లతా మంగేష్కర్

భారతీయ మహిళా చలనచిత్ర గాయకురాలు

లతా మంగేష్కర్ (జననం సెప్టెంబర్ 28, 1929 - ఫిబ్రవరి 6, 2022), ప్రముఖంగా లతాజీ అని పిలుస్తారు,భార తీయ గాయని, సంగీత-స్వరకర్త కూడా. ఏడు దశాబ్దాలకు పైగా ఆమె గాన జీవితంలో ఆమె భారతదేశంలోని అత్యంత ప్రశంసించబడిన నేపథ్య గాయని. ఆమెని "మెలోడీ క్వీన్" అనే పేరుతో పిలుస్తారు. ఆమె సినిమా పాటలకు లెక్కలేనన్ని అవార్డులను గెలుచుకుంది భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న గ్రహీత. ఆమె ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును కూడా అందుకుంది. ఆమె 1974 నుండి 1991 వరకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం పొందింది.

లతా మంగేష్కర్

వ్యాఖ్యలు మార్చు

  • నిజానికి నన్ను గాయకురాలిగా మార్చింది బాహ్య ప్రభావాలు కాదు. సంగీతం నాలో ఉండేది. నేను దానితో నిండిపోయాను.
    • Quotations by 60 Greatest Indians. Dhirubhai Ambani Institute of Information and Communication Technology.
  • ప్రజలు జీవితంలో అద్దాలు, నీడలు" వంటి స్నేహితులు కలిగి ఉండాలి. అద్దాలు అబద్ధాలు చెప్పవు, నీడలు ఎప్పటికీ వదలవు.
    • Quotes. The Sunday Indian. Retrieved on 29 November 2013.
  • మహ్మద్ రఫీ సాబ్, నేను రాయల్టీ హక్కుల కోసం పోరాడాము. ప్రముఖ గాయకులు, సంగీత విద్వాంసులు హాజరైన సమావేశంలో, అతను లేచి నిలబడి, నేను ఇప్పటినుంచి లత తో పాడను (మైన్ ఆజ్ సే లతా కే సాథ్ నహీన్ గావుంగా) అన్నాడు. నేను ప్రతిస్పందించాను, రఫీసాబ్, ఒక నిముషం, మీరు నాతో పాడరు, ఇది తప్పు మాట, నేను మీతో పాడను అని.('ఏక్ మినిట్. ఆప్ నహీం గాయేంగే మేరే సాథ్ యే గలాత్ బాత్ హై. మెయిన్ ఆప్కే సాథ్ నహిన్ గావుంగీ'). నేను బయటకు వచ్చి, నా స్వరకర్తలందరినీ అక్కడికి పిలిపించి, రఫీ సాబ్‌తో డ్యూయెట్ అయితే మరొక గాయనిని పెట్టుకోమని చెప్పాను.
    • Hindustan Times. 7 November 2012. Retrieved on 29 November 2013.
  • నేను మాట్లాడేటప్పుడు, నా ఉర్దూ బాగా ఉండదు, కానీ నేను పాడేటప్పుడు నా పలకడంలో లోపాలు లేకుండా చూసుకుంటాను. నేను మొదట భాష మాట్లాడే, ఇంకా నాకు సాహిత్యం చదివే వ్యక్తిని వింటాను. నేను ఉచ్చారణపై చాలా శ్రద్ధ చూపుతాను. ఒక్కసారి మాట్లాడే మాటలు విని, పాటల పంక్తులను హిందీలో ఫొనెటిక్‌గా రాసి పాడతాను. భగవంతుని దయ వల్ల బెంగాలీతో సహా ఇతర భాషల్లో నా పాటలు ప్రశంసించబడ్డాయి. ప్రజలు మంచివారని పదాలను సరిగ్గా ఉచ్చరించారని చెప్పారు.
    • Above two quotes about her singing in Urdu and other languages in Lata Mangeshkar has to thank Dilip Kumar for her Urdu skills!. India Today. Retrieved on 29 Npvember 2013.
  • నేనే శతాబ్దపు వాణి అని చెబితే, శతాబ్దపు రచయిత ఆయనే అని అంటాను.
    • గుల్జార్ తన 87వ పుట్టినరోజు సందర్భంగా
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.