యండమూరి వీరేంద్రనాథ్

యండమూరి వీరేంధ్రనాథ్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు. తూర్పు గోదావరి జిల్లా రాజోలులో యండమూరి చక్రపాణి, నరసమాంబ దంపతులకు నవంబరు 14 1948 లో జన్మించాడు[1]. ఇతడు తెలుగులో సుప్రసిద్ధ నవలా రచయిత. యండమూరి వ్రాసిన చాలా నవలలు చదివేవారిని ఎంతగానో ప్రభావితం చేసేవి. వాటిలో కొన్ని సినిమాలుగా కూడా నిర్మించారు.

ప్రముఖ వ్యాఖ్యలు

మార్చు

ప్రేమ

మార్చు
  • పెళ్లయినప్పుడు జీవిత భాగస్వామిని ప్రేమించడం అన్నిటికన్నా ఆరోగ్యకరమైన ప్రేమ[2]
  • ఒక శరద్రాత్రి, ఏటవాలు క్షణాల మీద నిటారుగా నిలబడి వెన్నెల తీవెల్ని మీటగల అనుభవాన్ని ఇచ్చేదే ప్రేమ. కనురెప్పల మైదానాల మీద కలల విత్తనాలు జల్లి అనుభూతుల పంట పండించేదే ప్రేమ. నీ అద్భుతంలో, నీ అనంతంలో, నీ అద్వితీయంలో నా సర్వస్వం విలీనమవ్వడం ప్రేమ[3]
  • ప్రేమించడానికి హృదయం వుండాలి. ప్రేమింపబడడానికి వ్యక్తిత్వం వుండాలి.[4]
  • ప్రేమ ఇంద్రధనుస్సు అయితే ఆ ఏడు రంగులూ- ఆకర్షణ, అవగాహన, తాదాత్మ్యత, స్పర్శ, కామం, ఓదార్పు.[5]
  • ప్రేమించడానికి ముఖ్యమైన అర్హత వ్యక్తిత్వం. ప్రేమించబడడానికి ముఖ్యమైన అనర్హత ఆధారపడడం.[6]

విషాదం

మార్చు
  • అవతలి మనిషి విసుగును సహనంతో, కోపాన్ని క్షమతో, బలహీనతని ప్రేమతో, తప్పుని నవ్వుతో ఎదుర్కొనే మనిషికి జీవితంలో విషాదం ఉండదు.[7]
  • ఏడ్పులేకపోవడం పరిపూర్ణమైన విషాదానికి ఉచ్ఛ స్థితి.[5]
  • నవ్వుని ఆహ్వానించినట్టే కన్నీటిని కూడా ఒక్కోసారి ఆహ్వానించాలి. లేకపోతే వేదనమీద కృత్రిమమైన జీవన విధానం కరడుకట్టి, స్వభావ సిద్ధమైన వ్యక్తిత్వాన్ని, స్వచ్ఛమైన చిరునవ్వునీ నొక్కిపారేస్తుంది.[2]

జీవితం

మార్చు
  • జీవితం పట్ల అవగాహన ఉన్నవాడు నిస్సారంగా కాలం గడపడం కన్నా ఘోరం ఇంకోటి ఉండదు.[8]
  • జీవితం ఒక లెక్కలాంటిది. చేసిన ప్రతి స్టెప్పూ మళ్ళీ ఒకసారి పరిశీలించి చూసుకుంటే లెక్క తప్పటానికి వీలుండదు.[9]
  • చీకట్లో వున్నామని దిగులు పడుతూ కూర్చుంటే,జీవితం చివరివరకూ అగిపెట్టె గూట్లోనే వుండిపోతుంది.[6]
  • జీవితం నెత్తిమీద అనుభవం మొట్టినప్పుడు కొందరు బాధతో విలవిలలాడుతారు. మరికొందరు నిద్రలోంచి మేల్కొంటారు.[10]
  • జీవితానికి నాలుగు సూత్రాలు. 1. మనం సుఖంగా వుండాలి. 2. మన సుఖం ఎవరికీ ఈ ప్రపంచంలో దుఃఖం కలిగించకూడదు. 3. మన ప్రస్తుత సుఖం మనకి గిల్ట్ ఫీలింగ్ ఇవ్వ కూడదు 4. మన భవిష్యత్తు నాశనం చేయకూడదు.[11]
  • అధ్యయనం చేయాలనుకుంటే మనిషి జీవితంకన్నా గొప్ప వేదం లేదు.[5]
  • ఎదుటివాళ్ళు పెట్టే రూల్స్ వల్ల ఎదుటివాళ్ళే బాగుపడతారు. మనం బాగుపడం[12]

స్త్రీ-పురుష సంబంధాలు

మార్చు
  • ప్రతి మగవాడు ఒక ట్రాన్సిస్టర్. ఒకేట్యూను స్టేషన్లే తేడా.[2]
  • మొగవాడు మంచి అమ్మాయంటే గౌరవం చూపిస్తాడు. తెలివైన ఆడపిల్ల నుంచి ప్రేరణ పొందుతాడు. అందమైన స్త్రీపట్ల ఉత్సుకత చూపిస్తాడు. అర్థంచేసుకోగల అమ్మాయికి తనని తాను అర్పించుకుంటాడు.[13]
  • ఒక స్త్రీ, ఒక స్త్రీ ఎలా మాట్లాడుతుందో, ఒక పురుషుడు తప్పకుండా స్త్రీతో అలా మాట్లాడడు. అలా మాట్లాడాలంటే ఇద్దరికీ ఒక విధమైన అవగాహన, పరిపూర్ణ వ్యక్తిత్వం ఉండాలి.[12]
  • ప్రపంచంలో చాలామంది మంచి మొగవాళ్ళు వుండొచ్చు. కానీ, మంచిభర్తలు మాత్రం చాలా తక్కువ.[7]
  • మనిషి స్వరూపం కష్టాల్లో ఉన్నపుడే బయటపడుతుంది.[14]
  • మనుష్యులు తమకేదైనా కష్టం గానీ, నష్టంగానీ కలిగితే "నేను కాదు. ఇదిగో దీనికి కారణం ఇది." అని వెంటనే ఒక ముగింపు నిర్ణయానికి వచ్చేస్తారు.

మరికొన్ని

మార్చు

ఒక వ్యక్తి ఆడుతూ పాడుతూ బాల్యం గడిపేస్తాడు(అమాయకత్వం). విద్యార్ది దశలో ఇంగ్లీషు భాష అవశ్యకతను గుర్తించడు.(అజ్ణానం). డిగ్రీ పూర్తయ్యేసరికి ఏదోలా మ్యానేజ్ చేయాలనుకుంటాడు(విశ్వాసం). నాలుగైదు ఇంటర్వూల తర్వాత దాని ప్రాముఖ్యం తెలుస్తుంది(జ్ణానం). కోచింగ్ సెంటర్లో చేరి భాషాపరిజ్ణానాన్ని పెంపోందించుకుని ఉద్యోగం సంపాదిస్తాడు(పరిజ్ణానం). అద్బుతంగా మాట్లాడలేకపోయినా ఏదోలా మ్యానేజ్ చేయగలుగుతాడు.(అబ్యాసం). బయటకూడా ఇంగ్లీషులోనే మాట్లాడుతూ దానికి అలవాటు పడిపోతాడు(విజ్ణానం). ఆ విదంగా ఆంగ్ల భాషపై ప్రావీణ్యత సంపాదిస్తాడు(ప్రజ్ణానం). మూలం:- సాక్షి ఆదివారం సంచిక 06 సెప్టెంబరు 2015

మూలాలు

మార్చు
  1. యండమూరి వీరేంధ్రనాథ్ జీవిత సంగ్రహం
  2. 2.0 2.1 2.2 థ్రిల్లర్:యండమూరి వీరేంద్రనాథ్:నవసాహితి ప్రచురణ
  3. అతడే ఆమె సైన్యం:యండమూరి వీరేంద్రనాథ్: నవసాహితీ ప్రచురణ
  4. ప్రేమ:యండమూరి వీరేంద్రనాథ్:నవసాహితీ ప్రచురణ
  5. 5.0 5.1 5.2 ఆనందో బ్రహ్మ:యండమూరి వీరేంద్రనాథ్:నవసాహితి ప్రచురణ
  6. 6.0 6.1 అగ్నిప్రవేశం:యండమూరి వీరేంద్రనాథ్:నవసాహితి ప్రచురణ
  7. 7.0 7.1 ప్రియురాలు పిలిచె:యండమూరి వీరేంద్రనాథ్:నవసాహితి ప్రచురణ
  8. డబ్బు టూది పవరాఫ్ డబ్బు:యండమూరి వీరేంద్రనాథ్:నవసాహితి ప్రచురణ
  9. మరణమృదంగం:యండమూరి వీరేంద్రనాథ్:నవసాహితి ప్రచురణ
  10. దిడైరీ ఆఫ్ మిసెస్ శారద:యండమూరి వీరేంద్రనాథ్:నవసాహితి ప్రచురణలు
  11. దుప్పట్లో మిన్నాగు:యండమూరి వీరేంద్రనాథ్:నవసాహితి ప్రచురణలు
  12. 12.0 12.1 మీరు మంచి అమ్మాయి కాదు:యండమూరి వీరేంద్రనాథ్:నవసాహితి ప్రచురణ
  13. రుద్రనేత్ర:యండమూరి వీరేంద్రనాథ్:నవసాహితి ప్రచురణ
  14. ప్రార్థన:యండమూరి వీరేంద్రనాథ్:నవసాహితి ప్రచురణలు
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.