వంశీ తెలుగు సినిమా దర్శకుడు మరియు రచయిత. అసలు పేరు నల్లమిల్లి భామిరెడ్డి. ఆయన హాస్యభరితమైన, గోదావరి అందాలు ఆవిష్కరించే సినిమాలు తీయడంలో తనకంటూ ప్రత్యేకమైన ముద్రను ఏర్పరుచుకున్నారు. గోదావరి ప్రాంత జీవనం గురించి ఆయన రాసిన మా పసలపూడి కథలు, దిగువ గోదావరి కథలు వంటివి సాహిత్యకారునిగా ప్రఖ్యాతి తెచ్చిపెట్టాయి.

వ్యాఖ్యలు

మార్చు
 
ఈ గోదాట్లో వరద నీరూ, బురద నీరూ, తేట నీరూ, ఊట నీరూ, పారే నీరూ, ఊట నీరూ, నిలవ నీరూ, అన్నీ... అన్నీ నాకు పవిత్రమే అన్నీ నాకు సచిత్రమే
  • లాంచి లోంచి ఎటు చూసినా ఎత్తయిన పాపికొండలే. ఆ కొండల మధ్య సన్నటి గోదారి తల్లి. ధవిళేశ్వరం దగ్గర ౩కిలోమేటర్లు ఉండే గోదారి ఇక్కడ కన్నెపిల్ల జడలాంటి సన్నటి గోదారైంది. ఈ గోదారి తల్లి నాకు రకరకాల మూలల్లో రకరకాలుగా ఒక తల్లిలా, ఒక చెల్లిలా, ఒక ప్రేయసిలా, ఒకే కాలంలో ఒకే బంధంలా అందంగా కనిపిస్తుంది. ఈ గోదాట్లో వరద నీరూ, బురద నీరూ, తేట నీరూ, ఊట నీరూ, పారే నీరూ, ఊట నీరూ, నిలవ నీరూ, అన్నీ... అన్నీ నాకు పవిత్రమే అన్నీ నాకు సచిత్రమే... అందుకే నాకనిపిస్తుంది తల్లి గోదావరి నాకు పరిచయం కావడం గత జన్మ సుకృతం. ఈ పరమ పవిత్రమైన గోదావరి తీరంలో చివరిదాకా ప్రయాణం చేయాలి.
    • మా గోదావరి తల్లి, ఈనాడు ఆదివారం .
  • ఇళయరాజా, బాపూ, భారతీరాజా, విశ్వనాథ్, బాలచందర్, పుట్టణ్ణకణగాళ్ వీళ్ళంతా చాలా గొప్పవాళ్ళు నాకు. నేను డెరైక్టర్ కావడానికి కారకులు, నా గురువులు.
"https://te.wikiquote.org/w/index.php?title=వంశీ&oldid=13344" నుండి వెలికితీశారు