లాల్ కృష్ణ అద్వానీ
భారత మాజీ ఉప ప్రధాని, హోం మంత్రి, భాజపా మాజీ అధ్యక్షుడు
భారతీయ జనపా పార్టీ అగ్రనేతలలో ప్రముఖుడైన లాల్ కృష్ణ అద్వానీ 1927 నవంబర్ 8న కరాచిలో జన్మించాడు. 15 సం.ల వయస్సులోనే ఆర్.ఎస్.ఎస్.లో ప్రవేశించాడు. ఆ తరువాత దేశ రాజకీయాలకే అంకితమయ్యాడు. భారతీయ జనసంఘ్ పార్టీలో చేరి అనతి కాలంలొనే ముఖ్య పదవులు పొందినాడు. 1967లో ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ అధ్యక్షుడైనాడు. 1977లో మురార్జీ దేశాయ్ ప్రభుత్వంలో మంత్రిపదవికి పొందినాడు. 1980లో భాజపా ఏర్పడిన తరువాత దేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహిస్తునాడు.