మహాత్మా గాంధీ: కూర్పుల మధ్య తేడాలు

agaghafhfhasffashasasfsar
చి Arghhafhfhs (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 7852 ను రద్దు చేసారు
పంక్తి 1:
[[File:Portrait Gandhi.jpg|right|thumb|200px|<center>మహాత్మా గాంధీ</center>]]
[[ఫైలు:Gandhi and Indira.jpg|right|thumb|200px|<center>[[ఇందిరాగాంధీ]]తో మహాత్మా గాంధీ</center>]]
మహాత్ముడనీ, జాతిపిత ఆనీ పేరెన్నిక గన్న '''[[w:మహాత్మా గాంధీ|గాంధీ]]''' ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యము సాధించిన వేలాది నాయకులలో అగ్రగణ్యుడు. గాంధీజీ 1869 అక్టోబర్ 2 న గుజరాత్ లోని పోరుబందర్‌లో జన్మించాడు. 1948 జనవరి 30న హత్యకు గురైనాడు.
 
'''ఆయన చేసిన వ్యాఖ్యలు...'''
* అహింసకు మించిన ఆయుధం లేదు.
* ఆత్మాభిమానం, గౌరవాల్ని వేరెవరో పరిరక్షించరు, మనకు మనమే వాటిని కాపాడుకోవాలి.
* ఆలోచనల పరిణామమే మనిషి. అతను ఎలా ఆలోచిస్తే అలా తయారౌతాడు.
* కంటికి కన్ను సిద్ధాంతం ప్రపంచాన్ని అంధకారంలోకి నెట్టివేస్తుంది.
* ఆత్మార్పణకు,స్వచ్చతకు నిలయం కానప్పుడు స్త్రీకి విలువ లేదు.
* ఓటు, సత్యాగ్రహం ఈ రెండూ ప్రజలచేతిలోని ఆయుధాలు.
* మార్పునుకు సిద్ధంగా ఉండండి. అపుడే కొత్త ప్రపంచాన్ని చూడగలుగుతారు.
* హక్కులకు వాస్తవమైన మూలాధారం-కర్తవ్య నిర్వహణం.మనం మన కర్తవ్య నిర్వహణ చేసినట్లయితే హక్కులు పొందేందుకు ఎంతో దూరంలో ఉండము.మన విధులు నిర్వర్తించకుండా హక్కుల కోసం పరుగెత్తినట్లయితే అవి మనల్ని దాటి పోతాయి.మనం ఎంతగా వాటిని వెంబడిస్తే అవి అంత త్వరితంగా ఎగిరిపోతాయి.
* మీరు పుస్తకాలు పఠించవచ్చు.కానీ అవి మిమ్మల్ని ఎక్కువ దూరం తీసుకెళ్ళలేవు.మీలోని ఉత్తమత్వాన్ని బయటికి తేవటమే నిజమైన విద్య అనిపించుకుంటుంది.మానవత్వం అనే పుస్తకం కంటే వేరొక ఉత్తమ గ్రంధం ఏమి ఉంటుంది.ప్రపంచం ఆధిపత్యం వహించిన పటిష్టవంతమైన శక్తి-ప్రేమ.మరియు అది వినయం గల కల్పనా రూపము.ప్రేమ ఎక్కడ ఉంటుందో,దేవుడు కూడా అక్కడే ఉంటాడు.
* జీవితంలో స్వచ్చమైనవి మరియు ధార్మికమైనవి అయిన వాటన్నిటికీ స్త్రీలు ప్రత్యేక సంరక్షకులు.స్వభావరీత్యా మితవాదులైనందువల్ల మూఢాచారాలను విడనాడటంలో ఆలస్యం చేస్తారు. అలాగే జీవితంలో స్వచ్చమైనవి,గంభీరమైనవి వదిలి పెట్టేందుకు కూడా అలస్యం చేస్తారు.
* విద్యార్థుల ఆలోచనలు, ఆచరణలు క్రమశిక్షణా సహితంగా లేకుంటే వారు చదువంతా వృధా.
* ఎవరైతే చిరునవ్వుల్ని ధరించరో వారు పూర్తిగా దుస్తులు ధరించినట్లు కాదు.
* ఒక అభివృద్ది చెందిన కంఠం నుండి ఉత్తమ సంగీతం సృష్టించే కళను అనేకమంది సాధించవచ్చు కానీ ఒక స్వచ్చమైన జీవితం అనే మధురస్వరము నుండి అటువంటి సంగీతకళను పెంపు చేయటం చాలా అరుదుగా జరుగుతుంది. అన్ని కళల కంటే జీవితం గొప్పది. పరిపూర్ణత్వానికి చేరువ కొచ్చిన జీవితం గల మానవుడే అత్యంత గొప్ప కళాకారుడని నేను ప్రకటిస్తాను.సౌజన్యతగల జీవితం యొక్క గట్టి పునాది లేని కళ ఏమిటి?
* మన ప్రార్థన హృదయ పరిశీలన కోసం.భగవంతుని మద్దతు లేకుండా మనం నిస్సహాయులమని మనకు అది గుర్తు చేస్తుంది.దాని వెనుక భగవంతుని దీవెన లేనట్లయితే ఉత్తమమైన మానవ ప్రయత్నం కూడా నిష్పలమౌతుంది.
* సత్యాగ్రహము జయమైందని ప్రజలు సంతోషించారే కాని సంపూర్ణ విజయ లక్షణాలు లోపించడం వలన నాకు సంతృప్తి కలుగలేదు.
** కైరా సత్యాగ్రహం పాక్షికంగా విజయవంతం కావడంపై గాంధీ చేసిన వ్యాఖ్య
* నన్ను ఢిల్లీ వాసులు పిలవడం వలన అచ్చట శాంతి నెలకొల్పడం కోసం వెళ్తున్నాను కాని అశాంతి నెలకొల్పడం కోసం కాదు.
** రౌలత్ చట్టం తర్వాత జాతీయోద్యమ నాయకులు గాంధీని ఢిల్లీ రమ్మని పిలిచినప్పుడు గాంధీ ఢిల్లీ వెళ్ళగా పోలీసులు రైలు దింపినప్పుడు గాంధీ చేసిన వ్యాఖ్య.
* మన అభిప్రాయాలను ఇతరులపైన బలవంతంగా రుద్దడం వలన మనం నిజమైన స్వాతంత్ర్యాన్ని సంపాదించుకోలేము.
** నాగ్పూర్ భారత జాతీయ కాంగ్రెస్ సదస్సులో గాంధీజీ వ్యాఖ్య.
* మనిషిని బాధించే జంతువులను చంపకూడదని నా అభిప్రాయం కాదు. ఏది హింస, ఏది అహింస అన్నది మనుషులు తమ విచక్షణతో తెల్సుకోవాలి.
** హరిజన్ పత్రికలో గాంధీ వెలిబుచ్చిన అభిప్రాయం.
* నా మట్టుకు సత్యాగ్రహ ధర్మ సూత్రం ప్రేమ సూత్రం లాంటిది. ఒక అనంతమైన శాశ్వతమైన సిద్ధాంతం. సత్యాగ్రహ నియమాలు ఒక క్రమపరిణామాన్ని కలిగి ఉంటాయి.
** సత్యాగ్రహ ధర్మ సూత్రం గురించి గాంధీజీ తన పుస్తకంలో వివరించిన వ్యాఖ్యలు.
* ప్రజాస్వామ్య స్పూర్తిని ఇతరులెవ్వరూ బలవంతంగా రుద్దలేరు, అది అంతర్గతంగా, స్వతసిద్ధంగా వికసించాల్సి ఉంటుంది.
* విద్యార్థుల ఆలోచనలు, ఆచరణలు క్రమశిక్షణా సహితంగా లేకపోతే వారి చదువంతా వృథా.
* చెడును నిర్మూలించేందుకు ఆయుధాలు పడితే జరిగేది రెండు దుష్టశక్తుల మధ్య యుద్ధమే.
 
==== '''[[w:మహాత్మా గాంధీ|గాంధీ]]''' గురించి పలువురు ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు ====
 
* ఇటువంటి ఒక వ్యక్తి నిజంగా మన మధ్య జీవించాడని రాబోయే తరాలవారు నమ్మలేరు
* మన తరంలో రాజకీయవేత్తలందరికంటే కూడా గాంధీ ఆభిప్రాయాలు మేలైనవి. ఆయన చెప్పినట్లుగా మనం నడచుకోవాలి. మనకు కావలసినదాని కోసం హింసతో పోట్లాడటము కాదు. ఆన్యాయమని మనకు తోచినదానికి ఏ మాత్రమూ సాయము చేయకుండా ఉండటము మన బాధ్యత - ప్రఖ్యాత శాస్త్రవేత్త [[ఆల్బర్ట్ ఐన్‍స్టీన్]]
* [[జీసస్]] నాకు సందేశం ఇచ్చాడు, గాంధీ దాన్ని ఆచరణలో చూపించాడు -[[మార్టిన్ లూథర్ కింగ్]]
*కొల్లాయి గట్టితేనేమి మా గాంధి కోమటై పుట్టితేనేమి.-- బసవరాజు అప్పారావు.
 
{{Commons|Mohandas K. Gandhi|Mohandas K. Gandhi}}
{{wikipedia}}
 
[[వర్గం:1869 జననాలు]]
[[వర్గం:1948 మరణాలు]]
[[వర్గం:భారతీయులు]]
[[వర్గం:భారత స్వాతంత్ర్యోద్యమ నాయకులు]]
 
[[ar:مهاتما غاندي]]
[[bg:Махатма Ганди]]
[[br:Mahatma Gandhi]]
[[bs:Mahatma Gandhi]]
[[ca:Mohandas Gandhi]]
[[cs:Móhandás Karamčand Gándhí]]
[[cy:Gandhi]]
[[de:Mahatma Gandhi]]
[[el:Μαχάτμα Γκάντι]]
[[en:Mohandas Karamchand Gandhi]]
[[eo:Mohandas Karamchand GANDHI]]
[[es:Mohandas Gandhi]]
[[et:Mahatma Gandhi]]
[[eu:Mahatma Gandhi]]
[[fa:ماهاتما گاندی]]
[[fi:Mohandas Gandhi]]
[[fr:Mohandas Karamchand Gandhi]]
[[gl:Mahatma Gandhi]]
[[he:מוהנדס קרמצ'נד גנדי]]
[[hr:Mahatma Gandhi]]
[[hu:Mahatma Gandhi]]
[[hy:Մահաթմա Գանդի]]
[[id:Mahatma Gandhi]]
[[is:Mohandas Gandhi]]
[[it:Mahatma Gandhi]]
[[ja:マハトマ・ガンジー]]
[[ka:მაჰათმა განდი]]
[[ko:모한다스 간디]]
[[lt:Mohandas Karamčandas Gandis]]
[[mr:मोहनदास करमचंद गांधी]]
[[nl:Mahatma Gandhi]]
[[no:Mahatma Gandhi]]
[[pl:Mohandas Karamchand Gandhi]]
[[pt:Mahatma Gandhi]]
[[ro:Mahatma Gandhi]]
[[ru:Махатма Ганди]]
[[sk:Móhandás Karamčand Gándhí]]
[[sl:Mahatma Gandhi]]
[[sq:Mahatma Gandhi]]
[[sr:Махатма Ганди]]
[[sv:Mahatma Gandhi]]
[[ta:மகாத்மா காந்தி]]
[[tr:Mahatma Gandhi]]
[[uk:Махатма Ганді]]
[[vi:Mohandas Karamchand Gandhi]]
[[zh:圣雄甘地]]
"https://te.wikiquote.org/wiki/మహాత్మా_గాంధీ" నుండి వెలికితీశారు