ముత్యాలముగ్గు

1975 సినిమా

ముత్యాలముగ్గు 1975 లో బాపు దర్శకత్వంలో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాలో పాటలకంటే సంభాషణలు ఎక్కువగా ప్రజాదరణ పొందాయి. ఒకటి కాదు. దాదాపు అన్నీను. వాటిని తూర్పు గోదావరి యాసలో రావు గోపాలరావు చెప్పిన తీరు తెలుగువారికి సాహిత్యంలో భాగమై పోయింది.

సంభాషణలు

మార్చు
  • సెగట్రీ! సూరీడు నెత్తుటి గడ్డలా లేడూ! ఆకాసంలో ఎదో మర్డరు జరిగినట్టు లేదూ.... ఎప్పుడూ యదవ బిగినెస్సేనా. మడిసన్నాక కుసంత కలాపోసనుండాల. తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకూ తేడా ఏటుంటది?
  • అబ్బో ముసలాడు రసికుడేరా! సెరిత్ర సెరిపేత్తే సెరిగిపోదు. సింపేత్తే సిరిగి పోదు.
  • ఓరంత కట్టపడిపోతన్నావేటిరా కొత్తపెళ్ళి కొడకా...ఆ ముక్క నేను లెక్కెట్టుకో మునపే సెప్పాల... డిక్కీలో తోయించేగల్ను జగరత్త
  • మర్డరు కెంత? మెడిసిను సీటుకెంత? కాలు చేయి తియ్యడానికెంత? మర్డరుకూ సీటుకూ ఎంత? వోల్ మొత్తం మీత ఏమయినా కన్సెషను ఉంటుందా? ఈ విసయంలో మీకు నాకు ఒక కాంప్రొమైజ్ కుదిరితే నా జిల్లా మొత్తం తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతాను.

పాటలు

మార్చు
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.