పుస్తకం (Book) అనేది చదవడానికి ఉపయోగపడే పేజీల సంకలనం.

మంచి పుస్తకం మంచి మనసుకు మరో పేరు - సొంత పుస్తకం మంచి మనిషికి మరో తోడు. ---ఇరివెంటి కృష్ణమూర్తి[1]

పుస్తకంపై ఉన్న వ్యాఖ్యలు

మార్చు
  • చినిగిన చొక్కానైన తొడుక్కో, ఒక మంచి పుస్తకం కొనుక్కో
  • మీరు పుస్తకాలు పఠించవచ్చు.కానీ అవి మిమ్మల్ని ఎక్కువ దూరం తీసుకెళ్ళలేవు.మీలోని ఉత్తమత్వాన్ని బయటికి తేవటమే నిజమైన విద్య అనిపించుకుంటుంది.
  • పుస్తకం కన్నతల్లి పాత్రను పోషిస్తుంది.
    • మాగ్జిం గోర్కి, రష్యన్ రచయిత.
  • కొన్ని పుస్తకాలు రుచిచూడాలి. కొన్నింటిని మింగేయాలి, కొన్నిటిని నమిలి జీర్ణం చేసుకోవాలి.
    • బేకన్.
  • మనల్ని గుచ్చి గాయపరిచి, ఇబ్బందిపెట్టే రచనల్నే మనం చదవాలి. మనం చదువుతున్న పుస్తకం మన తలపై మొట్టి మేల్కొలపని పక్షంలో అసలు చదవడం ఎందుకు? మంచి పుస్తకం ఒక దుస్సంఘటన లాగా మనల్ని ప్రభావితం చేయాలి. మనకన్నా మిన్నగా మనం ప్రేమించే ఆప్తుల మరణం లాగా మనల్ని తీవ్రంగా కలచివేయాలి. అందరికీ దూరంగా ఏకాంతంగా అరణ్యాలకు పారిపోవాలనిపించేలా ప్రేరేపించాలి. పుస్తకం మనలో గడ్డకట్టిన సముద్రాల్ని గొడ్డలిలాగా పగలగొట్టాలి.
  • ఎన్నో పుస్తకాలు, చాలా తక్కువ సమయం
    • ఫ్రాంక్ జప్పా
  • పుస్తకాలు లేని గది ఆత్మ లేని శరీరం లాంటిది.
    • మార్కస్ టులియస్ సిసెరో
  • ఒక మంచి పుస్తకాన్ని మొదటిసారి చదివితే ఒక కొత్త స్నేహితుడిని పొందినట్టుంటుంది. మళ్లీ మళ్లీ చదివితే పాత్త స్నేహితుల్ని కలిసిన ఆనందం వేస్తుంది.[2]

పద్యాలు

మార్చు

గ్రంథములు

మార్చు
(ఆచంట సూర్యనారాయణ సాంఖ్యాయనశర్మగారు)
గ్రంధాలయ సర్వస్వము - సంపుటము 7 సంచిక 2 (వికీసోర్సు) నుండి

 
సీ.మంచి మందంచును♦సంచిలో నుంచిన
రోగంబు మాన్పి యా♦రోగ్య మిడునె?
ఫలము మంచి దటంచు ♦వర్తించి తినకుండ
దాఁచినచో జిహ్వ ♦ తనియఁగలదె?
చల్లదనంబిచ్చు♦ చందనం బనిచెప్పి
పూయక సుఖమెట్లు ♦పొందఁ గలఁడు?
భాగ్యంబు గలదంచు వాడకయుండిన
భాగ్య సౌఖ్యము వాఁడు వడయు నెట్లు?

జ్ఞానదాయక గ్రంథముల్♦ చాలదెచ్చి
బీరువాలను నిండించి పెట్టునంత
జ్ఞానభాగ్యంబు గలుగదు♦ చదువకున్న
ఇంటిలో విత్తులుంచఁ జే ♦ నెట్లు పండు?

పుస్తకంపై ఉన్న సామెతలు

మార్చు
  • అంత పెద్ద పుస్తకం చంకలోవుంటే, పంచాంగం చెప్పలేవా అన్నట్లు.
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.

మూలాలు

మార్చు
  1. తెలుగు దివ్వెలు,9 వ తరగతి,తెలుగువాచకం,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రచురణలు,హైదరాబాద్,2013, పుట-108
  2. India Herald.09 March 2024. https://www.indiaherald.com/Quotes/Read/493113/chirigina-chokka-thodukko-kani-oka-manchi-pusthakam-konukko
"https://te.wikiquote.org/w/index.php?title=పుస్తకం&oldid=23553" నుండి వెలికితీశారు