దేశాధినేతను వంశపారంపర్యంగా కాకుండా ప్రజలచే ఎన్నికగు విధానమును ప్రజాస్వామ్యం అందురు. భారతదేశము ప్రపంచములో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము.

ప్రజాస్వామ్యంపై ఉన్న వ్యాఖ్యలు

మార్చు
  • ప్రజాస్వామ్య స్పూర్తిని ఇతరులెవ్వరూ బలవంతంగా రుద్దలేరు, అది అంతర్గతంగా, స్వతసిద్ధంగా వికసించాల్సి ఉంటుంది. -- మహాత్మా గాంధీ
  • ప్రజాస్వామ్యం, సోషలిజం రెండూ మార్గాలే కాని గమ్యాలు కావు. -- జవహార్ లాల్ నెహ్రూ
  • ప్రజలయొక్క, ప్రజలచేత, ప్రజలకోసం పాలించే పాలనయే ప్రజాస్వామ్యం. -- అబ్రహాం లింకన్.
  • ఇతర దేశాల్లో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి అమెరికన్లు మహాసముద్రమైనా దాటివెళ్తారు కాని ఓటు వేయడానికి ప్రక్కవీధికి వెళ్ళరు. --బిల్ వాన్
  • ఎవరో మెరుపుదాడి చేసి ప్రజాస్వామ్యాన్ని హతమార్చే అవకాశం ఎంతమాత్రం లేదు, మన నిర్లక్ష్యం, ఉదాసీనత, అనాసక్తి వల్ల క్రమేపీ దానికదే అంతరిస్తుంది -- రాబర్ట్-ఎం-హబిన్స్.
  • ప్రజాస్వామ్యం కన్న ఉత్తమమైనపాలన విధానం మరొకటిలేదు--జవహార్ లాల్ నెహ్రూ.
  • ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజలను ఉతికి పారేయడమే ప్రజాస్వామ్యం-- ఆస్కార్ వైల్డ్.
  • ప్రజాస్వామ్యం పనికిమాలిందే కావచ్చు గాక... కానీ అంతకు మించిన ప్రత్యామ్నాయం లేదు... -- విన్ స్టన్ చర్చిల్


 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.