మాయాబజార్

1957 లో విడుదలైన తెలుగు సినిమా

విజయా వారి మాయాబజార్ తెలుగు సినిమాల్లోకెల్లా అత్యత్తమమైంది. ఈ చిత్రంలో నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్.వి.రంగారావు, సావిత్రి, రేలంగి, గుమ్మడి తదితరులు నటించారు. సినిమాకు కె.వి.రెడ్డి దర్శకత్వం వహించగా నాగిరెడ్డి-చక్రపాణి నిర్మించారు.

సంభాషణలు

మార్చు
  • ఎవరూ పుట్టించకపోతే మాటలెలా పుడతాయి. వెయ్యిండి రెండు వీరతాళ్ళు.

చినచేపను పెదచేప చినమాయను పెనుమాయ
అది స్వాహా.. ఇది స్వాహా.. అది స్వాహా ఇది స్వాహా

  • శాస్త్రం ఏది చెప్పినా ఎప్పుడూ నిష్కర్షగానూ కర్కశంగానే చెబుతుంది, మనం సారాంశం గ్రహించాలి-అంటే శాస్త్రం ఎలా ఉన్నా ఒక సమన్వయం లో ఉంటుందన్నమాట.
  • సొంత తెలివిలేనివాళ్ళకు గాని శాస్త్రం మీకూ మాకూ ఎందుకు?

పాటలు

మార్చు
  • లాహిరి లాహిరి లాహిరి లో
    • రసమయజగమును రాసక్రీడకు ఉసిగొలిపే ఈ మధురిమలో, ఎల్లరి మనములు ఝల్లనజేసే చల్లనిదేవుని అల్లరిలో లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా.
  • నీవేనా నను తలచినది నీవేనా నను పిలచినది
    • కలలోనే ఒక మెళకువగా, ఆ మెళకువలోనే ఒక కలగా; కలయో నిజమో వైష్ణవమాయో తెలిసీ తెలియని అయోమయంలో
  • నీ కోసమే నే జీవించునది, ఈ విరహములో ఈ నిరాశలో
    • విరహము కూడా సుఖమే కాదా, నిరతము చింతన మధురము కాదా, వియోగ వేళల విరిసిన ప్రేమల విలువలు కనలేవా?
  • వివాహ భోజనంబు, వింతైన వంటకంబు
    • ఔరౌర గారెలల్ల, అయ్యారే బూరెలల్ల, వహ్వా రే పాయసాలు హహ్హ హహ్హ హహ్హా, ఇవల్ల నాకె జెల్ల
"https://te.wikiquote.org/w/index.php?title=మాయాబజార్&oldid=13752" నుండి వెలికితీశారు