రామ్ గోపాల్ వర్మ

దర్శకుడు, నిర్మాత

రామ్ గోపాల్ వర్మ (జ. ఏప్రిల్ 7, 1962) ఒక ప్రముఖ తెలుగు, భారతీయ సినిమా దర్శకుడు, నిర్మాత. అతను సాంకేతికంగా పరిణితి చెందిన, మాఫియా, హార్రర్ నేపథ్యం కలిగిన చిత్రాలను తీయడంలో సిద్ధహస్తుడు. [1]

రామ్ గోపాల్ వర్మ బూత్ రిటర్న్స్ ప్రచార సమయంలో (సెప్టెంబర్ 2012)


వ్యాఖ్యలు

మార్చు
  • నేను నాస్తికుడిని, నేను దయ్యాలను నమ్మను.[2]
  • నాకు ఇష్టమైన ధర్మం ఏదీ లేకపోవడమే.
  • భాష ఒక కమ్యూనికేషన్ సాధనం మాత్రమే; అనేది కంటెంట్ ఒక సినిమా భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది.
  • రియల్ పర్సన్ అయినా, సెలబ్రిటీ అయినా ఎవరి మీదైనా క్రష్ ఉంటుంది.
  • భావోద్వేగాలను అందరికంటే ఎక్కువగా అర్థం చేసుకుంటాను. జీవశాస్త్రవేత్త వివిధ జాతులను అధ్యయనం చేసినట్లుగా నేను భావోద్వేగాలను అధ్యయనం చేస్తాను.
  • భగవంతుడు సృష్టించిన అత్యంత అందమైన, అత్యంత సున్నితమైన మహిళ శ్రీదేవి అని, వెయ్యి సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఆమెలాంటి అద్భుతమైన కళాఖండాలను సృష్టిస్తాడని నేను అనుకుంటున్నాను.
  • కృతజ్ఞతపై నాకు నమ్మకం లేదు.
  • ప్రతి ఒక్కరికి నోరు ఉంటుంది కాబట్టి, ప్రతి ఒక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది.
  • నేను ఏ సినిమా చేసినా జనాలకు నచ్చేలా చేయడమే నా ఉద్దేశం.
  • బోనీకపూర్ కిచెన్‌లో శ్రీదేవి టీ తయారు చేయడం చూసి చాలా నిరుత్సాహం కలిగింది. నేను అతనిని క్షమించను ఎందుకంటే అతను దేవదూతను స్వర్గం నుండి తన అపార్ట్మెంట్ వంటగదికి తీసుకువచ్చాడు.
  • ఒక దర్శకుడికి పాత్రల పట్ల మక్కువ ఉండటం ముఖ్యమని నేను నిజాయితీగా భావిస్తాను.


మూలాలు

మార్చు
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.