మార్టిన్ లూథర్ కింగ్

మార్టిన్ లూథర్ కింగ్ జూ. (జనవరి 15 1929ఏప్రిల్ 4 1968) అమెరికా దేశపు మానవ హక్కుల పోరాట యోధుడు మరియు నోబుల్ శాంతి బహుమతి గ్రహీత.

We must discover the power of love, the power, the redemptive power of love. And when we discover that we will be able to make of this old world a new world. We will be able to make men better. Love is the only way.

ముఖ్యమైన వ్యాఖ్యలుసవరించు

 • మనిషి దేవుని బిడ్డ; అతని రూపంలో సృష్టించాడు కనుక అతడిని దేవుడిలాగే గౌరవించాలి.
 • ప్రతి ప్రగతి అనిశ్చయమే, ఓ సమస్యకు పరిష్కారం దొరికేలోపు మరో సమస్య ఎదురౌతుంది.
 • ఫ్లోరిడాలో ఎస్కిమోలు ఎంత మందున్నారు. స్వాతంత్ర్య పోరాటంలో కమ్యునిస్టులు అంత మంది వున్నారు.
 • ప్రతి వస్తువు విలువ కాలాన్ని బట్టి వుంటుంది.
 • నిజం చెప్పాలంటే కాలం తటస్థం. అయితే దాన్ని విచ్చిన్నానికి, నిర్మాణానికి ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోవచ్చు.
 • క్రీస్తు మతం నమ్మకం, దయల సమాహారం.
 • మనిషి దేవుని బిడ్డ, అతని రూపంలో సృష్టించాడు. కనుక అతన్ని దేవుడిలాగే గౌరవించాలి.
 • స్వర్గంలో నవ్వడం నిషిద్ధమైతే నాకు స్వర్గం చేరడం ఇష్టం లేదు.
 • నీరులా న్యాయం ప్రవాహంగా ప్రవహిస్తే తప్ప మనం సంతృప్తి చెందరాదు.
 • నిజాయితీ పరుడు కొందరికి శత్రువౌతాడు.
 • తెల్లవాడి బావమరిదిగా ఉండే కంటే వాడికి సోదరుడిగా ఉండాలనుకుంటాను.
 • పాపం మౌలికంగా దేవునికి దూరం కావడమే.
 • పాపాన్ని ప్రతిఘటించకుంటే పాపానికి సహకరించినట్లే.
 • తక్కువ మాటలు అదే ప్రార్ధన.
 • యుద్ధం మానవజాతిని కబళించే ప్లేగు వ్యాధి.అది మతాన్ని, రాజ్యాలను,కుటుంబాలను నాశనం చేస్తుంది. దీని కంటే ఏదైనా ఉపద్రవమే మేలు.
 • నాకో స్వప్నం ఉన్నది. ఏదో ఒకరోజు నా నలుగురు పిల్లలూ...తమ చర్మం యొక్క రంగుతో కాకుండా, వారి గుణగణాలతో గుర్తించబడే దేశంలో నివసించాలనేదే నా స్వప్నం.
 • ప్రజల్ని అనుసరించడమే నిజమైన నాయకత్వం.
 • ఎగరలేకపోతే పరిగెత్తు, పరిగెత్తలేకపోతే నడువు, నడవలేకపోతే ప్రాకు, ఏదైనా చెయ్యి, కాని ముందుకు మాత్రం వెళుతూనే ఉండు.
 • ప్రేమనే అంటిపెట్టుకు ఉండాలని నేను నిర్ణయించుకొన్నాను. ద్వేషం నాకు భరించలేనంత బరువు.
 • ఒక శత్రువును మిత్రుడిగా మార్చే శక్తి, కేవలం ప్రేమకు మాత్రమే ఉన్నది.
 • చివరకు మనం శత్రువుల మాటలను కాదు, మిత్రుల నిశబ్దాన్ని మాత్రమే గుర్తుంచుకొంటాము.