భర్త పట్ల క్రౌర్యం

భర్త పట్ల క్రౌర్యం (ఆంగ్లం: Cruelty against husband) అనగా స్త్రీల రక్షణ కొరకు ఉన్న చట్టాలను తనకనుకూలంగా ఉపయోగించుకొని భర్త మరియు అయన కుటుంబీకులు ప్రమేయం లేనప్పటికీ దుర్వినియోగం చేస్తూ, డబ్బు కోసం వేధిస్తూ భయపెట్టడం. కొన్ని సందర్భాలలో శారీరకంగానూ, మాససికంగానూ మరియు సామాజికం గానూ భర్తను వేధించటం.

ఒక వర్ణచిత్రంలో "Woman Striking Man With Broom" (1875)

వ్యాఖ్యలు

మార్చు

స్వయంగా ఒక సుప్రీం కోర్టు జడ్జి గారి వ్యాఖ్య -

  • The law, intended to be a shield to protect women, has been turned into a weapon to torment men.
  • (స్త్రీకి 'రక్షణ కవచం' గా ఉండవలసిన చట్టమే, పురుషులను హింసించే 'ఆయుధం'గా మారిపోయినది.)

మరొక న్యాయనిపుణుడు ఈ దుష్పరిణామాన్ని చట్టపరమైన తీవ్రవాదం (Legal Terrorism) గా వ్యవహరించారు[1][2].

ఢిల్లీలో స్త్రీల తరపున వ్యాజ్యాలనే ఎక్కువగా స్వీకరించే సాధనా రామచంద్రన్ ఒక మహిళా న్యాయవాది యొక్క స్పందన -

  • I'm always seeing decent men put in jail by women because they want custody of the children or the house. Strong, successful men turn into mental wrecks fighting these cases because they go sometimes for two decades.[3]
  • (శిశుసంరక్షణ లేదా భర్త పేరున ఉన్న ఇల్లు తమకే చెందాలనుకొనే స్త్రీలు పరువుగా బ్రతుకుతున్న తమ భర్తలనే జైలులో వేయించటం నిత్యం నేను కళ్ళారా చూస్తున్నాను. చట్టంతో చేసే పోరాటంలో, ఈ వ్యాజ్యాలు ఒక్కోమారు రెండు దశాబ్దాల వరకూ కొనసాగటంతో జీవితంలో సఫలీకృతులైన, శక్తిమంతులైన పురుషులు కూడా మానసికంగా ఎంతో కృంగిపోతారు.)

మరొక న్యాయవాది -

  • Some women use it to keep the husband under their thumb. They've got their finger on the trigger all the time.
  • (కొంత మంది స్త్రీలు భర్తను వారి చెప్పుచేతలలో ఉంచుకోవటానికి ఈ చట్టాన్ని వాడుకొంటారు. చట్టం అనే ఈ తుపాకీ యొక్క ట్రిగ్గరు పై వారి వేలు ఎప్పుడూ ఉంటుంది.)

బెంగుళూరుకు చెందిన శంకరప్ప అనే న్యాయవాది -

  • The charges may be proved false later, but a criminal record is a criminal record, after all.
  • (ఈ ఆరోపణలు నిరాధారాలు అని తర్వాత ఎలాగూ తేలుతుంది, కానీ ముద్దాయిలు నేరస్థులనే ముద్ర మాత్రం చెరిగిపోదు.)

ఈ చట్టాల దుర్వినియోగానికి బలయ్యే పురుషులకు సలహాలు/సూచనలు ఇచ్చే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ కార్యకర్త -

  • The victims of 498A tend to be successful men. That's why their wives try to extort money out of them by framing them. Poor men, fortunately, don't suffer from abuse of the dowry law because there is no point framing a bus driver or a rickshaw wallah, is there?
  • (ఆర్థికంగా బలంగా ఉన్న పురుషులే ఎక్కువగా 498 ఏ బాధితులుగా కనబడుతున్నారు. అందుకే వారిని ఇరికించి వారి భార్యలు వారి నుండి ధనాన్ని వెలికి తీయాలనుకొంటున్నారు. అదృష్టవశాత్తూ, పేదరికంలో మగ్గే పురుషులు ఈ చట్టం దుర్వినియోగం బారిన పడటం లేదు. ఒక బస్సు డ్రైవరునో, రిక్షాలాగే వాడినో ఇరికించటంలో ఏ లాభమూ లేదు, ఉందంటారా?)
  • We tell them that if they are innocent, they should not pay their wife a single penny.
  • (మీరు నిర్దోషులైతే, మీ భార్యకు మీరు ఒక్క నయాపైస కూడా కట్టకూడదని మేము చెబుతూ ఉంటాం.)

ఈ చట్టాలకే బలి అయిన అటు పిమ్మట సేవ్ ద ఫ్యామిలీ ఫౌండేషన్ ను నెలకొల్పిన స్వరూప్ సర్కార్ -

  • When a woman falsely accuses not just her husband but also his mother and sisters and has them arrested, what about their rights? Aren't they women too? Is it fair to try women without first providing any evidence?
  • (ఒక స్త్రీ భర్తపైనే కాక అతని తల్లి, అక్కచెల్లెళ్ళ పై అభియోగాలు మోపి వారిని అరెస్టు అయ్యేలా చేసినపుడు మరి వారి హక్కులు ఏమైనట్లు? వారు కూడా స్త్రీలే కదా? సాక్ష్యాధారాలు లేకుండా స్త్రీలపై విచారణ జరపటం సమంజసమేనా?)

సోదరుని పై మరదలు వేసిన వరకట్న వేధింపు వ్యాజ్యాలకు చలించిపోయి సంగ్యబాల్యను స్థాపించిన అరుణ్ మూర్తి -

  • Once the complainant sends her husband and his family to jail, chances of reconciliation are few. She thinks its a victory. But that's the only victory, things go downhill from there.
  • (ఒక్కమారు ఫిర్యాదుదారు తన భర్తను, అతని కుటుంబ సభ్యులను జైలుకు పంపిస్తే, సామరస్యపూర్వక పరిష్కారం జరిగే అవకాశాలు చాలా తక్కువ. అది ఆమె విజయంగా పరిగణించవచ్చు. కానీ, అదొక్కటే ఆమె విజయంగా మిగిలిపోతుంది, ఇక అక్కడి నుండి ప్రారంభమయ్యేది ఆమె పతనమే.)

ఈ బాధలని ప్రత్యక్షంగా అనుభవించిన రాజ్ చోప్రా -

  • No one in the world seems to be interested in tending to men's grievances, whereas people are all ears to women's problem. This leaves men helpless.
  • (పురుషులు పడే బాధలను తీర్చటానికి ఈ ప్రపంచంలో ఎవరూ ఆసక్తి కనబరిచేలా లేరు, కానీ స్త్రీ సమస్యను వినటంలో మాత్రం అందరూ ముందుంటారు. ఇది పురుషులను నిస్సహాయులుగా మిగిల్చి వేస్తుంది.)

శ్వేతా కిరణ్/అర్నేష్ కుమార్ ల వ్యాజ్య/ప్రతివ్యాజ్యాలు

మార్చు

శ్వేతా కిరణ్ అనే వివాహిత తన భర్త అర్నేష్ కుమార్ మరియు అతని తల్లిపై వేసిన వ్యాజ్యంలో క్రింది కోర్టు మరియు హై కోర్టులు వారికి బెయిల్ ను నిరాకరించినవి. దీనితో అర్నేష్ కుమార్ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 2 జూలై 2014న సుప్రీం కోర్టు ఇరువురికీ బెయిళ్ళు మంజూరు చేసినది. ఏడు సంవత్సారాలు, లేదా అంతకన్నా ఎక్కువ శిక్ష పడేంత పెద్ద నేరం చేసిన వారినే అదుపులోకి తీసుకోవాలని, వరకట్న వేధింపు చట్టాలలో అత్యధికంగా పడేది మూడేళ్ళ జైలు శిక్ష మాత్రమే అని, కావున ఇప్పటి నుండి ఈ కేసులలో సాక్ష్యాధారాలు లేకుండా (భర్తతో సహా) ఎవరినీ అదుపులోకి తీసుకొనరాదని సుప్రీం కోర్టు ఈ సందర్భంగా చేసిన సంచలన వ్యాఖ్యలు[4]:

  • The institution of marriage is greatly revered in this country.
  • (ఈ దేశ వివాహ వ్యవస్థ ఎంతో గౌరవాన్ని చూరగొన్నది.)
  • The simplest way to harass is to get the husband and his relatives arrested under this provision.
  • (హింసించటానికి అతి సులభమైన దారి, ఈ చట్టం ద్వారా భర్తను మరియు అతని కుటుంబీకులను అరెస్టయ్యేలా చేయటం.)
  • ...the power of arrest is one of the lucrative sources of police corruption.
  • (...అరెస్టు చేసే అధికారం పోలీసుల అవినీతికి ఒక లాభదాయకమైన మూలమైనది.)
  • The attitude to arrest first and then proceed with the rest is despicable.
  • (మొదట అరెస్టు చేసి ఆ తర్వాతే జరగవలసినవి చూసే ధోరణి తుచ్ఛమైనది.)
  • The existence of the power to arrest is one thing, the justification for the exercise of it is quite another. Apart from power to arrest, the police officers must be able to justify the reasons thereof.
  • (అరెస్టు చేసే అధికారం ఉండటం నాణేనికి ఒక వైపు అయితే, ఆ అధికారం యొక్క వినియోగాన్ని సమర్థించుకోవటం మరొక వైపు. అధికారం కలిగి ఉండటమే కాదు, అరెస్టు చేయటానికి కారణాలు కూడా పోలీసు ఆఫీసర్లకు తెలిసి ఉండాలి.)
  • It has not come out of its colonial image despite six decades of independence, it is largely considered as a tool of harassment, oppression and surely not considered a friend of public.
  • (స్వాతంత్రం సిద్ధించి అరవై ఏళ్ళు గడచినా పోలీసు వ్యవస్థ ప్రక్షాళనకు నోచుకోలేదు. బ్రిటీషు పాలన నాటి పాత చింతకాయపచ్చడి పద్ధతులనే ఇంకా అవలంబిస్తోంది. వేధింపులకు, అణచివేతకు గురి చేసే పరికరంగానే పరిగిణింపబడుతోందే తప్పితే, ప్రజలకు స్నేహితుని వలె పరిగణింపబడవలసిన పోలీసు వ్యవస్థలో ఆ ఊసే లేదు.)
  • Arrest brings humiliation, curtails freedom and cast scars forever. Law makers know it so also the police.
  • (అరెస్టు అవమానాన్ని తెచ్చిపెడుతుంది, స్వేచ్ఛను హరించివేసి, ఎన్నటికీ మానని గాయాలని చేస్తుంది. చట్టాలు చేసేవారికీ, పోలీసులకు కూడా ఈ విషయం తెలుసు.)

మనీషా పొద్దార్/ప్రీతి గుప్తాల వ్యాజ్య/ప్రతివ్యాజ్యాలు

మార్చు

కేవలం భర్త, అతని తోబుట్టువులకు అసౌకర్యం కలిగించాలనే దురుద్దేశ్యంతోనే ఆధారాలు లేని వ్యాజ్యం వేసిన మనీషా పొద్దార్ పై ఆమె ఆడపడుచు ప్రీతి గుప్తా వేసిన ప్రతివాజ్యంలో అత్యున్నత న్యాయస్థానం 13 ఆగష్టు 2010 న చేసిన వ్యాఖ్యలు[5].

  • Unfortunately, at the time of filing of the complaint the implications and consequences are not properly visualized by the complainant that such complaint can lead to insurmountable harassment, agony and pain to the complainant, accused and his close relations.
  • (దురదృష్టవశాత్తూ, ఫిర్యాదు చేసే సమయంలో, ఈ ఫిర్యాదుల వలన ఎదురయ్యే చిక్కులను మరియు పరిణామాలను; తనకే కాక, ఎవరిపై ఫిర్యాదు చేయబడినదో వారికి మరియు వారి కుటుంబీకులకు భరింపశక్యం కానంత హింసను, వేదనను మరియు బాధను తెచ్చిపెడతాయని ఫిర్యాదుదారులు సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు.)
  • The ultimate object of justice is to find out the truth and punish the guilty and protect the innocent. To find out the truth is a herculean task in majority of these complaints.
  • (న్యాయం యొక్క ప్రధాన లక్ష్యం సత్యాన్ని కనుగొని దుష్టశిక్షణ శిష్టరక్షణ చేయటం. సత్యాన్ని కనుగొనటం ఇటువంటి ఫిర్యాదులలో కత్తిమీద సాము వంటిది.)
  • At times, even after the conclusion of criminal trial, it is difficult to ascertain the real truth.
  • (ఒక్కోమారు, నేర విచారణ అంతా పూర్తయిన తర్వాత కూడా, నిజానిజాలని తేల్చటం కష్టతరంగానే మిగిలిపోతోంది.)
  • Experience reveals that long and protracted criminal trials lead to rancour, acrimony and bitterness in the relationship amongst the parties.
  • (సుదీర్ఘ కాలం సాగే నేర విచారణలు తలక్రిందులై, ఇరుపక్షాల సంబంధబాంధవ్యాలలో అస్థిరత, హింసలను తెచ్చి, పరిస్థితులను తీవ్రతరం చేశాయని అనుభవపూర్వకంగా తెలుసుకొనబడినది.)
  • ...if the husband or the husband's relations had to remain in jail even for a few days, it would ruin the chances of amicable settlement altogether. The process of suffering is extremely long and painful.
  • (...భర్త/అతని కుటుంబీకులు ఏ కొద్ది రోజులపాటు జైలులో గడపవలసి వచ్చినా, సామరస్యపూర్వకంగా పరిష్కారం చేసుకొనే ఆ చిరు అవకాశానికి కూడా దారులు మూసుకుపోతున్నాయి. సుదీర్ఘ కాలం కొనసాగే బాధాకరమైన ప్రక్రియలకు ఇది దారి తీస్తోంది.)
  • ...exaggerated versions of the incident are reflected in a large number of complaints.
  • (...జరిగిన సంఘటనలను పెంచి చెప్పటం చాలా ఫిర్యాదులలో సాధారణమైపోయినది.)
  • Unfortunately a large number of these complaints have not only flooded the courts but also have led to enormous social unrest affecting peace, harmony and happiness of the society.
  • (దురదృష్టవశాత్తూ ఇటువంటి ఫిర్యాదులు న్యాయస్థానాలను ముంచెత్తటమే కాక అపారమైన అశాంతిని నెలకొల్పి శాంతిభద్రతలకు, సామరస్యానికి మరియు సంఘం అనుభవించవలసిన సుఖసంతోషాలకు విఘాతం కలిగిస్తున్నాయి.)
  • It is high time that the legislature must take into consideration the pragmatic realities and make suitable changes in the existing law.
  • (శాసనసభ కార్యసాధక వాస్తవాలని పరిగణలోకి తీసుకొని ప్రస్తుతం అమలులో ఉన్న చట్టానికి తగు సవరణలు చేయవలసిన పతాక సమయం ఆసన్నమైనది.)