రతన్ టాటా

వ్యాపారవేత్త.

రతన్ నవల్ టాటా (ఆంగ్లం: Ratan Naval Tata; 1937 డిసెంబరు 28 - 2024 అక్టోబరు 9) భారతదేశ పారిశ్రామికవేత్త, దాత, టాటా సన్స్ కు పూర్వపు చైర్మన్.

వ్యాఖ్యలు

మార్చు
  • ఇనుముని ఎవరూ నాశనం చేయలేరు. దాని తుప్పు తప్ప.మనిషి విషయం లోనూ అంతే. వ్యక్తి ప్రగతికైనా పతనానికైనా అతడి మనసే మూలం. పలు అంశాలకు ప్రభావితమై అది తీసుకునే నిర్ణయాల ఫలితమే అతడి జీవితం.[1]
  • తమకన్నా తెలివైన వారిని సలహాదారులుగా, బృంద సభ్యులుగా నియమించుకొని వారితో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపేవారే ఉత్తమ నాయకులు.
  • పని వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత పాటించడం కాదు, ఆ రెండిటినీ ఏకీకృతం చేయాలనీ నేను చెబుతుంటాను. మీరు చేసే పని మీ వ్యక్తిగత జీవితం అర్ధవంతంగా సంతృప్తికరంగా ఉండేలా చూసుకోండి. అప్పుడు మీ జీవితం పరిపూర్ణమవుతుంది.
  • విజయవంతమైన వ్యక్తులను నేను ఆరాధిస్తాను. కానీ ఆ విజయాలను నిర్ధాక్షిణ్య వైఖరితో సాధించినట్లైతే వారిని నేను మనస్ఫూర్తిగా అభిమానించలేను.
  • వ్యాపార నిర్వహణ విషయంలో ఆధిపత్యం సంపద గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. విలువలు, విశ్వసనీయత పైనే ప్రధానంగా దృష్టిపెట్టాను.
  • జీవితంలో రిస్క్ తీసుకోవక పోవడమే అతి పెద్ద రిస్క్. శరవేగంగా మారుతున్న ప్రస్తుత ప్రపంచంలో, ఓడిపోవడానికి ఉన్న ఏకైక మార్గం సవాళ్లకు భయపడి సాహసోపేత నిర్ణయాలు తీసుకోక పోవడమే. పట్టుదల, ధృడత్వంతో సవాళ్ళను ఎదుర్కొంటే అవే మనల్ని విజయ శిఖరాలకు చేరుస్తాయి.
  • దయ కరుణ సహానుభూతికి ఉన్న శక్తిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకండి. ఇతరులతో మీ సంభాషణలు, సంబంధాలకు ఆ భావోద్వేగాల వెచ్చదనాన్ని అద్దండి. దాని వల్ల ఆ బంధాలు ఎప్పటికీ దృఢంగా నిలిచిపోతాయి.
  • ఎలెక్ట్రోకార్డియోగ్రామ్ (ఈసీజీ) సూచీ తిన్నగా కాకుండా ఎత్తుపల్లాలతో కనిపిస్తుంటేనే మనిషి ప్రాణాలతో ఉన్నట్లు. అదే విధంగా మన జీవితంలో ఎత్తుపల్లాలను చవి చూసినప్పుడే పురోగతి సాధించగలం.
  • సంపద, విలాసాలు, ఖరీదైన వస్తువులు, ఇలాంటి వాటికి జీవితంలో ఎలాంటి విలువ లేదని, మీరు ప్రేమించే వ్యక్తుల శ్రేయస్సే అమూల్యమైనదని మీకు తప్పకుండా తెలిసే రోజు ఒకటి వస్తుంది.
  • మీరు జీవితంలో ఎన్నో కష్టాలు చవిచూస్తుండవచ్చు. ప్రపంచంలోని అన్ని సమస్యలనూ మీరు పరిష్కరించలేకపోవచ్చు. కానీ ఆత్మస్థైర్యంతో ప్రయత్నిస్తే మీరు కూడా ఏదైనా సాధించగలరన్న విశ్వాసాన్ని ఎప్పటికీ కోల్పోకండి.

[2]

రతన్ టాటా గురించిన వ్యాఖ్యలు

మార్చు

మూలాలు

మార్చు
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
  1. ఈనాడు.2024-09-13
  2. ఈనాడు.2024-10-11
"https://te.wikiquote.org/w/index.php?title=రతన్_టాటా&oldid=23500" నుండి వెలికితీశారు