రామోజీరావు
ప్రముఖ వ్యాపారవేత్త, పత్రికా సంపాదకుడు
చెరుకూరి రామోజీరావు (1936 నవంబరు 16 - 2024 జూన్ 8) ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత, తెలుగు దినపత్రిక ఈనాడు వ్యవస్థాపకులు, ప్రధాన సంపాదకులు, ప్రచురణ కర్త. మార్గదర్శి చిట్‌ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి మొదలగు వ్యాపార సంస్థల అధినేత. రామోజీ ఫిల్మ్ సిటీని రామోజీరావు నిర్మించాడు.
వ్యాఖ్యలు
మార్చుఈనాడు. 2024.11.16. [1]
- జీవితంలో చైతన్యం ఎప్పుడూ ఓటమి తోనే ప్రారంభ అవుతుంది. ప్రతి ఎదురు దెబ్బ లోనూ ఒక అవకాశం నిగూఢంగా దాగి ఉంటుంది. దాన్ని సరైన సమయంలో గుర్తించి అప్రమత్తంగా ఉండాలి. అదే విజయానికి నాంది పలుకుతుంది.
- నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఎంతసేపు ఆలోచించాలో అంతసేపే ఆలోచించాలి. కాలయాపన చేసి అవకాశాలను వదులుకోవద్దు. సాహసవంతులు, కార్యసాధకులను మాత్రమే విజయం వరిస్తుందని నిజాన్ని ఎప్పుడూ మరవొద్దు. గెలుపు సాధించడం కన్నా ...దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా ముఖ్యం.
- మనందరిలోను అపరిమితమైన శక్తి ఉంటుంది. దాన్ని తెలుసుకోవడంలోనే అంతా ఉంది. మనకేం కావాలో ఏం వద్దో మన మనస్సు, శరీరమే చెబుతాయి. గ్రహించగలిగే శక్తి ఉంటే ఆ ప్రకారం నడుచుకుంటే అంతా సవ్యంగానే ముందుకు సాగుతుంది . ఈ ప్రయాణంలో ఎంత చేయాలన్న దానికి పరిమితులు, కొలమానాలు ఏమీ లేవు. చెయ్యాలన్న చిత్తశుద్ధి, చేసి చూపాలన్న దృఢ దీక్ష మాత్రమే కావాల్సింది. అప్పుడు అద్భుతాలు వాటంతట అవే సాకారం అవుతాయి.
- ఈనాడును ప్రారంభించిన రోజు , అది నంబర్ - 1 గా నిలిచినా రోజు . ప్రతిరోజూ కొత్తదనం కోసమే నా ఆరాటం. ఈ క్రమం లో చేపట్టే ప్రయోగాలు విఫలం కావచ్చు. అయినా సరే, అదే నా విధానం.
- సరైన మార్గంలో నడువు . ఈ ప్రపంచంలో ఏ శక్తీ నిన్ను ఏమీ చేయలేదు . అదే నిన్ను ముందుకు కదిలించే సూత్రం . నేను ఏదైనా పని ఒకసారి మొదలుపెడితే దానిని పూర్తి చేసినప్పుడే ఆపేది . ఏదైనా సరే . మధ్యలో వదలి పెట్టను. అది నా స్వభావం. ప్రేరణ అదే . నన్ను నడిపించే శక్తి అదే .
- మారుతున్న ప్రపంచం తో మనమూ మారాలి. పురోగతి దిశగా కాలానుగుణమైన పరివర్తన సాధించడం అవసరం. ఈ భూమి పుట్టినప్పటి నుంచి మార్పు ఒక్కటే శాశ్వతమైనది.
- ఏ వ్యాపకానికైనా క్రమశిక్షణ అనేది అన్నింటికన్నా ముఖ్యం. సంస్థ నాయకుడు క్రమశిక్షణను పాటిస్తేనే మిగతా వాళ్ళు అనుసరిస్తారు. క్రమశిక్షణ వలన నేను పొందిన ప్రయోజనం నాకు దానిపై నమ్మకాన్ని పెంచింది .
- నాకు స్ఫూర్తి ఏ ఒక్కరో అని చెప్పలేను. మన చుట్టూ ఉన్న ప్రపంచమే ఒక పెద్ద పాఠశాల. ఒకరిద్దరు వ్యక్తుల నుంచి కాకుండా మొత్తం సమాజం నుంచే స్ఫూర్తి పొందాను.
- క్రమశిక్షణ, కష్టపడడం , కలిసి పనిచేయడం ఇవే నా విజయానికి మూల కారణాలు.
మూలాలు
మార్చు- ↑ ఈనాడు. 2024-11-16.