చాలా మందిని నిర్వహించటం, కొద్ది మందిని నిర్వహించటం వంటిదే. అది సంస్థని బట్టి ఉంటుంది.
క్రీ.పూ 6వ శతాబ్దంలో సున్ ట్జూ, తన రచన The Art of War లో
ఇప్పటికిప్పుడు ఈ అవసరం రాకపోవచ్చు. కానీ సుదీర్ఘ కాలం తర్వాత ఒక బానిసకి యజమాని ఎంత అవసరమో, ఒక యజమానికి బానిస కూడా అంతే అవసరమౌతాడు.
1776 లో ఆడం స్మిత్, తన రచన The Wealth of Nations లో
నిర్వహించటం అనగా దీర్ఘదృష్టి, పథకం, ఏర్పాటు, సమన్వయం మరియు నియంత్రణ కలిగి ఉండటం.
1916 లో హెన్రీ ఫాయొల్
ఎక్కడైతే మానవ కార్యకలాపాలు ఒక క్రమపద్ధతిలో పరస్పర సహకారంతో చేపట్టబడతాయో, ఖచ్చితంగా అక్కడ నిర్వహణ ఉందని అర్థం.
1949 లో ఉర్విక్ మరియు బ్రెచ్ The Making of Scientific Management లో
సంస్థ లేనిదే నిర్వహణ లేదు. కానీ నిర్వహణ లేనిదే సంస్థ లేదు
1973 లో పీటర్ డ్రకర్, MANAGEMENT: Tasks, Responsibilities, Practices లో
ఆలోచించవలసినదంతా నిర్వాహకవర్గానికే వదిలేస్తే ఆ సంస్థ స్థితిగతులలో ఏ మాత్రం మార్పు ఉండదు.
1987 లో అకియో మోరిటా, Made in Japan లో
సమస్య కార్మికుడు కాదు. సమస్య అత్యున్నత నిర్వాహకవర్గం.
1993 లో డబ్ల్యు ఎడ్వార్డ్స్ డెమింగ్
మొదట బస్సులోకి సరైన ప్రయాణీకులని ఎక్కించుకొని, సరికాని ప్రయాణీకులని దించి వేసి, సరైన ప్రయాణీకులకి సరైన సీట్లు కేటాయించి తర్వాతే ఎక్కడికి ప్రయాణించాలో నిర్ణయించుకోవటమే మంచిది.
2001 లో జిం సి కొల్లిన్స్, Good to Great: Why Some Companies Make the Leap...and Others Don't లో
సక్రమంగా నిర్వర్తిస్తే నిర్వహణ ఉత్తమమైన వృత్తి. ఇతరులు ఇన్ని విధాలుగా నేర్చుకొనే, ఎదిగే, బాధ్యత తీసుకొనే, సాధించినవాటికి గుర్తింపు పొందే, జట్టు యొక్క విజయానికి దోహదపడే అవకాశం మరే ఇతర ఉద్యోగము లోనూ లేవు.
2011 లో క్లేయ్టన్ ఎం క్రిస్టెన్సన్, Harvard Business Review లో