వర్జీనియా వుల్ఫ్
వర్జీనియా వుల్ఫ్ ఇరవయ్యవ శతాబ్దపు ఆధునికవాద/స్త్రీవాద సాహిత్య ప్రముఖులలో అగ్రగామిగా పరిగణిం
వర్జీనియా వుల్ఫ్ (25 జనవరి 1882 - 28 మార్చి 1941) ఇరవయ్యవ శతాబ్దపు ఆధునికవాద/స్త్రీవాద సాహిత్య ప్రముఖులలో అగ్రగామిగా పరిగణించబడే ఒక బ్రిటిష్ రచయిత్రి. ఆమె పేరు అడెలిన్ వర్జీనియా స్టీఫెన్. లెస్లీ, జూలియా ప్రిన్‌సెప్ స్టీఫెన్‌ల రెండవ కుమార్తె, 25 జనవరి 1882న జన్మించింది.
వ్యాఖ్యలు
మార్చుబ్రెయినీ కోట్[1]
- జీవితాన్ని తప్పించుకోవడం ద్వారా మీరు శాంతిని పొందలేరు
- సరిగ్గా భోజనం చేయకపోతే బాగా ఆలోచించలేరు, బాగా ప్రేమించలేరు, బాగా నిద్రపోలేరు.
- కొంతమంది పూజారుల వద్దకు వెళ్తారు; ఇతరులు కవిత్వానికి, నేను నా స్నేహితుల దగ్గర.
- మీరు మీ గురించి నిజం చెప్పకపోతే ఇతరుల గురించి చెప్పలేరు.
- మిగిలిన వారు జీవితానికి విలువ ఇవ్వాలంటే, ఎవరైనా చనిపోవాలి.
- నా మెదడు నాకు చాలా లెక్కకు మించిన యంత్రాల సమూహము. ఎల్లప్పుడూ సందడి చేస్తూ, చిన్నగా నోటిలో పాడుకుంటూ (హమ్), ఎగురుతు,అరుస్తూ, దూకుతూ (డైవింగ్) ఉండి ఆపై మట్టిలో పాతిపెట్టబడింది. ఎందుకు? ఈ ఉద్వేగం దేనికి?
- ఇతరుల కళ్లు మన బందిఖానాలు, వారి ఆలోచనలు మన పంజరాలు.
- చరిత్రలో చాలా వరకు, మహిళ అనామక.
- జీవితం అనేది సుష్టంగా అమర్చబడిన గిగ్ దీపాల శ్రేణి కాదు; జీవితం అనేది ఒక ప్రకాశించే శూన్యం. చైతన్యం ప్రారంభం నుండి చివరి వరకు మన చుట్టూ ఉన్న ఆర్ద పారదర్శక ఆవరణము(ఎన్వలప్).
- ఒక మహిళగా నాకు దేశం లేదు. ఒక మహిళగా నా దేశం మొత్తం ప్రపంచం.
వుల్ఫ్ గురించి
మార్చు- నా యుక్తవయస్సులో నాపై పెద్ద ప్రభావాన్ని చూపిన ఆంగ్ల రచయితలు సర్ వాల్టర్ స్కాట్, జేన్ ఆస్టిన్,బ్రోంటే సిస్టర్స్, చార్లెస్ డికెన్స్, బెర్నార్డ్ షా, ఆస్కార్ వైల్డ్, జేమ్స్ జాయిస్, D.H.లారెన్స్, వర్జీనియా వుల్ఫ్.
- ఇసాబెల్ అలెండే ఇంటర్వ్యూ
- ఆధునిక రచయితలలో, వర్జీనియా వుల్ఫ్ స్త్రీలను తన ఆలోచనా కేంద్రంగా ఉంచడానికి నిరంతరం ప్రయత్నించింది. కానీ ఆమె సప్ఫో వంటి ధైర్యం, ఇంకా అందరినీ కలుపుకుని పోవడం వంటివి చేయలేదు. ఆమె అయోగ్యంగా, క్షమాపణతో, స్వీయ నిరాశ స్వరంతో చేసింది. ఇది స్పష్టంగా కనిపిస్తుంది, ఉదాహరణకు, ఎ రూమ్ ఆఫ్ వన్'స్ ఓన్‌లో, దాని శైలి, స్వరం, దాని స్పష్టమైన యాదృచ్ఛిక "స్త్రీ" ఆలోచనల వాతావరణంలో, ఆమె మేధస్సును, నిజమైన శక్తిని ముసుగు చేయడానికి ఒక ఆవిష్కరణ.
- బెట్టినా ఆప్తేకర్ టేప్‌స్ట్రీస్ ఆఫ్ లైఫ్: ఉమెన్స్ వర్క్, ఉమెన్స్ కాన్షియస్‌నెస్, అండ్ ది మీనింగ్ ఆఫ్ డైలీ ఎక్స్‌పీరియన్స్ (1989)