స్వామీ వివేకానంద: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
*విద్య బాల్యానికి మాత్రమే పరిమితం కాదు. నాకున్న కొద్ది శక్తితో ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలెన్నో ఉన్నాయి.
*విజ్ఞానం అనేది ఒకరి నుంచి మరొకరికి చేరినపుడే దానికి విలువ. అనంత విజ్ఞానం సంపాదించినా అది నలుగురికీ పంచకపోతే నిష్ప్రయోజనం. మిణుగురు పురుగు ఉన్న కాస్త వెలుతురును, లోకానికి పంచాలని చూస్తుంది. కాబట్టి మనలో ఏ కొద్ది విజ్ఞానం ఉన్నా అది ఇతరులకు పంచినపుడే ప్రయోజనం,సార్ధకత.
*అనాలోచితంగా తొందరపడి ఏ పని చేయరాదు. చిత్తశుద్ది, పట్టుదల, ఓర్పు ఈ మూడు కార్యసిద్ధికి ఆవశ్యకం. కానీ ప్రేమ ఈ మూడింటి కన్నా ఆవశ్యకం.
*స్వార్ధం లేకుండా ఉండడమే అన్ని నీతులలోకి గొప్పనీతి. స్వార్ధంతో నిండిన ప్రతి పని గమ్యాన్ని చేరడానికి అంతరాయం కలిగిస్తుంది.
*సిరి సంపదలు మంచితనాన్ని తీసుకురావు. మంచితనం మాత్రం అభిమానాన్ని,దీవెనలను తీసుకువస్తుంది.
పంక్తి 50:
*ప్రతి వ్యక్తీ దేశము మహత్వం పొందగలిగితే మూడు విషయాలు ఆవస్యకములై ఉన్నాయి.1.సజ్జనత్వపు శక్తి గురించిన ధృడ విశ్వాసం 2.అసూయ,అనుమానాల రాహిత్యం 3.సజ్జనులుగా మెలగాలనీ,మంచి చేయాలని ప్రయత్నించే యావన్మందికి సహాయపడడం.
*భారతదేశ పతనానికి కారణం ప్రాచీనులు ఏర్పాటు చేసిన శాసనాలు,సంప్రదాయాలు చెడ్డవి కావడం కాదు. సంపూర్ణ పరిశీలన పొంది సక్రమంగా సిద్ధాంతాలు కావడానికి వాటికి అవకాశం లభించకపోవడమే.
*మనం బయటికిపోయి మన అనుభవాలు ఇతరుల అనుభవాలతో పోల్చి చూసుకొనక పోవడం, మన చుట్టూ ఏం జరుగుతుందో గుర్తించకుండా ఉండడం, మన బుద్ది భ్రష్టమై పోవడానికి గొప్ప కారణం.
*ఇతర దేశాలలో ప్రగల్భలాడేవారు చాలా మంది ఉన్నారు.కాని మతానుష్ఠాన పరులైనవారు, ఆధ్యాత్మికతను తమ జీవితాల్లో చాటి చూపిన వారిని ఇక్కడే, ఈ దేశంలో మాత్రమే చూడవచ్చు.
*అపజయాలను లక్ష్య పెట్టకండి,అవి వాటిల్లడం సహజం, అవి జీవితానికి అందం చేకూరుస్తాయి.
*అపజయాలచే నిరుత్సాహం చెందకండి. ఆదర్శాన్ని చేగొని వేయిసార్లు ప్రయత్నించండి. వేయి సార్లు ఓటమి చవిచూస్తే కూడా ఇంకోసారి ప్రయత్నించండి.
*బలహీనతకు పరిష్కారం దానిని గురించి చింతన చెందడం కానే కాదు. బలాన్ని గురించి ఆలోచించడమే. అందుకు ప్రతిక్రియ మనుష్యులలో నిబిడీ కృతమైవున్న బలాన్ని గూర్చి వారికి బోధించండి.
*ఆత్మవిశ్వాసాన్ని గూర్చి నేర్చి దానిని ఆచరణలో చూపించి ఉంటే, మనం ప్రస్తుతం అనుభవిస్తున్న అనర్ధాలు,దుఃఖాలు దాదాపు మటుమాయమై పోయేవి.
*మానవ చరిత్రనంతటినీ పరికిస్తే, ఘనకార్యాలు చేసిన స్త్రీ పురుషుల జీవితాల్లో అన్నింటికన్నా ఎక్కువగా సామర్ధ్యాన్ని ఇచ్చిన మూలశక్తి వారి ఆత్మ విశ్వాసమే అని తెలుస్తుంది. తాము ఘనులమనే విస్వాసంతో వారు జన్మించారు, ఘనులే అయ్యారు.
పంక్తి 60:
*సంకల్పనశక్తి తక్కిన శక్తులన్నిటికన్నా బలవత్తరమైనది. అది సాక్షాత్తు భగవంతుని వద్ద నుండి వచ్చేది కాబట్టి దాని ముందు తక్కినదంతా వీగిపోవలసిందే.నిర్మలం,బలిష్ఠం అయిన సంకల్పం సర్వశక్తివంతమైనవి.
*ఆత్మవిశ్వాసపరులైన కొందరు వ్యక్తుల చరిత్ర ప్రపంచ చరిత్ర. ఆ విశ్వాసం వ్యక్తిలోని దివ్యత్వాన్ని బహిర్గతం చేస్తుంది.
*స్వార్ధరాహిత్యమే విశేష లాభదాయకం. కాని దానిని అలవరచుకొనే ఓర్పు జనానికి లేదు.
*ఇతరులకు మేలు చేయాలనే నిరంతర ప్రయత్నంచే మనలను మనం మరచి పోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలా మనలను మనము మరచిపోవడమే జీవితంలో గొప్ప గుణపాఠం.
*అవివేకంతో మనిషి తనను తాను ఆనందమయుణ్ణిగా చేసుకోగలనని భావిస్తాడు.కాని అనేక సంవత్సరాలు కొట్టూమిట్టాడి స్వార్ధపరతను చంపుకోవడమే నిజమైన సౌఖ్యమని తన సౌఖ్యం తన చేతిలో ఉన్నదేగాని ఇతరుల చేతుల్లో లేదని గ్రహిస్తాడు.
పంక్తి 71:
*నా సోదరులారా! మనం పేదలం,అనామకులం.కాని అత్యున్నత స్థితిలోని వారికి సదా అవే పరికరాలైనాయి.
*అసత్యం కన్నా సత్యం అనంత రెట్లు బరువైనది,మంచితనం కూడా అంతే.
*వ్యాకోచమే జీవనం,సంకోచమే మరణం. యావత్తు ప్రేమ వ్యాకోచం, యావత్తు స్వార్ధం సంకోచం.కనుక ప్రేమ మాత్రామే ఏకైక జీవన ధర్మం.
*అనేకుల హితం కోసం సర్వుల సంక్షేమం కోసమూ లోకంలోని అతిసాహసవంతులూఅతి సాహసవంతులూ, సర్వోత్తములూ త్యాగం చేయాలి. అనంత ప్రేమ కరుణ గల వందల కొద్దీ బుద్దులు అవసరమై ఉన్నారు.
*లోకానికి కావలసింది శీలం.ఎవరి జీవితం ప్రజ్వలించే ప్రేమతో, నిస్వార్ధమయమై ఉంటుందో అలాంటివారే లోకానికి అవసరం. ఆ ప్రేమ వారు ప్రతి పదాన్ని పిడుగులా ధ్వనింప చేస్తుంది.
*మతం సిద్ధంతాలలోనూ, రాద్ధాంతాలలోనూ, ప్రజ్ఞావాదాలలోనూ లేదు. మతం అంటే మన స్థితి, మన పరిణతే. మతమంటే సాక్షాత్కారానుభవమే.
*మనుష్యుడు జన్మించినది ప్రకృతి జయించడానికి మాత్రమే కాని దానిని అనుసరించడానికి కాదు.
*ఈ ప్రపంచం ఒక పెద్ద గారడీశాల. మన మిచ్చటికి రావాడం మనల్ని బలిష్ఠులుగా చేసుకోవడానికే.
*సత్యానికై దేనినైనా సరే త్యజించవచ్చు, కానీ దేనికొరకైనా సత్యాన్ని త్యజించకూడదు.
*మానవుడికి మరణం లేదు, జననమూ లేదూ, దేహాలు నశిస్తాయి.కాని అతనికి మరణం లేదు.
*మృగత్వం,మానవత్వం,దివ్యత్వం-ఈ మూడు కలిస్తేనే మానవుడవుతాడు.
పంక్తి 88:
*ధీరులు సత్యమార్గాన్ని ఎప్పుడూ తప్పరు.
*ముందు స్వచ్ఛంగా ఉండు, అప్పుడు అధికారం వస్తుంది.
*అనుభవాల క్రమమే జీవితం. అనుభవమే గురువు..
*అవివేకం మనల్ని మందలిస్తుంది.జ్ఞానం మనల్ని అందులోంచి విడిపిస్తుంది.
*నన్ను తాకవద్దు అనడం ఓ మానసిక వ్యాధి, వ్యాప్తియే జీవనం, సంకుచితమే మరణం, ప్రేమ ద్వారా అందరిని నీలో ఇముడ్చుకో.
*మతం ఒకరకంగా గొప్ప అనుభవమని మనం మర్చిపోకూడదు.
*జీవితానుభవానికి చదువు బాలికల్లో ప్రభావం చూపడం లేదనే భావన ఇప్పటికి అలానే వుంది.
పంక్తి 100:
*ప్రేమ,కోపం ఒకదాని కొకటి వ్యతిరేకం.
*ఐశ్వర్యానికి తమ్ముడు అహంకారం.
*చెడు తలచేవారు,కీడు తలపెట్టేవారు ప్రశాంతత కోల్పోతారు. వెలుగు చూడరు.
*అదృష్టవంతునికి జాగ్రత్త తోడైతే ఎడారిని కూడా స్వర్గతుల్యం చేయగలడు.
*గొప్ప కార్యాలెప్పుడు గొప్ప త్యాగాలవల్లే సాధించబడతాయి.
పంక్తి 115:
*ఆధునిక ప్రపంచంలో పనిని గురించి మాట్లాడినంతగా ఆలోచనల్ని గురించి మాట్లాడటం లేదు.
*బద్దకమే అసలు పాపం, అదే పేదరికానికి కారణం.
*స్వర్గంలో జీవించడానికి, ఈ ప్రపంచంలో జీవించడానికి తేడా లేదు.
*మూర్ఖులకు సెలవు దినం సోమరితనం, మన పేదరికానికి అసలు మూలం సోమరితనం.
*వైవిద్యమే జీవితపు ఆత్మ.
*ధనం శక్తి కాదు.మంచితనమే శక్తి.
పంక్తి 159:
*ఓర్పు, ప్రేమ, నిజాయితి మన అస్త్రసస్త్రాలైనప్పుడు ఈ ప్రపంచములో ఏ శక్తి మనలను అడ్డుకోలేదు.
*మన దేహాన్ని కాని మన మనసును కాని బలహీన పరిచే ఎంతటి కోరికలైనా నిర్ద్వందముగా త్యాగము చేయాలి.
*ఎక్కడెక్కడ పోరాటం , తిరుగుబాటు ఉద్భావిస్తాయో అక్కడే జీవముంది, సత్యముంది, చైతన్యముంది. ప్రతీ గొప్పకార్యము అవహేళన, ప్రతిఘటన ఆ తరువాత అంగీకారము అనే మూడు మజిలీల గుండా సాగిపోతుంది.
*ఈ ప్రపంచములో మన ఘనత మూన్నాళ్ళ ముచ్చటే ... సంపదలు, కీర్తిప్రతిష్టలు నశించిపోయేవే. పరుల కోసం జీవించేవారే మనుషులు, మిగిలినవారంతా జీవన్మ్రుతులు.
*ప్రస్తుతం మనం శరీరాన్నే నేను అనుకుంటున్నాము. ఈ శరీర స్పృహ అధికంగా ఉన్నంత వరకు ధ్యానం, ఏకాగ్రతలు సాధ్యం కావు. కాబట్టి ప్రస్తుతం మన పూర్తి పోరాటం శరీరంతోనే.
పంక్తి 195:
*ఒక మనిషి శీలాన్ని తెలుసుకోవాలంటే అతడు చేసే అతి సాధారణమైన పనుల్ని చుడండి, అసాధారణమైన కార్యాలను కాదు.
*ప్రజలను సన్మార్గంలో నడిపించడానికి ఆద్యాత్మిక విద్య ఒక్కటే శరణ్యం.
*నువ్వు భగవంతుని కోసం ఎక్కడ వెతుకుతున్నావు? పేదలు,దుఃఖితులు, బలహీనులు అందరు దైవాలు కాదా ముందుగా వారినెందుకు పూజించకూడదు. గంగ తీరంలో బావి తవ్వడం ఎందుకు? ప్రేమకున్న అనంత శక్తిపై నమ్మకం ఉంచు.
*పిరికివాడు మాత్రమే 'ఇది నా తలరాత' అని అనుకుంటాడు.
*సిద్ధాంతాలు మతం కాదు. మంచిగా ఉంటూ మంచిని పెంచడమే మత సారాంశం.
పంక్తి 231:
*వివేకం మనిషికి మాత్రమే గల గొప్ప వరం. మనసును స్వాధీనంలో ఉంచుకుని బుద్దితో వివేచించి,ముందుకు నడిచేవాడు మహాత్ముడు. సమర్ధుడు అవుతాడు. జీవితంలో విజయాన్ని సాధించ గలుగుతాడు. మనసును స్వాధీనంలో ఉంచుకోని వ్యక్తికీ పతనం తప్పదు.
*రోజా పుష్పం కింద ముల్లున్నాయని దిగులు వద్దు. ముళ్లపై పూలు వికసించాయని తెలుసుకో. అలాగే మనం విజయం సాధించాలంటే కష్టనష్టాలుంటాయి. వాటిని అధిగామిస్తేనే మనం విజయం సాధించగలం.
*గమ్యం పట్ల ఎంత శ్రద్ద వహిస్తామో, ఆ గమ్యాన్ని చేరడానికి వెళ్లే మార్గం పట్ల కూడా అంతే శ్రద్ద వహించాలి.
 
"https://te.wikiquote.org/wiki/స్వామీ_వివేకానంద" నుండి వెలికితీశారు