రాయప్రోలు సుబ్బారావు

రచయిత, కవి

నవ్య కవితా పితామహునిగా పేరుపొందిన రాయప్రోలు సుబ్బారావు (1892 - 1984) తెలుగులో భావ కవిత్వానికి ఆద్యుడు. ఈయన 1913లో రాసిన తృణకంకణముతో అమలిన శృంగార తత్వాన్ని ఆవిష్కరించాడు. ప్రేమ పెళ్లికి దారితీయని యువతీ యువకులు స్నేహితులుగా మిగిలిపోవడానికి నిర్ణయించుకున్న ఇతివృత్తముతో ఖండకావ్య ప్రక్రియకు అంకురార్పణ చేశాడు.

   ఏ దేశమేగినా ఎందుకాలిడినా
   ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనిన
   పొగడరా నీ తల్లి భూమి భారతిని
   నిలుపరా నీ జాతి నిండు గౌరవము
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.