అబ్రహం లింకన్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 48 interwiki links, now provided by Wikidata on d:Q91
పంక్తి 11:
*వివేకులు మాట్లాడతారు, మూర్ఖులు వాదిస్తారు.
*పిలవని పేరంటానికి వెళ్ళేవారు అందరూ దయ్యాలే
*హృదయం నిండా పరుల పట్ల సానుభూతి పొంగి పొరలే మనిషికే, ఇతరులను విమర్శించే అధికారం ఉంటుంది.
*పని కోసం ఎదురుచూడటం ఓ అరుదైన యోగ్యత. దానిని ప్రోత్సహించాలి.
*డబ్బు పోతే ఫర్వాలేదు, ఆరోగ్యం చెడితే ఇబ్బంది, కానీ నైతిక విలువలు కోల్పోతే అన్నీ కోల్పోయినట్లే.
*నీ ముత్తాతలు ఏమి సాధించరనేది అప్రస్తుతం, ఎప్పటికైనా నీ ఎదుగుదల మాత్రమే నీది.
*వేచి వుంటే అవకాశాలు వస్తాయి. కానీ అవి దూసుకుపోయే వాళ్ళు వదిలేసినవి మాత్రమే.
*ఒక వ్యక్తి గుణగణాలు పరీక్షించాలి అంటే అతనికి అధికారం ఇచ్చి చూడాలి.
*సంపద రెక్కలు వచ్చి ఎగిరి పోవచ్చు. కలకాలం నిలిచేది సత్ప్రవర్తన మాత్రమే.
*పొదుపును ప్రోత్సహించనిదే ఐశ్వర్యం రాదు.
*అభినందనను ప్రతి ఒక్కరు ఇష్టపడతారు.
*విద్య లేని ప్రజాస్వామ్యం, మితం లేని వంచన.
*తన దేశాన్ని చూసి గర్వించే మనిషి అంటే ఎవరైనా ఇష్టపడతారు.
*శ్రమ యొక్క శక్తి ఈ ప్రపంచములో ఎంతో ఉన్నత మైనది. దానిని జయించే శక్తి వేరే శక్తికి లేదు.
*మీరు ప్రజలందరినీ కొంతకాలం మోసగించవచ్చు. అయితే ప్రజలందరినీ అన్ని కాలాలలోనూ మోసం చెయ్యలేరు.
*క్రిందవైపు చూసే ఒకడు నాస్తికం గురించి మాట్లాడొచ్చు. పై వైపు చూసే ఒకడు దేవుడు లేడని చెప్పడు.
*నేను ఇప్పుడు ఉన్న పరిస్థితికి, ఇంకా పొందేందుకు నమ్మకం కలిగి ఉండడానికి , నేను నా దైవపూర్వకమైన తల్లికి ఎంతో ఋణపడి ఉన్నాను.
*నాయకుడనే వాడు ప్రశంసలను నలుగురిలోనూ, విమర్శలను ఏకాంతంలోను తెలియచేయాలి.
*ప్రతి సామాన్యుడికి ఒక రోజు వస్తుంది. ఐతే ఆ సమయం వచ్చే వరకూ మౌనంగా ఎదురుచూడాలి.
*ప్రేమించగల మనిషికే విమర్శించే హక్కు ఉంటుంది.
*నేను బానిసగా ఉండేందుకు ఇష్టపడను.అలాగే యజమానిగా కూడా
{{wikipedia}}
 
"https://te.wikiquote.org/wiki/అబ్రహం_లింకన్" నుండి వెలికితీశారు