రసెల్ అకాఫ్ (ఆంగ్లం: Russel Lincoln Ackoff, 1919 - 2009) అమెరికా కి చెందిన సంస్థాగత సిద్ధాంతకర్త (Organizational Theorist), ఆచార్యులు మరియు కార్యకలాపాల పరిశోధన (Operations Research), వ్యవస్థాత్మక ఆలోచన (Systems Thinking) మరియు శాస్త్రీయ నిర్వహణ (Scientific Management) వంటి రంగాలలో మార్గదర్శకుడు.

1993 లో రసెల్ అకాఫ్

1950లు మార్చు

  • ఒక చరిత్రగా కన్నా కార్యకలాపాల పరిశోధన (Operations Research) లో ఒక శాస్త్రంగా చెందే అభివృద్ధిలో దాని ప్రక్రియలు, దాని అంశాలు, మరియు దాని సాంకేతికలలో ఉన్నది. కార్యకలాపాల పరిశోధన ఒక ప్రక్రియ కాదు, ఒక సాంకేతికత కాదు; ఇది ఒక శాస్త్రంగా గుర్తింపబడుతోంది, లేదా గుర్తించబడే ప్రక్రియలో ఉన్నది. ఈ శాస్త్రం అభ్యసించే అంశాలతో ఇది ఈ విధంగా నిర్వచించబడినది.

The development of operations research as a science, 1956 మార్చు

  • ఒక సమస్య విడిగా దానంతట అదే ఉండదు; దాని చుట్టూ ఉన్న సృష్టి మరియు సమయంలో మరిన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్య యొక్క నేపథ్యాన్ని ఒక శాస్త్రవేత్త ఎంతగా అర్థం చేసుకొంటాడో, ఆ సమస్యకి సరియైన పరిష్కారం కనుగొనగలిగే అవకాశాలు అతడికి అంత ఎక్కువ.

1990లు మార్చు

  • జీవన ప్రమాణాలు పెరిగే కొద్దీ, మనం చేసే పనుల ద్వారా వాటి అర్థాల ద్వారా కలిగే సరదాని పరిగణలోకి తీసుకోవటం పెరుగుతుంది.

Re-Creating the Corporation (1999) మార్చు

  • సమయం గడిచే కొద్దీ ఆలోచించే ప్రతి విధానం వల్ల పరిష్కరించలేని సమస్యలు ఉద్భవిస్తాయి.
  • ఒక వ్యాపారాన్ని కొన్నప్పుడు దాని సంభావ్యత కోసం కొనబడుతుంది - దాని భవిష్యత్తు కోసం కొనబడుతుంది, దాని గతం కోసం కాదు.