పరేష్ రావల్
పరేష్ రావెల్ (జననం: మే 30, 1955) భారత చలనచిత్ర రంగానికి చెందిన నటుడు, రాజకీయనాయకుడు. 1984లో చిత్ర సీమలోకి ప్రవేశించాడు. పలు భాషా చిత్రాల్లో నటించాడు. 2014లో అహ్మదాబాద్ తూర్పు నుండి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించాడు. [1]
వ్యాఖ్యలు
మార్చు- నా దృష్టిలో నటన అంటే వేరొకరిగా మారి వారి కథను ప్రామాణికతతో చెప్పడం.
- నటన పట్ల నా నిజమైన అభిరుచిని కనుగొన్న ప్రదేశం రంగస్థలం, ఇది ఎల్లప్పుడూ నా హృదయంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది.[2]
- నటుడిగా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడం, ఎంగేజ్ చేయడం, అప్పుడప్పుడు ఆలోచింపజేయడం నా లక్ష్యం.
- నటనలో విజయం అంటే అవార్డులు, ప్రశంసలు కాదు. ప్రేక్షకుల ప్రేమ, గౌరవానికి సంబంధించినది.
- నటుడిగా నా పునాదిని అభివృద్ధి చేసుకున్న రంగస్థలమే నాకు స్ఫూర్తిదాయకం.
- మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోవడానికి, సృజనాత్మక రిస్క్ తీసుకోవడానికి థియేటర్ ఒక వేదిక.
- నటన అనేది సాంస్కృతిక హద్దులను దాటి ప్రజలను కలిపే విశ్వజనీన భాష.