రవీంద్రనాథ్ ఠాగూర్
బెంగాల్ కవి మరియు తత్వవేత్త
రవీంద్రనాథ్ ఠాగూర్ (Rabindranath Tagore) 1861 మే 7వ తేదీన బెంగాల్‌లో జన్మించాడు. ప్రముఖ కవి అయిన ఠాగూర్ 1913లో గీతాంజలి రచనకుగాను నోబెల్ బహుమతి పొంది ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. భారత జాతీయ గీతం "జనగణమణ" కూడా ఠాగూర్ రచించినదే. ఆగస్టు 7, 1941న ఠాగూర్ మరణించాడు.
రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క ముఖ్య వ్యాఖ్యలు
మార్చు- పరబాషా ద్వారా బోధన అంటే సోపానాలు లేని సౌధం లాంటిది.
- కాలం చెక్కిలిపై కన్నీటి చుక్క తాజ్‌మహల్.
- ప్రేమించే వ్యక్తికి దండించే అధికారం కూడా ఉంటుంది.
- మనము ఎవరిని హీనులుగా, నీచులుగా చూస్తామో వాళ్లే మనల్ని క్రమంగా, హేయంగా, దీనంగా చూస్తారు.
- అజ్ఞానమనేది విజ్ఞానము వైపుకు పయనించవచ్చు కానీ మూఢత్వమనేది మరణానికి దారి తీస్తుంది.
- మంచి పనులు చేస్తూ తీరుబాటు లేకుండా ఉండే వ్యక్తికి సుఖంగా జీవించడానికి కాలం దొరకదు.
- ప్రతి గడిచిన రోజూ మనమేదైనా నేర్చుకున్నదై ఉండాలి.
- అబద్దం గురించి కూడా నేను తప్పక నిజమే పలుకుతాను.
- ఎవరైనాసరే నేర్చుకుంటూ ఉంటేనే తప్ప సరిగా బోధించలేరు.
- అసమర్ధులకు అవరోధాలుగా కనిపించేవి సమర్ధులకు అవకాశాలుగా కనిపిస్తాయి.
- జీవితంలో వైఫల్యాలు భారమని గ్రహించేవారు,వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోవచ్చు.
- మనిషి జీవితంలో వచ్చే ప్రతిరోజూ, క్రితం రోజుకన్నా కాస్తో కూస్తో ఎక్కువ విషయాలను నేర్చుకోవాలి.
- నేను పని చేస్తే భగవంతుడు నన్ను గౌరవిస్తాడు. అయితే నేను గానం చేసినపుడు ఆయన నన్ను ప్రేమిస్తాడు.
- కళ్లకి రెప్పలు ఉన్నట్లే పనికి విశ్రాంతి ఉండాలి.
- ప్రేమించే వ్యక్తికీ దండించే అధికారం కూడా ఉంటుంది.
- భర్తకి లోకమంతా ఇల్లు, అయితే స్త్రీకి ఇల్లే లోకం.
- వెలిగే దీపంలాగా ఉండు. అప్పుడే ఇతర దీపములను వెలిగించవచ్చు.
- ప్రేమ గుణం బాగా పెరిగితే లభించే సంపద-పవిత్రత.
- సృష్టి రహస్యాన్ని విశదం చేయగల శక్తి తర్క కౌశలానికి లేదు.
- మనస్ఫూర్తిగా ప్రేమించే స్త్రీల మధ్యలో పురుషులు పసిబిడ్డలు.
- మనిషి జీవితంలో మహదాశయాలూ శిశువుల్లా అవతరిస్తుంటాయి.
- ఒక వ్యక్తి తాను అనుభవించిన ఆనందాన్ని ఇంకొకరిలో కలిగించడానికి చేసే ప్రయత్నమే 'కళ'.
- నువ్వు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే విజయం పది అడుగులు ముందుకు వస్తుంది.
- సౌందర్యం, సత్యం వీటి రసవత్సమ్మేళనమే కళ
- ఆనందంగా ఉండడము ఎంతో తేలిక (సరళం). సరళంగా ఉండడము కష్టము
- వర్తమానంలో చుట్టూ భయంకరమైన చీకటి ఉన్నప్పుడు ఎదో ఒక మార్గం నుండి బయటపడే ప్రయత్నం చేస్తాను . ఒక తలుపు మూసుకుపోతే మరో తలుపు ప్రయత్నిస్తా. అది తెరుచుకోక పొతే నేనే ఓకే ద్వారాన్ని తయారు చేసుకుంటా. [1]
మూలాలు
మార్చు- ↑ ఈనాడు. 2024-11-8