వరుణ్ తేజ్

సినీ నటుడు

వరుణ్ తేజ్ భారతీయ సినిమా నటుడు. ఇతను నటుడు, నిర్మాత నాగేంద్రబాబు, పద్మజల కుమారుడు. ఆయన పెదనాన్న సినిమా నటులు, రాజకీయ నాయకులైన చిరంజీవి, చిన్నాన్న పవన్ కళ్యాణ్ లు. తేజ్ టాలీవుడ్ లో పొడవైన వ్యక్తులలో ఒకరు. ఆయన ఎత్తు సుమారు 6 అడుగుల 4 అంగుళాలు ఉంటుంది. ముకుంద, "కంచె", లోఫర్, మిస్టర్, ఫిదా, అంతరిక్షం, ఎఫ్ 2 మొదలైనవి వరుణ్ నటించిన సినిమాలు[1]

వరుణ్ తేజ్ కొణిదెల

వ్యాఖ్యలు

మార్చు
  • నన్ను మంచి వ్యక్తిగా ముద్ర వేయడం కంటే మంచి నటుడిగా పిలవడం మంచిది. నేను ఇంతకాలం దాని కోసం కృషి చేస్తున్నాను, నేను మరింత ముందుకు వెళ్లగలనని ఆశిస్తున్నాను, ఎందుకంటే ఇది నా ప్రధాన లక్ష్యం.[2]
  • 'మిస్టర్' ఫెయిల్యూర్ నుంచి చాలా త్వరగా బయటపడ్డాను. నాకు కేవలం మూడు రోజులు పట్టింది.
  • నేను ఏం చేయాలి అని జనాలు ఏమనుకున్నా, నేను తర్వాత ఎలాంటి సినిమా చేయాలనుకుంటున్నానో ఎంచుకుంటాను. ఇది ఎల్లప్పుడూ సరైన సమయంలో పనులు జరగడం గురించి అని నేను నమ్ముతాను.
  • రామ్ చరణ్ ను కలిసినప్పుడు నా సినిమాలు ఎంత తీస్తాయో అని కంగారు పడొద్దని చెప్పారు. 'మగధీర' తర్వాత ఆయన నుంచి జనాలు పెద్ద పెద్ద విషయాలు ఆశించడం మొదలుపెట్టారు. అందుకే ఆ అంచనాలకు తగ్గట్టు సినిమాలు చేశాడు. ఆ ఉచ్చులో పడొద్దని సలహా ఇచ్చారు.
  • సినిమాలంటే నాకు ఏ వయసులో ఈ ప్రేమ పెరిగిందో చెప్పలేను కానీ సినిమాలు చూసి ఎంజాయ్ చేశాను. మా పెద్దనాన్న చిరంజీవి, చిన్నాన్న పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తూ పెరిగాను.
  • బేసిక్ గా నేను పెద్ద సినిమా అభిమానిని, అన్ని రకాల సినిమాలు చూడటానికి ఇష్టపడతాను.
  • మా నాన్న నిజాయతీపరుడు, నిర్మొహమాటంగా ఉంటాడు. నేను చెప్పనవసరం లేదు, ఎందుకంటే ఇది అందరికీ తెలుసు.
  • నేను నటుడిని కావాలనుకున్నప్పుడు, ఈ విషయాన్ని నా తల్లిదండ్రులకు చెప్పడానికి భయపడ్డాను. కానీ ఒకసారి పెద్దనాన్న చిరంజీవి గారు నాకు హీరో అయ్యే క్వాలిటీస్ ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత తొలిసారి నేను నటుడిని కావాలనుకుంటున్నానని చెప్పాను. ఈ విషయాన్ని మా అమ్మానాన్నలకు చెప్పడంతో అందరూ సంతోషించారు.
  • హాలీవుడ్ సినిమాలు చూసినప్పుడల్లా టాలీవుడ్ ఇలాంటి సినిమాలు ఎప్పుడు చేస్తుందనే ఫీలింగ్ ఉండేది.

మూలాలు

మార్చు