భారతదేశంలో 5వ శతాబ్దానికి ముందు అవలంబించబడిన ధ్యానము మరియు సంప్రదాయాలే తంత్ర దర్శనము. తంత్రము అనే పద ప్రయోగం మొట్టమొదట ఋగ్వేదము లో చేయబడినది. హిందూ మతము, బౌద్ధ మతము మరియు జైన మతము పై తంత్రము చెరగని ముద్ర వేసినది. తంత్రమును ఆచరించువారిని తాంత్రికులు అంటారు.

  • డేవిడ్ గోర్డాన్ వైట్, తంత్రానికి గల నిర్వచనాలు అనేకమైనవి అని, ఇవి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి అని సెలవిస్తూనే
పరమాత్మ స్వరూపుడైన మనిషి లో శక్తిని నింపటానికి, కర్మని స్వీకరించి, ఆచరించి మరియు విముక్తిని పొందే ప్రయత్నానికి సంబంధించిన, ఆసియాలో ఉద్భవించిన సృజనాత్మక మార్గాలు, విశ్వాసాలు మరియు ఆచరణీయ పద్ధతులే తంత్రము. మనం అనుభూతి చెందే ఈ సృష్టి కేవలం దివ్య శక్తి యొక్క రూపాంతరమని, దైవ సృష్టి మరియు దైవ పరిరక్షణ చేసేది కూడా సృష్టియే అనే భావంపై ఇది ఆధారపడినది.
అని నిర్వచించాడు.
  • ఎన్ ఎన్ భట్టాచార్య ప్రకారం
ఆధునిక రచయితలు తంత్ర సిద్ధాంతాలు వేదాధారితాలు అని తెలిపినప్పటికీ పరిశోధకులు వీటిలో వేదాలకి వ్యతిరేక లక్షణాలు కలిగినట్టు గమనించారు.
  • స్వామీ నిఖిలానందుల ప్రకారం
తంత్రాలు, వేదాలకి అవినాభావ సంబంధమున్నది. అంతేగాక ఉపనిషత్తులు, యోగము వంటి వాటిని తంత్రము బాగా ప్రభావితం చేసినది.
  • తంత్రము ఈ ప్రపంచాన్ని సానుకూల దృక్పథంలో చూపిస్తుంది. ప్రపంచం పట్ల సానుకూల దృక్పథాన్ని అలవరుస్తుంది. మనిషి ప్రకృతిని వ్యతిరేకించక సహజ సిద్ధంగా ఆరాధించాలి. (తంత్రము అలవర్చే సానుకూల దృక్పథం గురించి హెన్రిక్ జిమ్మర్.)
  • నవ తంత్రములో తాంత్రిక మార్గం అపార్థం చేసుకొనబడుతోంది. తాంత్రిక సౌఖ్యం సాధారణ భావప్రాప్తిగా నవతంత్రము పొరబడుతోంది. - హుగ్ అర్బన్

మూలాలు

మార్చు
  1. White, David Gordon (ed.) (2000). Tantra in Practice. Princeton University Press. p. 9. ISBN 0-691-05779-6.
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.