మార్గరెట్ థాచర్
బ్రిటిష్ దేశపు రాజకీయవేత్త, ప్రధానమంత్రి
మార్గరెట్ హిల్డా థాచర్ (13 అక్టోబర్ 1925 - 8 ఏప్రిల్ 2013) బ్రిటీష్ రాజకీయవేత్త, రాజనీతిజ్ఞురాలు, ఆమె 1979 నుండి 1990 వరకు యునైటెడ్ కింగ్‌డమ్ కు ప్రధాన మంత్రిగా, 1975 నుండి 1990 వరకు కన్జర్వేటివ్ పార్టీ నాయకురాలుగా పనిచేశారు. ఆమె మొదటి మహిళా. బ్రిటీష్ ప్రధాన మంత్రి ఇంకా 20వ శతాబ్ధం లో ఎక్కువ కాలం పనిచేసిన బ్రిటిష్ ప్రధాన మంత్రి. ప్రధాన మంత్రిగా,అమలు చేసిన నియంత్రణ, ప్రైవేటీకరణ, నూతన సరళీకరణ ఆర్థిక విధానాల వలన ఆమెను "ఐరన్ లేడీ" అని పిలుస్తారు. రాజీలేని రాజకీయాలు, నాయకత్వ శైలి ఆమె విధానాన్ని థాచెరిజం అని పేర్కొంటారు.
వ్యాఖ్యలు
మార్చుhttps://www.brainyquote.com/topics/women-quotes నుండి
- మీరు ఏదైనా చెప్పాలనుకుంటే, ఒక పురుషుడుని అడగండి; మీరు ఏదైనా చేయాలనుకుంటే, ఒక స్త్రీని అడగండి.
- నేను థేమ్స్ నది మీదుగా నడవడం నా విమర్శకులు చూస్తే, నాకు ఈత రాదని చెబుతారు.
- మిమ్మల్ని ఇష్టపడాలని అనుకుంటే, మీరు ఎప్పుడైనా దేనికైనా రాజీ పడటానికి సిద్ధంగా ఉంటారు.మీరు ఏమీ సాధించలేరు.
- మీరు ఏదైనా గెలవడానికి ఒకటి కంటే ఎక్కువసార్లు యుద్ధం చేయవలసి రావచ్చు.
- అధికారం అంటే నాయకురాలు లాంటిది... ప్రజలకు నీవు అని నువ్వు చెప్పాలంటే అది నువ్వు కాదు.
- ఒక దాడి లో గాయపడితే నేను ఎల్లప్పుడూ చాలా సంతోషిస్తాను ఎందుకంటే వారు ఒకరిపై వ్యక్తిగతంగా దాడి చేస్తే, వారికి రాజకీయంగా ఒక్క వాదన కూడా మిగిలి లేదని నేను భావిస్తున్నాను.
- అణ్వాయుధాలు లేని ప్రపంచం మనందరికీ తక్కువ స్థిరంగాను, మరింత ప్రమాదకరంగా ఉంటుంది.
- కష్టపడకుండా ఉన్నత స్థాయికి చేరుకున్న వారెవరో నాకు తెలియదు. అదే విధానం (recipe), మిమ్మల్ని ఎల్లప్పుడూ పైకి తీసుకువెళ్లదు, కానీ మిమ్మల్ని చాలా దగ్గరకు చేర్చుతుంది.
- సోషలిజం సమస్య ఏమిటంటే, చివరికి మీ దగ్గర ఇతరుల డబ్బు అయిపోయింది.
- నాకు వాదన అంటే ఇష్టం, చర్చ అంటే ఇష్టం. ఎవరైనా అక్కడ కూర్చుని నాతో ఏకీభవిస్తారని నేను ఆనుకోను, అది వారి పని కాదు.
- మీరు, నేను ఎదో త్రోవ లేదా రైలు ద్వారా వస్తాము, కానీ ఆర్థికవేత్తలు మౌలిక సదుపాయాలపై ప్రయాణిస్తారు.
- మీకు తెలిసినది, సరైనది, ముఖ్యమైనది చేయడానికి మిమ్మల్ని మీరు క్రమశిక్షణలో పెట్టుకోవడం కష్టమైనప్పటికీ, ఇది గర్వపడడానికి, ఆత్మగౌరవం, వ్యక్తిగత సంతృప్తికి ప్రధాన మార్గం.
- ఈ రోజు, ఇంకా ప్రతిరోజూ మీ పనిని ప్రణాళిక చేయండి, ఆపై మీ కార్యక్రమాన్ని రూపొందించండి.
- యూరప్ చరిత్ర ద్వారా సృష్టించబడింది. అమెరికా తత్వశాస్త్రం ద్వారా సృష్టించబడింది.
- రోడ్డు మధ్యలో నిలబడటం చాలా ప్రమాదకరం; మీరు రెండు వైపుల నుండి రాకపోకల రద్దీ(ట్రాఫిక్)తో పడగొట్టబడతారు.
మార్గరెట్ థాచర్ గురించి
మార్చు- 1979లో ఆమె అధికారంలోకి వచ్చినప్పుడు, బ్రిటన్‌ను పరిపాలించే వారు ట్రేడ్ యూనియన్ లేదా మన దేశంలో ఎన్నికైన ప్రభుత్వం కాదా అని మేము నిజంగా చర్చించాము. ఆమె అత్యంత ముఖ్యమైన విజయం ఏమిటంటే, ఆ ప్రశ్న ఇకపై అడగరని నేను భావిస్తున్నాను. ఆమె ఒక ప్రత్యేకమైన వ్యక్తి, ప్రత్యేకమైన బలం, సామర్థ్యాలు ఇంకా ప్రత్యేకమైన లోపాలను కూడా కలిగి ఉంది.
- Paddy Ashdown (BBC TV News, 22 November 1990), as quoted in Dale 2012
- ప్రధానమంత్రులు గుర్తుంచుకోబడేవారు ఆలోచించి, బోధించే వారు, కానీ చాలామంది చేయరు. శ్రీమతి థాచర్... ఒక తరం ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేసింది.
- Tony Benn, quoted in Peter Hennessy, The Prime Minister: The Office and its Holders since 1945 (2001), p. 398
- ఆమె బ్రిటన్ మొదటి మహిళా ప్రధాన మంత్రిగా పదకొండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగడమే కాకుండా, తన ప్రజాజీవితంలో తన విధులన్నింటినీ నిర్వర్తించిన సంకల్పం, స్థితిస్థాపకత ఉన్న వ్యక్తిగా ఆమె గుర్తుండిపోతుంది. ఆమెతో ఏకీభవించని వారు కూడా ఆమె నమ్మకాల బలాన్ని, ప్రపంచంలో బ్రిటన్ విధిపై ఆమెకున్న అచంచల విశ్వాసాన్ని ఎప్పుడూ అనుమానించలేదు.
- Gordon Brown, quoted in 'Margaret Thatcher dies: Reaction in quotes', BBC News.co.uk (8 April 2013)
- ఆమె ఉక్కు సంకల్పం అంతర్జాతీయ గౌరవాన్ని గెలుచుకుంది. ఆమె నిస్సంకోచమైన స్త్రీత్వం మహిళలను అభిమానాన్ని సాధించింది. మార్గరెట్ థాచర్ నాయకురాళ్ళకే ఒక నాయకురాలు.