపయోగం దాని సామర్థ్యాలను ప్రపంచానికి నిజమైన, సురక్షితమైన శాంతిని తీసుకురాగలదు.[2]
  • నేను గత కష్టాలన్నీ, నిరాశలూ, తలనొప్పులూ అన్నీ తీసుకొని వాటిని ఒక సంచిలో ప్యాక్ చేసి తూర్పు నదిలో విసిరేస్తాను.
  • పొరుగువాడు గమనించకుండా గొంతు కోయగలవాడే నిజమైన దౌత్యవేత్త.
  • సంఘర్షణలతో విభజింపబడిన ఈ ప్రపంచంలో, మనం ఉమ్మడి ప్రాతిపదికను కనుగొనడానికి ప్రయత్నించాలి, శాంతి కోసం కృషి చేయాలి.
  • ఒక దేశం బలం దాని సైనిక శక్తిలో కాదు, దౌత్యం, చర్చల పట్ల దాని నిబద్ధతలో ఉంది.[3]


మూలాలు

మార్చు
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.